నా చెలి 


కొంటెచూపుల

కోమలాంగి


చిరునగవుల

చిగురుబోడి


అందాలబొమ్మ

అలివేణి


చిత్రవిచిత్రాల

చిగురుబోడి


వాలుజడ

వాశిత


చిలిపికనుల

చిత్రాంగన


వయ్యరాల

వనిత


మదినితట్టిన

మగువ


మధువులొలుకు

మహిళ


చక్కదనాల

చంద్రవదన


సంతసపరిచే

సకియ 


కలలోకొచ్చే

కలువకంటి


హంసనడకల

హరిణలోచన


నచ్చింది

ననబోడి


మెచ్చింది

మెలతుక


వదలకుంటా వయ్యారిని

చెంతపెట్టుకుంటా చెలియని


సతినిచేసుకుంటా సారసాక్షిని

కాపురానికితెచ్చుకుంటా కాంతామణిని


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog