ఓ మనిషీ! మనసును దారినిపెట్టుకో


మనసుకు

మంచిని నేర్పు

మనసుకు

బుద్ధిని ఇవ్వు


మనసుకు

మాటలు చెప్పు

మనసుకు

దారిని చూపు


మనసును

మురిపించు

మనసును

నడిపించు


మనసును

పలికించు

మనసును

తేనెనుచల్లించు


మనసును

పరుగెత్తించకు

మనసును

క్రిందకుపడదోయకు


మనసును

మభ్యపెట్టకు

మనసును

మాయచేయకు


మనసును

రగిలించకు

మనసును

మట్టుబెట్టకు


మనసుకు

కళ్ళెం తగిలించు

మనసుకు

కోర్కెలు తగ్గించు


మనసుకు

లక్ష్యాలు ఏర్పరచు

మనసుకు

సాధనకు సలహాలివ్వు


మనసును

చెప్పినట్లు వినమను

మనసుకు

స్వేచ్ఛను ఇవ్వకు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog