మామభామల సంవాదం
అతడు: మేలిముసుగు
ఎందుకే భామా
మోమును
చూపవే భామా
దొంగచూపులు
ఎందుకే భామా
దోరవయసు
దాచకే భామా
ధరహాసం
చూపవే భామా
ధమ్మిల్లము
చూడనీయవే భామా
అందాన్ని
చూపవే భామా
ఆనందాన్ని
కలిగించవే భామా
ముసుగును
తీయవే భామా
మౌనమును
వీడవే భామా
ముందుకు
రావే భామా
ముచ్చటలు
చెప్పవే భామా
ఎందుకే
ముసుగు భామా
ఎందుకే
మరుగు భామా
చేతిని
చేబడతానే భామా
చెలిమిని
చేస్తానే భామా
ఆమె: మెల్లకంటి
దాన్నోయి మామా
నల్లరంగు
దాన్నోయి మామా
బట్టతల
దాన్నోయి మామా
ఖాళీమెడ
దాన్నోయి మామా
బొంగురుగొంతు
దాన్నోయి మామా
బోసిపండ్ల
దాన్నోయి మామా
చీరెలు
కొంటావా మామా
నగలు
చేయిస్తావా మామా
సినిమాకు
తీసుకెళ్తావా మామా
స్కూటరుపై
తిప్పుతావా మామా
అతను: వదలవే
వదలవే భామా
ఊరకనే
అన్నానే భామా
ఇచటనుండి
వెళ్తున్నానే భామా
ఇక ఇక్కడకు
రానేరాను భామా
అపుడు: ముసుగును
తీసింది భామా
ముచ్చటగ
మెరిసిపోయింది భామా
ముసిముసిగ
నవ్వింది భామా
మబ్బుల్లోని
నెలరాజునుచూచింది భామా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment