Posts

Image
 కల్లాకపటం తెలియనివాడా! కల్లాకపటం తెలియనివాడా లోకంపోకడ తెలుసుకోరా! గట్టిగవుంటే పిండిచేస్తరు మెత్తగవుంటే పిసికివేస్తరు భయపడ్డావంటే వెంటపడతరు ఎదురుతిరిగితే వెనకడుగేస్తరు పైసాలుంటే పక్కకొస్తరు పర్సుఖాళీగుంటే పారిపోతరు బెల్లముంటే ఈగలుమూగుతయి చెరువునిండితే కప్పలొస్తయి మంచిగవుంటే చెడగొట్టచూస్తరు వినకపోతే విమర్శిస్తరు పరుగెడుతుంటే పడగొట్టేస్తరు నడుస్తుంటే నిలదీచేస్తరు కళ్ళుతెరిస్తే కారంచల్లుతరు నోరుతెరిస్తే గొంతునొక్కుతరు బాగుపడుతుంటే చూడలేకుంటరు పేరొస్తుంటే ఓర్వలేకుంటరు అందంగుంటే అసూయపడతరు ఆనందంగుంటే తట్టుకోలేకుంటరు అన్నెంపున్నెం ఎరగనివాడా మంచిచెడులను ఎరిగిమెలగరా! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 డాక్టర్ల దారుణాలు చికిత్సాకేంద్రాలు విరివిగా వెలుస్తున్నాయి మనుషులప్రాణాలకు వెలలు కడుతున్నాయి ప్రభుత్వవైద్యశాలలు నిష్ప్రయోజనాలవుతున్నాయి వ్యాపార చికిత్సాలయాలు సామాన్యుల నడ్డివిరగకొడుతున్నాయి దొరికినంత దారుణంగా దోచుకుంటున్నాయి దవాఖానాలు అనారోగ్యాన్ని ఆసరాగాతీసుకొని అక్రమాలుచేస్తున్నాయి ఆసుపత్రులు డాక్టర్లు దంపతులయి ద్విపాత్రాభినయనాలను చేస్తూ  దగాచేసి రెండుచేతులా డబ్బులు కొట్టేస్తున్నారు   మందుల దుఖానాలు ధరలుపెంచి డిస్కౌంటులంట్లుచెప్పి డాక్టర్లతో కుమ్మక్కయి  దోపిడీలుచేస్తున్నారు వైద్యశోధనలంటు వివిధ పరీక్షలు వ్రాసి  కమీషనులు కొట్టేస్తున్నారు  బిషక్కులు వైద్యో నారాయణోహరి ఒకప్పుడు డబ్బుపైకన్నేసే డాక్టరుగిరి మరిప్పుడు జబ్బులు రాకుండా జాగ్రత్త పడండి కర్మకాలి రోగాలొస్తే ఖర్చుపెట్టటానికి సిద్ధపడండి హాస్పటలు పాలయిన కుటుంబం దొంగలపడ్డ ఇంటితో సమానం కార్పొరేటు వైద్యశాలలు కాస్టిలీయస్టుగా మారాయి కాసులు కొట్టేయటానికి కేంద్రాలుగా మారాయి  అప్పుడు వైద్యుడు దేవుడితో సమానం ఇప్పుడు వైద్యగానికిపొతే పోతాయిప్రాణాలని అర్ధం కార్పొరేటు వైద్యం కాసులకు కనాకష్టం ప్రభుత్వ వైద్యగం ప్ర...
Image
 కవితాజల్లులు కవిత కలలోకి వస్తుంది కవ్వించి పోతుంది కైతలను కూర్పిస్తుంది కవితమ్మ కన్మోడ్పునుండి లేపుతుంది కలమును చేతపట్టిస్తుంది కాగితాలమీద వ్రాయిస్తుంది కవితాసుందరి ఆలోచనలు పారిస్తుంది భావాలు బయటపెట్టిస్తుంది కవనకడలిలో ముంచేస్తుంది కవితాకన్యక అక్షరాలను అల్లిస్తుంది పదాలను పారిస్తుంది కవిత్వాన్ని పొంగిస్తుంది కవితాబాల అందాలను చూపుతుంది ఆనందాల నిస్తుంది ఆపై ముగ్గులోకిదింపుతుంది కవితాఝరి తోడుకు పిలుస్తుంది తనివి తీరుస్తుంది తడిపి ముద్దచేస్తుంది కవితాకుసుమం విచ్చుకుంటుంది వినోదపరుస్తుంది విందుకుపిలుస్తుంది కవితాకాశం కిరణాలను వెదజల్లుతుంది కౌముదిని కురిపిస్తుంది కళ్ళకు కాంతులిస్తుంది కవితారణ్యం కొండాకోనల కాంచమంటుంది కోకిలల గానాన్నివినమంటుంది కేకుల నర్తనాన్ని చూడమంటుంది   కవితాలోకం స్వాగతంపలుకుతుంది స్థానమిస్తానంటుంది స్థిరంగానిలచిపొమ్మంటుంది కవితే నా సుందరి కవిత్వమే నా ఊపిరి కవనమే నా దారి కవితలే నా గురి కవనరంగమే నా కులాస కవితాలోకమే నా ధ్యాస కవితలకూర్పే నా ప్రయాస కవితానందమే నా భరోస కవులంటే నాకిష్టం కవితలంటే నాకుప్రాణం పాఠకులంటే నాకభిమానం ప్రశంసలంటే నాకు ప్రోత్సాహం గుండ్లపల్లి రాజేం...
Image
 మాటతీరు నోరే నేస్తము మాటలే మానము అప్యాయంగా  మాట్లాడితే అభిమానమును చూరగొంటావు ఆవేశంగా మాట్లాడితే అనార్ధాలను తెచ్చుకుంటావు అధికంగా మాట్లాడితే వదరబోతుగా ముద్రవేసుకుంటావు అనవసరంగా మాట్లాడితే పిచ్చివాడిగా పరిగణించబడతావు అహంకారంతో మాట్లాడితే గర్విష్ఠిగా పేరుతెచ్చుకుంటావు కోపంగా మాట్లాడితే అశాంతిని కొనితెచ్చుకుంటావు ద్వేషంతో మాట్లాడితే శత్రుత్వాన్ని తెచ్చుకుంటావు నవ్వుతూ మాట్లాడితే ఆదరణను పొందుతావు ఏడుస్తూ మాట్లాడితే అవహేళనకు గురవుతావు అబద్ధాలు మాట్లాడితే అపనమ్మకాన్ని మూటకట్టుకుంటావు నిజాలు మాట్లాడితే నమ్మకస్థుడవని పేరుతెచ్చుకుంటావు ఆలోచించి మాట్లాడితే మేధావిగా పేరుతెచ్చుకుంటావు ఆచితూచి మ్మాట్లాడితే అపార్ధాలకు తావుండదు నోరు తెరిచేముందు పరుసు తెరిచేముందు జాగ్రత్తగానుండకపోతే పరువుపోవచ్చు దబ్బుపోవచ్చు మాటతీరు మార్చుకో మంచిపేరు తెచ్చుకో నోరు  బాగుంటే ఊరు బాగున్నట్లే గుండ్లపల్లి రాజేంద్రప్రసద్, భాగ్యనగరం మానము=మర్యద, గౌరవము
Image
 వ్రాస్తా వ్రాస్తుంటా!  రానీ రాకపోనీ పేరుప్రఖ్యాతులు ప్రశంసాపత్రాలు  పేపర్లలో ఫొటోలు  బహుమతులు బిరుదులు భుజాన శాలువాలు మెడన పూలదండలు  కరాన పుష్పగుచ్ఛాలు దక్కనీ దక్కకపోనీ మాట్లడటానికి మైకులు  పత్రికలలో ప్రాచుర్యాలు ఆకాశవాణిలో వార్తలు  దృశ్యమాధ్యమాలలొ వీడియోలు చొక్కాలకు రంగులబాడ్జీలు సన్మానాలు సత్కారాలు  పొగడ్తలు కరతాళధ్వనులు పోనీ పోతేపోనీ భార్య బంధువులు తల్లి తండ్రులు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు హితులు స్నేహితులు చదవనీ చదవకపోనీ కష్టపడి వ్రాసినకవితలు అందంగాగుచ్చిన అక్షరాలు ఏరికోరిపేర్చిన పదాలు ప్రయోగించిన ప్రాసలుమాత్రలు వాడిన ఉపమానాలురూపకాలు వెలగనీ వెలగకపోనీ సూర్యుని కిరణకాంతులు చంద్రుని వెన్నెలజల్లులు తారల తళుకుబెళుకులు మెరుపుల విద్యుత్తుప్రకాశాలు మోములందు చిరునవ్వులు కనిపించనీ కనిపించకపోనీ ప్రకృతి అందాలు వికసించిన అరులు కడలిలోని అలలు నల్లని అంబుదాలు నాట్యమాడే అర్జునాలు తలుస్తా తలపుకుతెస్తా శ్రీశ్రీ విప్లవగీతాలను కృష్ణశాస్త్రి భావకవితలను ఆత్రేయ మనసుకవిత్వమును పాపయ్యశాస్త్రి పుష్పకవనమును గురజాద వ్యావహారికబాషను పలుకవుల ప్రణయ...
Image
 పాపాయిల్లారా! పకపకనవ్వుల పసిపాపల్లారా  పాలాబుగ్గల పాపాయిల్లారా   పిల్లలతోటి కలసిమెలసియుండండి  పీకలదాకా పూటుగాతినకండి  పుస్తకాలసంచి భుజానేసుకోండి పూటపూట పాఠశాలకువెళ్ళండి పెద్దలమాటలు పెడచెవిపెట్టకండి పేచీలెవ్వరితో పెట్టుకోకండి పైపైమెరుగులచూచి పొరబడకండి పొరపాటుపనుల నెపుడూచేయకండి పోకిరితనముపోరాటము మానండి పౌరుషాలుపెంకితనాలు వదలండి పంతాలకు పట్టింపులకుపోకండి పట్టువిడుపుల పాటించటమెరగండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవి-పాఠకుడు మధ్య కవితలు ఆలోచనలు అలోలములయి అంతరంగాన ఆవాసమయి సాయంసమయ ఛాయలయి తారాడి తందనాలాడుతున్నాయి రవిని చూచి కిరణాలను చూచి  జాబిలిని చూచి వెన్నెలను చూచి పువ్వులను చూచి నవ్వులను చూచి పిల్లలను చూచి పడుచులను చూచి పచ్చనివనాలను చూచి ప్రవహించే నదులనుచూచి  ఎత్తైన పర్వతాలుచూచి లోతైన లోయలనుచూచి కడలిని చూచి అలలను చూచి ఆకాశాన్ని చూచి నీలవర్ణాన్ని చూచి మేఘాలను చూచి తారకలను చూచి అందాలను చూచి ఆనందాన్ని పొంది ఆలోచనలో పడి ఆంతరంగాన మదించి పొరుగువారితో మాట్లాడి పుస్తకాలను చదివి కనులు తెరచి చెవులు విప్పి మనసు విప్పి విషయం తట్టి కలమును పట్టి కాగితము తీసి కవితను వ్రాసి సంబరపడుతున్నాడు కవి పఠించి గానంచేసి వినిపించి శ్రావ్యతనిచ్చి ముఖపుస్తక సమూహాలకుపంపి వాట్సప్పు సముదాయాలకుపంపి ఇంస్టాగ్రాముకి పంపి ట్విట్టరులో ట్వీటుచేసి బ్లాగులో పెట్టి వాలులో పెట్టి అంతర్జాలములో పంపి పలువురికి చేర్చి ఈమైలు చేసి శ్రమపడుతున్నాడు కవి పాఠకులు చదివి అక్షరాలకూర్పుకు అబ్బురపడి పదప్రయోగానికి ముగ్ధులయి ప్రాసల అమరికజూచి లోతైన భావాలుకని పరవశించి మనసున నిలుపుకొని వ్యాఖ్యలు వ్రాసి ప్రశంసించి కవికిపంపి సంతసపడుతున్నాడు ఒకచద...