జానపదగీతం


బావామరదల్లు


ఆమె:  వెళ్ళుమామా వెళ్ళు

       నువ్వు వెళ్ళుమామా వెళ్ళు

       రానుమామా రాను

       నేను రానుమామా రాను  ||వెళ్ళు||


అతను: ఏమయిందే పిల్ల

       నీకు యేమయిందే పిల్ల

       రావెపిల్లా రావె

       నువ్వు రావెపిల్లా రావె ||ఏమ||


ఆమె:  పట్టుచీరెలన్నావు

       పట్టెమంచమన్నావు

       పూలురోజుతెస్త్తానన్నావు

       వట్టిమాటలు చెప్పావు  ||వెళ్ళు||


       బంగారునగలిస్తానన్నావు

       ప్రతివారంసినిమాచూపిస్తానన్నావు

       ముద్దుముచ్చటలన్నావు

       కల్లమాటలు చెప్పావు ||వెళ్ళు||


       మాంసం పెడతానన్నావు

       చేపలు తెస్తానన్నావు

       రొయ్యలు రోజూయన్నావు

       ఉట్టిమాటలుచెప్పావు  ||వెళ్ళు||


       సైకిలుపై తిప్పుతానన్నావు

       స్కూటరుకొంటానన్నావు

       కారులో వెళదామన్నావు

       దొంగమాటలుచెప్పావు ||వెళ్ళు||


అతను: ఉద్యోగహోదాపెరిగిందే పిల్లా

       జీతం రెట్టింపయ్యిందే పిల్లా

       విమానాలలో తిప్పుతా పిల్లా

       విదేశాలకు తెసుకెళ్తా పిల్లా ||ఏమ||


ఆమె:  అట్లగయితే మామా

       ఇప్పుడేవస్తా మామా

       వెంటనేవెళ్దాం మామా

       మూటాముల్లెతీసుకో మామా


అతను: అలాగే అలాగే పిల్లా

       బండివేళయిందే పిల్లా  ||అలా||


ఆమె:  చెయ్యిపట్టుకో మామా

       తొందరగా తీసుకెళ్ళు మామా ||చెయ్యి||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


ఈ రోజు తెలంగాణా జానపద కళాకారుడు శ్రీ గడిపె మల్లేష్ గారు ఫోనుచేసి మీ కవితలు బాగున్నాయి. గేయాలు వ్రాస్తారా అన్నారు. అందుకు పర్యావసానమే ఈ కవిత. అందరూ చదివి, పాడుకొని ఆనందిస్తారని ఆశిస్తున్నాను.



Comments

Popular posts from this blog