రంగులమైకం
హరితకంబళం
పుడమికికప్పాలి
పచ్చదనం
పరికింపచేయాలి
శ్వేతవర్ణం
ప్రసరింపచేయాలి
నిష్కల్మషం
తెలియపరచాలి
బులుగువర్ణం
నింగికంటాలి
నీలాకాశం
నేత్రాలకుచూపాలి
ఎర్రదనం
వెదజల్లాలి
అరుణోదయం
చేయించాలి
వివిధవర్ణపుష్పవర్షం
కురిపించాలి
తేనెచుక్కలతియ్యిదనం
పంచిపెట్టాలి
సింధూరం
చెక్కిళ్ళపై పూయాలి
బిడియం
బుగ్గలపై ప్రదర్శించాలి
ఇంద్రాయుధం
గగనంలో పొడిపించాలి
సప్తవర్ణాలు
తిలకింపచేయాలి
చక్కదనం
కూర్చాలి
సంతసం
చేర్చాలి
చిలిపితనం
చిందాలి
కలికితనం
కనపరచాలి
పలుపువ్వులు
పూయించాలి
వివిధవర్ణాలు
వీక్షింపజేయాలి
కుంచెను
చేతపట్టాలి
చిత్తరువులను
చిత్రవిచిత్రంగాదిద్దాలి
రంగులమద్యం
త్రాగించాలి
హృదులకుమైకం
కలిగించాలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment