వచ్చేయ్ మిత్రమా!


నీళ్లను చల్లేయ్

నిప్పును ఆర్పేయ్

ప్రేమను పంచేయ్

మనసును గెలిచేయ్


పెదవులు తెరిచేయ్

తేనెలు చిందేయ్

నవ్వులు చిందేయ్

మోములు వెలిగించేయ్


కన్నీళ్లను తుడిచేయ్

కష్టాలను తీర్చేయ్

ఆశలను నింపేయ్

ఆత్మీయత చాటేయ్


అందాలు చూపేయ్

ఆనందాలు ఇచ్చేయ్

తోడుగా వచ్చేయ్

నీడగా నిలిచేయ్


చిరునామా వెదకేయ్

చెలిమిని పెంచేయ్

దూరాలను చెరిపేయ్

దోస్తీని పదిలపరచేయ్


కబుర్లు చెప్పేయ్

కుతూహలము రేపేయ్

ఊహలు ఊరించేయ్

భావాలు విప్పేయ్


అక్షరాలను అల్లేయ్

అనురాగము నింపేయ్

కవితగా మారేయ్

కాలాన్ని గెలిచేయ్


పదాలను పేర్చేయ్

పదాలకు సొగసిచ్చేయ్

కవితలు రాసేయ్

హృదులను దోచేయ్


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog