నేను - నా విషయాన్వేషణ
చెప్పని విషయంకోసం
గాలిస్తున్నా
చూడని విషయంకోసం
పరికిస్తున్నా
వ్రాయని విషయంకోసం
ఆలోచిస్తున్నా
విన్నూతన విషయంకోసం
వీక్షిస్తున్నా
అందమైన విషయంకోసం
ఆత్రపడుతున్నా
ఆనందమైన విషయంకోసం
అర్రులుచాస్తున్నా
అద్భుతమైన విషయంకోసం
ఆరాటపడుతున్నా
అమోఘమైన విషయంకోసం
అలమటిస్తున్నా
మంచి విషయంకోసం
ముచ్చటపడుతున్నా
మధుర విషయంకోసం
ఎదురుచూస్తున్నా
కమ్మని విషయంకోసం
కష్టపడుతున్నా
చక్కని విషయంకోసం
శ్రమిస్తున్నా
రసాత్మక విషయంకోసం
రగిలిపోతున్నా
వ్యూహాత్మక విషయంకోసం
వేచిచూస్తున్నా
పసందైన విషయంకోసం
పారజూస్తున్నా
ప్రియమైన విషయంకోసం
పాటుపడుతున్నా
మదులనుముట్టే విషయంకోసం
మదిస్తున్నా
తలలనుతట్టే విషయంకోసం
తపిస్తున్నా
శుద్ధమైన విషయంకోసం
నిరీక్షిస్తున్నా
చిత్రమైన విషయంకోసం
ప్రతీక్షిస్తున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment