చిందిస్తా 


అజ్ఞానం వీడుటకు అక్షరజ్యోతులు చిందిస్తా

అంధకారం తొలగుటకు దీపకాంతులు చిందిస్తా 


జాబిల్లిని పిలిచి మాట్లాడి రప్పించి ఒప్పించి  

రాత్రి విహరించుటకు వెన్నెల వెలుగులు చిందిస్తా 


నిద్రమత్తు వదిలించి దినసరిపనిలో దించుటకు

పొద్దు పొడవడానికి సూర్య కిరణములు చిందిస్తా 


తియ్యనైన మాటలతో ముచ్చటైన కబుర్లతో 

మదులు మురిపించుటకు మోముల నవ్వులు చిందిస్తా 


మిలమిలలతో ధగధగలతో నింగిలో కనిపించి   

కళ్ళను ఆకట్టుటకు తారల తళుకులు చిందిస్తా 


అందాలవలను విసిరి ఆనందాల ఎరనుజూపి

ప్రేమలో దించుటకు భామల నిగ్గులు చిందిస్తా


నీలాకాశంలో పెళపెళా ఉరుములు మ్రోగించి 

అంబుదాలను ఢీకొట్టించి మెరుపులు చిందిస్తా 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog