అడవితల్ల్లి రాముడు వనవాసానికి వెళ్ళినట్టు నేనూ అరణ్యవాసానికి వెళ్ల్ళ్లా అయితే పెళ్ళాము పక్కనాలేదు తమ్ముడు తోడుగాలేడు వెంట కలాన్ని తీసుకొని వెళ్ళా కాగితాలను పట్టుకొని పోయా బిక్కుమంటు కూర్చున్నా భయపడుతు చూస్తున్నా బయటకు వచ్చా దృశ్యాలను చూచా ఆకాశాన్ని అర్ధించా ఆపన్నహస్తాని అందుకున్నా చంద్రుడిని పంపించింది వెన్నెలని చల్లించింది చుక్కలను చూపింది స్నేహహస్తమును చాచింది చినుకులను చల్లింది స్వాగతమును చెప్పింది అడవితల్లిని తలచా ప్రత్యక్షమయ్యింది చేతులెత్తి నమస్కరించా ఆహ్వానంపలికింది పచ్చదనాన్ని చూపింది పరవశాన్ని పంచింది పెళ్ళికి పేరంటాళ్ళు పలువురు వచ్చినట్లు ముచ్చటగా తయారయి వచ్చాయి వృక్షాలు కొబ్బరిచెట్టు నీరిచ్చి త్రాగమంది కాయలిచ్చి కొట్టుకొని తినమంది మామిడిచెట్టు ఆకులిచ్చి తోరణంకట్టమంది తియ్యని ఫలాలు చేతికిచ్చి తినమంది మర్రిచెట్టు నీడకురమ్మంది హాయిగా నిదురించమన్నది మల్లెచెట్టు పూలనుచల్లింది పరిమళాలను పీల్చమంది గులాబిమొగ్గ సిగ్గులొలికింది చెంపలనుతాకి ఎరుపెక్కించింది మందారాలు చిలిపిగానవ్వాయి మకరందాన్ని క్రోలుకోమన్నాయి కోకిలమ్మ వచ్చింది కమ్మగాపాడింది నిద్రనూపుచ్చింది అదృష్టలక్ష్మి తలుపు...
Posts
Showing posts from September, 2023
- Get link
- X
- Other Apps
నేను నేను తావిని నేను తీపిని నేను అందాన్ని నేను ఆనందాన్ని నన్ను చూశారా నాకవితలు చదివారా మీ తనివిని తీర్చానా మీ మనసును ముట్టినానా నా అక్షరాలు కనపడ్డాయా నా పదాలు పలికించాయా నా ఊహలు ఊరించాయా నా భావాలు భ్రమించాయా మీ దృష్టిని ఆకర్షించానా మీ అభిమానాన్ని చూరగొన్నానా నా అక్షరకుసుమాలు ఆకట్టుకున్నాయా నా సుమసౌరభాలు ఆఘ్రానించమన్నాయా కలాన్ని నేనే గళాన్ని నేనే ఆకాశాన్నినేనే అవనిని నేనే తోటను నేనే చెట్లను నేనే పువ్వులను నేనే ఫలాలను నేనే మబ్బును నేనే జల్లును నేనే నదిని నేనే కడలిని నేనే ఆటను నేనే పాటను నేనే అది నేనే ఇది నేనే అక్కడ నేనే ఇక్కడ నేనే నన్ను ఎవరనుకున్నారు? నన్ను ఏమనుకున్నారు? నేను తెలుగును నేను వెలుగును నేను కవిత్వాన్ని నేను కమ్మదనాన్ని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవనకహానీలు మబ్బులు చినుకులు రాలుస్తాయి కలాలు అక్షరాలు కురుస్తాయి తారలు తళతళలాడుతాయి కైతలు కళకళలాడుతాయి చంద్రుడు చక్కదనము చూపుతాడు కవీంద్రుడు కమ్మదనము కలిగిస్తాడు రవి కిరణాలు వెదజల్లుతాడు కవి కవనాలు వెలువరిస్తాడు పరబ్రహ్మ ప్రాణులను సృష్టిస్తాడు కవిబ్రహ్మ కవనాలను పుట్టిస్తాడు పువ్వులు మదులను ప్రేరేపిస్తాయి కవితలు పఠకులను ప్రోత్సహిస్తాయి తేనె నోరును ఊరిస్తుంది కవిత మనసును ఊరిస్తుంది పలుకులు పెదవులను కదిలిస్తాయి కయితలు పాఠకులను కదిలిస్తాయి ఊహలు తలల్లో ఊరతాయి పదాలు పుటల్లో పారతాయి కవనకుసుమాలు కట్టేస్తాయి సుమాలసౌరభాలు పట్టేస్తాయి అక్షరాలు అల్లుకుంటాయి అర్ధాలు అనుసరిస్తాయి కవి కదిలిస్తాడు పాఠకుడు స్పందిస్తాడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
మల్లెలముచ్చట్లు మల్లెపువ్వులు కలంపట్టమంటున్నాయి మంచికవితలను కూర్చిపెట్టమంటున్నాయి మల్లెలు తెస్తా మీదకు విసురుతా మల్లెలు అల్లుతా మెడకు వేస్తా మల్లెలు చూపుతా మదులకు మత్తెక్కిస్తా మల్లెకైతలు వ్రాస్తా మనసులను మురిపిస్తా మధుమాసం వచ్చింది మల్లెలకాలం తెచ్చింది కోకిలకంఠం వినిపిస్తుంది మామిడిపూత కనిపిస్తుంది మల్లెలవేళ అయ్యింది ఆలోచనలను లేపింది మల్లెతోటలు పచ్చబడ్డాయి తెల్లనిపూలు తొంగిచూశాయి మల్లెమొగ్గలు తొడిగాయి చిరునవ్వులు చిందాయి మల్లెబాలలు పిలిచాయి మదులను మురిపించాయి మల్లెకన్యలు మాట్లాడాయి సరససల్లాపాలు సంధించాయి మల్లెవిరులు విచ్చుకున్నాయి సౌరభాలు మత్తెక్కించాయి మల్లెభామలు వలవిసిరాయి మనసులను దొచేశాయి మల్లెలు మరులుకొలుపుతున్నాయి మోహములో ముంచేస్తున్నాయి మల్లెలు తీసుకెళ్ళమంటున్నాయి ప్రేమను పంచిపెట్టమంటున్నాయి మరుమల్లియలను ముందుంచుతా సిరిమల్లికలను చూపించుతా చూడండి సంతసించండి చదవండి సంగ్రహించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
గళమెత్తిపాడరా తెలుగోడా1! గళమెత్తి పాడరా తెలుగోడా చెయ్యెత్తి జైకొట్టరా తెలుగోడా పెదవులను విప్పరా తెలుగోడా తియ్యంగ పలుకరా తెలుగోడా ||గళ|| తెలుగంటె వెలుగనరా తెలుగంటె తీపనరా తెలుగంటె చక్కదనమనరా తెలుగంటె సంతోషమనరా ||గళ|| తెలుగంటె తెరువనరా తెలుగంటె తెలివనరా తెలుగంటె ఘనమనరా తెలుగంటె శ్రావ్యమనరా ||గళ|| తేనెచుక్కలు చల్లరా చక్కెరను విసరరా వెన్నెలను కాయించరా వెలుగులు చిమ్మించరా ||గళ|| ఉగ్గుపాలతో నేర్చాననరా ఉయ్యలనూగుతూ విన్నాననరా తల్లిభాషని చెప్పరా తండ్రినేర్పిన మాటలనరా ||గళ|| తెలుగుపొలాలు సారమైనవనరా తెలుగుపంటలు నాణ్యమైనవనరా తెలుగుతోటలు సుందరమనరా తెలుగుపువ్వులు సౌరభమనరా ||గళ|| తెలుగులోనె పలుకరా తేటపదాలనే వాడరా తెలుగుకైతలనె వ్రాయరా తెలుగుపాటలనె పాడరా ||గళ|| తెలుగురాగాలు తియ్యరా తెలుగుపద్య్యాలు ఆలపించరా తెలుగుకథలు చెప్పరా తెలుగుదనము చాటరా ||గళ|| గుండ్లపల్లి రాజేంద్రప్రసద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
వర్షగీతం వర్షం కురిసింది హర్షం ఇచ్చింది ఉరుములు వినిపించాయి మెరుపులు కనిపించాయి చినుకులు పడ్డాయి చిటపట అన్నాయి జోరువాన కురిసింది హోరుగాలి వీచింది భూమి తడిసింది నీరు పారింది పిల్లలు ఆటలాడారు కప్పలు బెకబెకలాడయి కాలువలు పారాయి చెరువులు నిండాయి వాగులు పొంగాయి నదులు ప్రవహించాయి చెట్లు ఊగాయి నీరు త్రాగాయి పొలాలు పచ్చబడ్డాయి మనసులు ముచ్చటపడ్డాయి పువ్వులు పూచాయి కాయలు కాచాయి వానలు కురిశాయి కరువును తీర్చాయి వర్షాలు పడ్డాయి పంటలు పండాయి వర్షం గీతమాలపించింది గానం శ్రావ్యతనిచ్చింది ఆకసానికి ధన్యవాదాలు మబ్బులకు వందనాలు వర్షాన్ని వీక్షించండి వర్షగీతాన్ని వినిసంతసించండి కవులను ప్రోత్సహించండి కవితలను ఆస్వాదించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అక్షరగారడి కలాలు హలాలయ్యయి చేబడతా సాహిత్యసేద్యం చేస్తా అక్షరాలు దీపాలయ్యాయి వెలిగిస్తా సక్రమమార్గాలు చూపిస్తా పదాలు పువ్వులయ్యాయి పరికింపజేస్తా పొంకాలు ప్రదర్శిస్తా సాహిత్యం సౌరభమయమయ్యింది చల్లుతా సర్వులను సంతసపరుస్తా కాగితాలు తేనెతుట్టలయ్యాయి పిండుతా పలువురికి పంచుతా గళము మధురమయ్యింది ఆలపిస్తా శ్రోతలను అలరిస్తా పలుకులు లేతకొబ్బరిపలుకులయ్యాయి పంచుతా పరవశపరుస్తా అధరాలు అమృతపాత్రలయ్యాయి అందిస్తా ఆనందపరుస్తా చూపులు వలలయ్యాయి విసురుతా సమ్మోహనపరుస్తా కలలు కల్పనలయ్యాయి చదివిస్తా నిజమని నమ్మిస్తా కవితలు కలగూరగంపలయ్యాయి వండుతా విస్తరాకులలో వడ్డిస్తా సాహిత్యం వనమయ్యింది కొండాకోనలకనబరుస్తా సెలయేర్లను పారిస్తా కవిత్వం కడలయ్యింది కుతూహలపరుస్తా కెరటాలను కనమంటా కవులు ఇంద్రజాలికులయ్యారు మంత్రిస్తా మనసులను మాయజేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా కవితలగుట్టు కవనం నా సేద్యం కవిత్వం నా కృషిఫలం కలం నా ఆయుధం కాగితం నా సుక్షేత్రం అక్షరం నా అస్త్రం పదం నా శస్త్రం అల్లిక నా ఇష్టం పొందిక నా యత్నం శిల్పం నా ప్రత్యేకం శైలి నా విశిష్టం వ్రాయటం నా నిత్యకృత్యం పాడటం నా ప్రయత్నం అందం నా విషయం ఆనందం నా ధ్యేయం అంత్యప్రాసలు నా కైతలలక్షణం లయనడకలు నా వ్రాతలలక్ష్యం నా పదాలు సరళం నా ప్రయోగాలు సుందరం మధురం నా తెలుగు మనొహరం నా కవితలు విన్నూతనం నా తెలుగు వైవిధ్యభరితం నా కైతలు ప్రకాశవంతం నా తెలుగు పరవశాత్మకం నా కయితలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగు కాంతులు తెలుగు వెలుగుతుంది తెరువును చూపుతుంది అక్షరాలు అలరారుచున్నాయి అందరిని ఆకర్షిస్తున్నాయి పదాలు ప్రకాశిస్తున్నాయి పెదవులను పలుకమంటున్నాయి కాగితాలు కళుకులుచిమ్ముతున్నాయి కమ్మదనాలను కుమ్మరిస్తున్నాయి కలాలు కాంతులుచిమ్ముతున్నాయి కైతలను కూర్చమంటున్నాయి కవితలు కళకళలాడుతున్నాయి కవనాలు కుతూహలపరుస్తున్నాయి కవులు కాంతిల్లుచున్నారు కైతలు కట్టిపడవేస్తున్నాయి పాఠకులు ప్రభవిస్తున్నారు పఠించి పరవశపడుతున్నారు కవిత కిరణాలుచల్లుతుంది కవనలోకమును కదిలిస్తుంది సాహితి శోభిల్లుతుంది చదువరులను సంతసపరుస్తుంది సరస్వతి సొంపారుతుంది చిద్విలాసమును చిందుతుంది వాణీదేవి వెలిగిపోతుంది వీణావాణిని వినిపిస్తుంది తెలుగు జ్వలిస్తుంది మదులను మురిపిస్తుంది తెలుగుతల్లికి వందనాలు తెలుగువారికి స్వాగతాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగు తియ్యందనాలు తెలుగుతీపిని చల్లుతా నోర్లలో నానుతా తెలుగుతీపిని వినమంటా వీనులకు విందునిస్తా తెలుగుతీపిని పెంచుతా తోటివారికి పంచుతా తెలుగుతీపిని చూపుతా తృష్ణను తీర్చుకోమంటా తెలుగుతీపిని వడ్డిస్తా తొందరగా తినమంటా తెలుగుతీపిని పారిస్తా గటగటా త్రాగమంటా తెలుగుతీపిని పొంగిస్తా తలలకు ఎక్కిస్తా తెలుగుతీపిని వినిపిస్తా మదులను మురిపిస్తా తెలుగుతీపిని పలికిస్తా తేనెచుక్కలు చల్లిస్తా తెలుగును తీపంటా వెలుగును తెలుగంటా తెలుగును పువ్వంటా సౌరభమును తెలుగంటా తెలుగును నవ్వంటా నగుమోములను తెలుగంటా తెలుగును సుందరమంటా సంతోషమును తెలుగంటా తెలుగును లెస్సంట వైభవమును తెలుగంటా తెలుగును నుడవమంటా నుడికారమును తెలుగంటా తెలుగును క్రోలుకోమంటా తెలుగుకు జైకొట్టమంటా తెలుగుకు పట్టంకడతా తెలుగుకవితలను పఠింపజేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కలంపరుగులు కలమును కదిలిస్తా కవితలను కూర్చేస్తా పేనాను పడతా అక్షరాలను అల్లుతా పేపరును పట్టుకుంటా పదాలను పేరుస్తా సొగసులను చూపుతా సంతసాలను చేకూరుస్తా కవితలను కూర్చుతా నవ్యతను చాటుతా కయితను కమ్మగాపాడుతా శ్రావ్యతను చెవులకందిస్తా అలరులను తీసుకొస్తా దండలను గుచ్చుతా ప్రేమను చూపుతా మదులను ముట్టేస్తా ఊహలను ఊరిస్తా పాత్రలను పూరిస్తా అమృతాన్ని అందిస్తా దాహార్తిని తీరుస్తా భావాలను వడ్డిస్తా కడుపులను నింపేస్తా విషయాలను వివరిస్తా మనసులను మురిపిస్తా అక్షరాలంటే అలరులు పదాలంటే పరిమళాలు కలమంటే వ్రాతలు గళమంటే పలుకులు కాగితమంటే మనసులు కవితలంటే ముద్రలు కవిత్వమంటే కవులశ్రమలు సాహిత్యమంటే సర్వకవనసంపుటాలు కాంచండి కలముపరుగులు పరికించండి పదప్రయోగాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా దేశం పాలుపొంగు నేల నాది పంటలకు నెలవు నాది సిరులున్న సీమ నాది వనరులకు చోటు నాది అందమైన ప్రాంతము నాది ఆనందాల ప్రదేశము నాది రత్నాలరాశులుగా అమ్మినరాజ్యము నాది ముత్యాలు మెడలనిండామెరిసినచోటు నాది పువ్వులుపూచే తోట నాది ఫలాలుకాచే వనము నాది నదులుపారే నేల నాది నరులకు స్వర్గసీమ నాది దేవతలువెలసిన దేశము నాది పరమభక్తులుపుట్టిన పుణ్యభూమి నాది ప్రేమలుచాటిన ప్రదేశము నాది భ్రమలుకొలుపు భూమి నాది సహాయసహకారాలిచ్చు సమాజము నాది కలసిమెలసిజీవించు క్షేత్రము నాది పౌరుషాలకు పురిటిగడ్డ నాది ప్రావిణ్యాలకు పుట్టినిల్లు నాది తెలుగువారికి తెగులుతగిలించకండి వర్గవైషమ్యాలను తట్టిలేపకండి ఆంధ్రులచరిత్రను కాపాడండి కక్ష్యసాధింపులకు తావివ్వకండి పరిపాలకులను గమనించండి అవినీతిపరుల ఆటలుకట్టించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగు విన్యాసాలు తెలుగు వెలుగులు చిమ్ముతుంటే చూస్తా సంతసిస్తా తెలుగు తేనెచుక్కలు చల్లుతుంటే చప్పరిస్తా తృప్తిపడతా తెలుగు సౌరభాలు వెదజల్లుతుంటే ఆఘ్రానిస్తా ఆనందిస్తా తెలుగు అందాలు చూపుతుంటే వీక్షిస్తా వినోదిస్తా తెలుగు కవితలను వినిపిస్తుంటే ఆస్వాదిస్తా ఆహ్లాదిస్తా తెలుగు పాటలను పాడిస్తుంటే వింటా వీనులవిందు చేసుకుంటా తెలుగు చెంతకురమ్మని పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తా పరవశించిపోతా తెలుగు అమృతం కురిపిస్తే పాత్రలలో పడతా పలువురికి పంచుతా తెలుగు వర్షిస్తుంటే తడుస్తా తనువును శుభ్రపరచుకుంటా తెలుగు పారుతుంటే దిగుతా ఈతకొడతా తెలుగు వెన్నెల కాస్తుంటే విహరిస్తా వివిధకైతలు వ్రాస్తా తెలుగు తలలో తలపులులేపితే కలంపడతా కైతలు కాగితాలకెక్కిస్తా తెలుగు విన్యాసాలు చూపుతుంటే పరికిస్తా పరవశిస్తా గుండ్లపల్ల్ రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓ మహాకవీ! గిజిగాడులా కవితలగూడు అల్లవోయ్ సుమాల్లా చదువరులపై సుగంధాలుచల్లవోయ్ దీపములా ధవళకాంతులు చిమ్మవోయ్ చిత్రకారుడిలా చిత్రవిచిత్రాలు చూపవోయ్ శిల్పకారుడిల చక్కనిశిల్పాలు చెక్కవోయ్ మేఘాల్లా వానజల్లులు కురిపించవోయ్ చంద్రునిలా చల్లనివెన్నెల చిందించవోయ్ ఆహారంలా ఆకలికడుపులు నింపవోయ్ నీరులా కవనదాహార్తి తీర్చవోయ్ భావాలతో పాఠకులమదులు తట్టవోయ్ అల్పాక్షరాలతో అనల్పార్ధాలు స్ఫురించవోయ్ ఆయస్కాంతంలా అంతరంగాలను ఆకట్టుకోవోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నా పైత్యం ఒక దీపము వెలిగింది ఓ దృశ్యము కనపడింది ఒక అందము ఆకర్షించింది ఓ ఆనందము కలిగించింది ఒక మోము తళతళామెరిసింది ఓ నవ్వు పకపకాలాడించింది ఒక చూపు సూటిగాతగిలింది ఓ కైపు మేనునావరించింది ఒక మాట వినిపించింది ఓ మారు కులుకించింది ఒక ఊహ మదినితట్టింది ఓ భావన బయటకొచ్చింది ఒక స్నేహము కుదిరింది ఓ కార్యము నెరవేరింది ఒక తోడు దొరికింది ఓ జోడు లభించింది ఒక పైత్యము తలకెక్కింది ఓ కవిత్వము వెలువడింది ఒక నిమిషం వీలయితేచదవండి ఓ అభిప్రాయం నచ్చితేతెలుపండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవితలకబుర్లు కలం పట్టమంటుంది కాగితం నింపమంటుంది గళం విప్పమంటుంది గానం ఆలపించమంటుంది విషయాలు వెంటబడుతున్నాయి కవితలు కూర్చమంటున్నాయి అక్షరాలు అర్ధిస్తున్నాయి పదాలు ప్రార్ధిస్తున్నాయి ఆలోచనలు తడుతున్నాయి భావాలు పుడుతున్నాయి ప్రాసలు పొసుగుతున్నాయి పంక్తులు ప్రవహిస్తున్నాయి పత్రికలు ఎదురుచూస్తున్నాయి పాఠకులను నిరీక్షింపచేస్తున్నాయి ఫేసుబుక్కు పంపమంటుంది వాట్సప్పు పెట్టమంటుంది ఈమైలు తొందరచేస్తుంది మెస్సెంజరు ముందుకొస్తుంది సమూహనిర్వాహకులు కోరుతున్నారు బృందాలసభ్యులు కాచుకొనియున్నారు కవిలోకం కలంపట్టి కృషిచేస్తుంది పాఠకలోకం పఠించి పరవశించాలనిచూస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓరి తెలుగోడా! తెలుగు మాట్లాడరా కడుపులు నింపరా తెలుగు నాలుకలు తేనెల పట్టులురా తెలుగు పలుకురా దప్పిక తీర్చరా తెలుగు పెదవులు అమృత నెలవులురా తెలుగు నేర్పరా తీపిని పంచరా తెలుగు చదువులు తెలివిని ఇచ్చురా తెలుగుబాట పట్టరా పూలదారిన నడవరా సుమాల సౌరభాలు పరిసరాల చల్లరా తెలుగుపాట పాడరా శ్రావ్యత కలిగించరా తెలుగు రాగాలు తీపని నిరూపించరా తెలుగుమాల అల్లరా తల్లిమెడన వెయ్యరా తెలుగు అక్షరాలు గుండ్రని ముత్యాలురా తెలుగు సొగసురా కనగ ఇంపురా తెలుగు పదాలు వినగ సొంపురా తెలుగును చాటరా వెలుగులు చిమ్మరా తెలుగు గొప్పలు జగానికి చెప్పరా తెలుగు దేశము స్వర్గ సీమరా తెలుగు జనులు ఆత్మ బంధువులురా తెలుగును వ్యాపించరా విశ్వవిఖ్యాతము చెయ్యరా తెలుగుమదులను తట్టరా శాశ్వతస్థానము పొందరా తెలుగుదీపాలు వెలిగించరా తెలుగుకాంతులు వెదజల్లరా తెలుగువైభవాలు వల్లెవేయరా నలుదిశలందు మారుమ్రోగించరా తెలుగు వ్రాయరా చక్కగ చదివించరా తెలుగు నుడికారాలు మనసుల ముట్టునురా ఓరి తెలుగోడా కలము పట్టరా కడు కవితలు కమ్మగా కూర్చరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అందచందాలు అందాన్ని ఆరగిస్తా కడుపుని నింపుకుంటా అందాన్ని అస్వాదిస్తా దప్పికని తీర్చుకుంటా అందాన్ని దోచుకుంటా మదిలో దాచుకుంటా అందాన్ని అనుభవిస్తా అనుభూతులుని అందరికిపంచిపెడతా అందాన్ని వెతికిపట్టుకుంటా వదలకుండా వెంటపెట్టుకుంటా అందాన్ని వెలిగిస్తా అందరిని చూడమంటా అందాన్ని పొగుడుతా తోడుగా నిలువమంటా అందాన్ని వేడుకుంటా అంటిపెట్టుకొని ఉండమంటా అందాన్ని ఆరాధిస్తా ఆనందాన్ని పొందుతా అందాన్ని ఆడమంటా వీక్షించి పొంగిపోతా అందాన్ని పాడమంటా ఆలకించి మురిసిపోతా అందాన్ని పంచుతా స్వీకరించి సంతసపడమంటా అందాన్ని అక్షరరూపంలోపెడతా పాఠకులను పరవశపరుస్తా అందాన్ని నిలువమంటా పుటలపైకి ఎక్కిస్తా అందాన్ని వర్ణిస్తా ఆనందాన్ని కలిగిస్తా అందానికి పెద్దపీటవేస్తా ఆనందానికి ప్రాధాన్యమిస్తా అందమే ఆనందమంటా అందరిని అందుకోమంటా గుంద్లపల్లి రాజేంద్ర ప్రసాద్.భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎవరు నేర్పారమ్మ? ఎవరు నేర్పారమ్మ కోకిలమ్మకు గళమెత్తి తియ్యగా పాడమని ఎవరు నేర్పారమ్మ నెమలికి పురివిప్పి చక్కగా నర్తించమని ఎవరు నేర్పారమ్మ జాబిలమ్మకు చల్లని వెన్నెలను వెదజల్లమని ఎవరు నేర్పారమ్మ కొమ్మకొమ్మకు చక్కని సుమాలను పూయించమని ఎవరు నేర్పారమ్మ పువ్వుపువ్వుకు సుగంధాలను చుట్టూ చల్లమని ఎవరు నేర్పారమ్మ గిజిగాడికి గట్టిగా గూడునల్లమని పిల్లలను జాగ్రత్తగాపెంచమని ఎవరు నేర్పారమ్మ ప్రకృతికి అందాలు చూపమని ఆనందం కలిగించమని ప్రకృతిని కాపాడుదాం పర్యావరణాన్ని రక్షించుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
రక్తం రక్తం ప్రాణాలను కాపాడుతుంది రక్తం సంబంధాలను కోరుతుంది రక్తం శరీరానికి శక్తినిస్తుంది రక్తం అంగాలను పనిజేయిస్తుంది రక్తం గుండెను ఆడిస్తుంది రక్తం ఆనందమొస్తే పొంగుతుంది రక్తం పిలిస్తే పలుకుతుంది రక్తం కోపమొస్తే మరుగుతుంది రక్తం గాయపడితే చిందుతుంది రక్తం ఆరోగ్యాన్ని సూచిస్తుంది రక్తం తగ్గితే శరీరవర్ణంమారుతుంది రక్తం చెడితే రోగాలనుకలిగిస్తుంది రక్తం త్రాగితే రాక్షతత్వంవరిస్తుంది రక్తం పంచితే సోదరభావంజనిస్తుంది రక్తం ఘనీభవిస్తే దేహంశవమవుతుంది రక్తం దానంజేస్తే పుణ్యాన్నిస్తుంది రక్తం చిందితే రణరంగానికిదారితీస్తుంది రక్తం వినగలిగితే మాట్లాదుతుంది రక్తం తెలుగురక్తం మనలోపారుతుంది రక్తం తెలుగురక్తం మనపైకవితలనుకుమ్మరిస్తుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవిగారి కమామిషు అతడు కవి కనిపించక వినిపిస్తాడు అతని కలము అమృతాన్ని చిందిస్తుంది అతని క్షరరహితాలు దీపాల్లా వెలుగుతాయి అతని పదాలు ఆయస్కాంతంలా పట్టుకుంటాయి అతని కైతలు అంతరంగాలను దోచుకుంటాయి అతని రాతలు అందాలు చూపిస్తాయి అతని కవనాలు ఆనందము కలిగిస్తాయి అతని పెదవులు తేనెచుక్కలు చల్లుతాయి అతని గళము వీనులకు విందునిస్తుంది అతని కల్పనలు పాఠకులను భ్రమిస్తాయి అతని శిల్పము అందరిని ఆకట్టుకుంటుంది అతని శైలి అత్యంత సరళమైనది అతని ఆలోచనలు విన్నూతనమైనవి అతని భావాలు మదిని మీటుతాయి అతని అల్లికలు వైవిద్యభరితమైనవి అతని అనుభూతులు తెలుసుకోతగినవి అతని వర్ణనలు అద్భుతమైనవి అతని పుటలు అందరూ చదవతగినవి అతని ప్రయోగాలు ప్రశంసనీయమైనవి అతని సృష్టి అజరామరం అట్టి కవికి స్వాగతం వందనం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎవరివో? నీవెవరివో? ఎవరివో? నీవెవరివో? తేటతేట తెలుగువా తాజాతాజా పువ్వువా తెల్లవారి వెలుగువా తెలుగుతోట పూచిన సుందర సుమానివా సౌరభాల సారంగివా తెలుగుబాట పట్టిన ప్రీతిగల పుత్రుడివా ప్రేమచూపు పుత్రికవా తెలుగుపాట పాడేటి కమ్మని కంఠానివా సరాగాల స్రవంతివా తెలుగునోట చిందేటి తేనెల పలుకులువా తీయని పాయసానివా తెలుగునేల మురిసేటి ముద్దుల బిడ్డవా నవ్వుల పాపవా తెలుగుమదులు తొలిచేటి అందాల దృశ్యానివా ఆనందాల కారణివా తెలుగుభూమిన కురిసేటి అమృత జల్లువా శ్వేత హిమానివా తెలుగుదేశాన పారేటి సుజల స్రవమువా సస్య సౌభాగ్యానివా తెలుగువాడు చూపేటి తెగువవా తెలివివా తెలుగుతల్లి కన్నట్టి వరాల కొడుకువా గారాబాల కూతురివా తెలుగుభాష చిందేటి వెలుగువా వెన్నెలవా తెలుగుకవి వ్రాసిన చక్కని కావ్యానివా చిక్కని కవిత్వానివా ఎవరివో? నీవెవరివో? మరంద మందారానివా మత్తెక్కించె మల్లియవా తుమ్మెదతాకని తామరవా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
అరుణకాంతులు అరుణుడు తొంగిచూచె అవనిని తట్టిలేపె అరుణుడు ఉదయించె అందరిని మేలుకొలుపె అరుణుడు ఆకర్షించె ఆలోచనలను పారించె అరుణుడు కిరణాలనుప్రసరించె అద్భుతకవితలను ఆవిష్కరించమనె అరుణుడు రాగాలాలపించె అక్షరాలను అందంగాకూర్చమనె అరుణుడు అందాలొలికె ఆనందాలను అంతరంగాలకందించె అరుణుడు ఎర్రరంగుచల్లె ఆకాశాన్ని దర్శించమనె అరుణుడు కలంపట్టమనె కవితలను కుమ్మరించమనె అరుణుడు నిత్యకవితనువ్రాయమనె అప్పుడే దినమునుప్రారంభించమనె అరుణకిరణాలు కళ్ళనుచేరె అందమైనదృశ్యాలు అగుపించసాగె అరుణకాంతులు తనువునుతాకె అద్భుతకవనము అందుబాటుకొచ్చె అరుణతళుకులు మదిలోదూరె అంతరంగమును ఆటలాడించె అరుణబింబము తూర్పునప్రభవించె అఙ్ఞానంధకారమును అంతరింపజేసె అరుణతలపులు ఆవరించె కమ్మనికైతలు కాగితాలకెక్కె అరుణుడు ఉదయించితె కవితయు ఉదయించినట్లె అరుణుడు అందరికీదైవమె అఖిలజగత్తుకు ఆరాధనీయమె కవితలు ప్రతిరోజూవ్రాస్తా పాఠకులకు ప్రతినిత్యమూపంపిస్తా విడువక చదవండి మదిని మురిపించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగుతోట తెలుగుతోట పిలుస్తుంది వెలుగుబాట చూపుతుంది తెనుగుతోట చక్కగున్నది పూలబాట పట్టమంటున్నది అలరులు అలరించుచున్నవి అంతరంగాలను ఆహ్లాదపరుస్తున్నవి సుమసౌరభాలు వీచుచున్నవి పరిసరాలను పరవశపరుస్తున్నవి పలురకాలపూలు తొంగిచూస్తున్నవి పెక్కురంగులందు కనువిందుచేస్తున్నవి మొగ్గలు మురిసిపోతున్నాయి సిగ్గులు ఒలకపోస్తున్నాయి విరులు విచ్చుకుంటున్నాయి కళ్ళకు విందునిస్తున్నాయి గాలికి ఊగుతున్నాయి వానకి తడుస్తున్నాయి పక్కకు పిలుస్తున్నాయి ప్రేమను చాటుతున్నాయి అందచందాలు ఆరబోస్తున్నాయి ఆనందాలను అందిస్తున్నాయి తుమ్మెదలు వ్రాలుచున్నవి తేనెచుక్కలు త్రాగుచున్నవి తోటలో తిరుగుదాం వస్తారా పూలతో మాట్లాడుదాం కలుస్తారా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం