Posts

Image
 పెళ్ళాం కళత్రం నాకు ప్రాణం చక్కగా చూచుకుంటా పెళ్ళాం నాకు దీపం ఇంటిని వెలిగించమంటా పెండ్లాం నాకు బెల్లం కడుపులో దాచుకుంటా భార్య నాకు యుగళం విడువక ప్రక్కనుంచుకుంటా అర్ధాంగి నాకు అందం ఆనందం పంచుకుంటా ధర్మపత్ని నాకు బంధం చిరకాలం నిలుపుకుంటా పత్ని నాకు అర్ధదేహం నాతో సమానంగాచూస్తా సతి నాకు మంత్రణం సలహాలు తీసుకుంటా ఆలి నాకు అమృతం సంతోషంగా స్వీకరిస్తా దార నాకు కాలక్షేపం ఎక్కువసమయం గడుపుతా కళ్ళాలు నాకు గౌరవప్రదాయం గర్వంగా తలనెత్తుకొనితిరుగుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  (నిన్న ఒక అభిమాని పెళ్ళాం గురించి కవిత వ్రాయమని కోరారు. సరేనని ఒప్పుకున్నా. దాని పర్యావసానమే నేటి నా కవిత.)
Image
 ఎలా చెప్పను? (కవిగారి హృదయస్పందనలు) ఎన్ని చెట్లు పూచాయో ఎన్ని పూలు రాలాయో ఎన్ని సుకుమారాలు నలిగాయో ఎన్ని గర్భాలు ఫలించాయో ఎన్ని శిశువులు జన్మించారో ఎన్ని మరణాలు సంభవించాయో ఎన్ని పుష్పాలు తెంచబడ్డాయో ఎన్ని సుమాలు కట్టబడ్డాయో ఎన్ని కుసుమాలు గుచ్చబడ్డాయో ఎన్ని దేహాలు చెమటోడ్చాయో ఎన్ని గుండెలు ఆగిపోయాయో ఎన్ని హృదయాలు పగిలిపోయాయో ఎన్ని పూరేకులు రాలాయో ఎన్ని చేతులు తెంచాయో ఎన్ని కాళ్ళు త్రొక్కాయో ఎన్ని అంగాలు తెగాయో ఎన్ని కళ్ళు మూతబడ్డాయో ఎన్ని కాళ్ళు చతికలబడ్డాయో సత్యాలు దాచలేను అబద్ధాలు చెప్పలేను బాధను భరించలేను బాధలు వర్ణనాతీతము నిజాలు నిష్ఠూరము భావాలు దాచటమసాధ్యము ఏమి చేయను ఎలా చెప్పను ఎలా వ్రాయను ఎలా ఆలోచించను ఎలా స్పందించను ఎలా మౌనందాల్చను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 నా తెలుగు తియ్యనైనది నా తెలుగుభాష తేటయైనది నా తెలుగుభాష తేనెలుచిందేది నా తెలుగుభాష తెల్లారివెలుగు నా తెలుగుభాష               ||తియ్య| అకారాంతమైనది నా తెలుగుభాష అనేకాక్షరాలున్నది నా తెలుగుభాష అమృతంలాంటిది నా తెలుగుభాష అమ్మలాబహుగొప్పది నా తెలుగుభాష ఉగ్గుపాలతో వచ్చింది  నా తెలుగుభాష ఉయ్యాలూపులలో నేర్చింది నా తెలుగుభాష గానానికి యోగ్యమైనది నా తెలుగుభాష శ్రావ్యతకి పేరొందినది నా తెలుగుభాష          ||తియ్య|| నన్నయ్య గ్రాంధీకరించింది నా తెలుగుభాష పోతన్న సొబగులుదిద్దింది నా తెలుగుభాష గురజాడచేతిలో వ్యావహారికమైనది నా తెలుగుభాష కందుకూరికలంతో నవలగావతరించింది నా తెలుగుభాష విశ్వనాధచే విఖ్యాతిపొందినది నా తెలుగుభాష శ్రీశ్రీచేత మార్పులుసంతరించుకుంది నా  తెలుగుభాష దాశరధిద్వారా దేదీప్యమానమైనది నా తెలుగుభాష సినారెచేతిలో పరిపక్వమైనది నా తెలుగుభాష      ||తియ్య|| త్యాగయ్యకృతులతో శ్రావ్యమైనది నా తెలుగుభాష అన్నమయ్యకీర్తనలతో శ్రేష్ఠమైనది నా తెలుగుభాష రామదాసుపాటలతో రమ్యనైనది నా తెలుగుభాష ఘంటసాలగళంతో ఘనమైనది నా తెలుగుభాష ...
 నీవొకటంటే నేపదంటా తిరిగే కాళ్ళు తిట్టే నోర్లు ఊరకుంటాయా నీవు ఒకటంటే నేను పదంటా లెక్కబెడతావా రాసే కలాలు పాడే గళాలు గమ్ముగుంటాయా పారే నదులు ఊరే జలాలు నిలిచిపోతాయా వీచే గాలులు ఊగే కొమ్మలు ఆగిపోతాయా తేలే మేఘాలు కారే చినుకులు వద్దంటేవింటాయా మొరిగే కుక్కలు ఊళలేసే నక్కలు వలదంటేఊరుకుంటాయా పుష్పాల పొంకాలు సుమాల సౌరభాలు ఆస్వాదించకుండతరమా సూర్యుని కిరణాలు చంద్రుని కళలు మట్టుబెట్టగలమా తారల తళుకులు దీపాల వెలుగులు నిరోధించగలమా మోముల నవ్వులు కన్నుల కాంతులు కనకతలలుతిప్పగలమా మది తలపులు హృది ఉల్లాసాలు కట్టడిచేయగలమా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుసుకో పడ్డవాళ్ళు అందరు చెడ్డవాళ్ళుకాదని తెలుసుకో మాటల ఈటెలు విసరటం  ఏమాత్రము సబబుకాదని తెలుసుకో బట్టను కాల్చి పైన వేయకూడదని తెలుసుకో పరులపై మకిలిని చల్లి అంటించరాదని తెలుసుకో పరులవిషయాల్లో జోక్యము చేసుకోకూడదని తెలుసుకో అనవసరంగా శతృత్వం  తెచ్చుకోకూడదని తెలుసుకో నీటిలా ధనమును ఖర్చుబెట్టకూడదని తెలుసుకో భవిష్యత్తులో అవసరాలకు ఇబ్బందులు రావచ్చని తెలుసుకో ఇచ్చిన మాటను నిలుపుకోవాలని తెలుసుకో అపనమ్మకస్థుడుగా ముద్రను వేసుకోకూడదని తెలుసుకో నోరు తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలుసుకో జారిన మాటలను వెనక్కు తీసుకోలేమని తెలుసుకో గొప్పవాడినని గర్వించకు పొగడ్తలకు పొంగిపోకూడదని తెలుసుకో భట్రాజులను గుర్తించి దూరంగా పెట్టటం తెలుసుకో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిదని తెలుసుకో తొందరపడి వ్యవహరించకు లేకపోతే బురదలో కూరుకుపోవచ్చని తెలుసుకో ఎదుటివారి తప్పులను ఎన్నటము సరయిన పద్ధతికాదని తెలుసుకో నువ్వు ఒప్పుగా మసలుకోవటము అత్యంత ముఖ్యమని తెలుసుకో సూచనలు ఇవ్వటము తేలికయిన విషయమని తెలుసుకో ఆచరణలో పెట్టటము కష్టమైన వ్యవహారమని తెలుసుకో వేమనలాగ హితాలు నేను చెప్పటంలేదని తెలుసుకో బద్దెనలాగ సూక్తులు నే...
Image
 ఓ మనసా! చీకట్లో ఉండేవు తలపుల్లో ముంచేవు మరుగుల మాటునీవు తపనల చోటునీవు               ||చీకటిలో|| కనపడక దాగేవు ఉనికిని చాటేవు ఆఙ్ఞలు ఇచ్చేవు అమలును పరిచేవు పనులను చేయించేవు చైతన్యమును చూపెంచేవు ప్రాణమును నిలబెట్టేవు జీవనమును గడిపించేవు          ||చీకటిలో|| ఉన్నవి వదిలేసేవు లేనివి కోరుకొనేవు చేసేది చెప్పకుండేవు చెప్పింది చేయకుండేవు సుఖమును ఆశించేవు సూక్తులను వల్లెవేసేవు మంచితనము చూపించేవు మాలిన్యము దాచిపెట్టేవు         ||చీకటిలో|| కంటితో వీక్షించేవు కన్నవాటిని కాంక్షించేవు కర్ణాలతో ఆలకించేవు శ్రావ్యతని క్రోలుకునేవు శ్వాసను తీసుకునేవు సుగంధాలను కోరేవు నోటితో ఆరగించేవు రుచులను ఆశించేవు             ||చీకటిలో|| మోవులను బిగించేవు మాట్లాడక మెలిగేవు మర్మాలను దాచేవు మౌనమును దాల్చేవు దేహపెత్తనము సాగించేవు అధికారము చలాయించేవు గొప్పలను పలువురికిచెప్పేవు మెప్పులను వినగనిష్టపడేవు    ||చీకటిలో|| అందాలను చూడగోరేవు ఆనందాలను ఆస్వాదించేవు ప్రేమాభిమానాలు పొందేవుపంచేవు బ...
Image
కవిత్వం కవిత్వం సాహిత్య అభివృద్ధికి ఉత్తమ సాధనం కవిత్వం మానవ అభివ్యక్తికి చరమ స్వరూపం కవిత్వం అనుభూతులు తెలపటానికి సంక్షిప్త రూపం కవిత్వం కవుల తలపులకు ప్రతిబింబం నిలువుటద్దం కవిత్వం క్లుప్తత సున్నితత్వాలకు పర్యాయపదం కవిత్వం మదులను తట్టే మేటి ఉపకరణం కవిత్వం శబ్దాల ప్రయోగానికి తగిన ఆలవాలం కవిత్వం పోలికలతో ఆకట్టుకునే అక్షర నిర్మాణం కవిత్వం విషయాల వెల్లడికి పదాల ప్రయోగం కవిత్వం నైపుణ్య ప్రదర్శనానికి చక్కని నిదర్శనం కవిత్వం పాఠకులను అలరించటానికి సామూహిక పరికరం కవిత్వం పఠనావ్యసనానికి గురిచేసే పదునైన ఆయుధం కవిత్వం వ్రాయటం వర్ణించటం ప్రోత్సహించదగిన వ్యాపకం కవిత్వం అమూల్య పరికరం  సక్రమప్రయోగం ఆవశ్యం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం