ఎందులకో?
అందాలను చూడలేని జీవితాలు ఎందులకో
ఆనందము పొందలేని జీవితాలు ఎందులకో
సంతసాలు పంచాలని కోరికలు తీర్చటానికి
చెలికత్తెయ చెంతలేని జీవితాలు ఎందులకో
ముచ్చటగా మాటలాడి వదనాలను వెలిగిస్తూ
చిరునగవులు చిందలేని జీవితాలు ఎందులకో
దగ్గరగా పిలుచుకోని చేతిలోకి తీసుకోని
సరసాలను ఆడలేని జీవితాలు ఎందులకో
ప్రియురాలిని చక్కంగా తగినరీతిన చూచుటకు
సంపాదన ఏమిలేని జీవితాలు ఎందులకో
మంచిమంచి పనులుజేసి మిత్రులకు సాయపడుతూ
హృదయాలు తాకలేని జీవితాలు ఎందులకో
ఎప్పుడునూ తియ్యదనాలు పంచలేని చప్పగున్న
ఏమాత్రమూ రుచిలేని జీవితాలు ఎందులకో
గాడిదల్లా కూస్తూ నక్కల్లా ఊళలేస్తూ
పలుకులలో తీపిలేని జీవితాలు ఎందులకో
గళమునెత్తి శ్రావ్యంగా ఆలాపనలను వినిపించ
రాగాలను పలకలేని జీవితాలు ఎందులకో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment