వాన... వాన... వాన!


వానాకాలం వచ్చిందంటే —

వయ్యారాల ప్రకృతి విరిసినట్టే!

వాన చినుకులు నేలను తాకితే —

వసుధకు ముత్యాల హారmEsiనట్టే!


వానమబ్బులు కమ్ముకుంటే —

నీలాకాశానికి నల్లని పంజరం!

మెరుపుల తీగలు మెరిసిపోతే —

మబ్బుల ముంగిట విద్యుత్ తోరణం!


వాన చినుకులు పలకరిస్తే —

పుడమి పులకింతల పల్లki!

మట్టి పరిమళం గుబాళిస్తే —

మనసులో మధురానుభూతుల మల్లెపందిరి!


వాన తలుపులు తెరుచుకుంటే —

వాగుల వంకల గలగల నాట్యం!

చెరువులు నిండుగా తొణికిసలాడితే —

చేల సీమల్లో పచ్చని కావ్యం!


వాన ధ్యానంలో ప్రకృతి మునిగితే —

మౌనమే మధురమైన సంగీతం!

చినుకుల జపమాల సాగుతుంటే —

చిగురుటాకులపై జలతారు నృత్యం!


వాన చినుకుల సవ్వడిలో —

కవితల ఊహలు రెక్కలు విప్పుతాయి!

వాన మబ్బుల నీడలో —

భావాల మేఘాలు కవితలు కురిపిస్తాయి!


వాన పాటలు వినిపిస్తే —

వసంతమే గొంతెత్తి పాడినట్టు!

కప్పల బెకబెకలు వినిపిస్తే —

కర్షకుడి గుండెలో ఆశలు మొలిచినట్టు!


మబ్బుల ముసుగులో బందీ అయిన —

సూరీడు మబ్బుల చాటున దాగినా!

వెండి వెన్నెల మళ్లీ విరిసే —

విశ్వాసమే మనకు వెలుగుబాట!


వానంటే కేవలం జలధార కాదు —

జీవన సౌభాగ్యాల జలపాతం!

వానంటే ప్రకృతి రాసిన ప్రేమలేఖ —

విశ్వమంతా చదివే సౌందర్య గీతం!


వానలు మెండుగా  కురవాలి —

వాడినబతుకుల్లో ఆశల దీపాలు వెలగాలి  ,

పుడమి పచ్చదనంతో పరవశించాలి —

ప్రజలగుండెల్లో ఆనందం జలపాతాలు పొంగాలి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog