పదహారణాల పక్కాతెలుగు
(పదారుగుణాల పక్కాతెలుగు)
అచ్చతెలుగు - అందాలమయము
అమ్మా-ఆవులశబ్దము - ఆనందభరితము
తేటతెలుగు - చిందుశ్రావ్యము
తేనెచుక్కలుచల్లు - స్థిరస్థావరము
స్వచ్ఛతెలుగు - శ్వేతవెలుగు
స్వాతికిరణాలు- చిమ్ముసాధనము
జానుతెలుగు - బహుప్రఖ్యాతము
వీనులకువిందు - వడ్డించుమార్గము
తీపితెలుగు తన్మాత్రము
సంతసాలుకూర్చు - సువిశాలమార్గము
మేటితెలుగు - ప్రచురణాత్మకము
మస్తకాలుమెరిపించు - మహాసాధనము
సుందరతెలుగు - సంగీతప్రశస్త్యము
కీర్తాలాపనలు - కర్ణాలకుభాగ్యము
మంచితెలుగు - మనోహరగానము
సుమసౌరభాలు - చల్లుటక్నువు
పల్లెతెలుగు - ప్రశంసనీయము
జానపదాలదీపం - జనచైతన్యము
పట్నతెలుగు - ప్రజలపలుకులు
ప్రచారపధాల్లో - నిత్యనూతనాలు
వరాలతెలుగు - వాగ్దేవివరము
వాక్కులురసాత్మకము - వందనీయము
సుస్వరాలతెలుగు - ఎత్తించుగళము
సుమధురగీతాలు - అందించుపీయూషము
బంగారుతెలుగు - మోములవెలుగు
కులుకులొలుకు - నవ్వులచందనము
రత్నాలతెలుగు - నిధులనిక్షేపము
ముత్యాలజిలుగులు - వెదజల్లువిశ్వము
అజంతాతెలుగు - పలుప్రక్రియలప్రవాహము
ప్రచండపవనము - ప్రపంచవ్యాప్తము
మనతెలుగు - మనోరంజకము
మహిమాన్వితము - మహిలోవిశిష్టము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment