ఏగేదెట్లాగా!
ఏగేదెట్లాగా!
దీంతో ఏగేదెట్లాగా!
బిక్కమొహమేస్తుంది
బుంగమూతిపెడుతుంది
చీటికిమాటికి అలుగుతుంది
చిట్లించి అలకపానుపునెక్కుతుంది
గట్టిగా ఏడుస్తుంది
గడగడా వణుకుతుంది
దిక్కూ లేదంటది
దిగులు పడుతుంటది
వంటచెయ్యనంటది
వాలుకురానంటది
పటపటా పల్లుకొరుకుతుంది
బొటబొటా కన్నీరుకారుస్తుంది
పసిడిగాజులు కావాలంటది
పట్టుచీరెలు తేవాలంటది
సినిమకు వెళ్దామంటది
షికార్లు చేద్దామంటది
బంగారం కొనమంటది
సింగారం చేసుకుంటానంటది
చిటపటలాడుతుంది
చిందులుత్రొక్కుతుంది
మిఠాయీలు తెమ్మంటది
నీచును కావాలంటది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment