వానరాగాలు


చెట్లు పెంచు — అడవులు సృష్టించు,

పచ్చదనం పరచు — మబ్బులు తేలించు,

చినుకులు రాలనీ — వాగులు పారనీ,

గొంతుల దప్పిక తీరనీ — మనసులు మురిపించనీ.


వానను రానీ,

వాడిన నేలపై వాసంతం చిందనీ.

వానను కురవనీ,

వేల జీవుల్లో వెలుగులు నింపనీ.


వానను తడుపనీ,

తడిసిన పొలాల్లో పచ్చదనం పూయనీ.

వానను పారనీ,

వాగుల గుండెల్లో గలగలలాడనీ.


వానను పొంగనీ,

కాలువల ఒడిలో కలల్ని నింపనీ.

వానను పాడనీ,

మేఘాల వీణలో మధురంగా మ్రోగనీ.


వానను సాగనీ,

పల్లెల గుండెల్లో పంటల్ని పండనీ.

వానను మాట్లాడనీ,

చినుకుల భాషలో ప్రేమలు చెప్పనీ.


వానను నవ్వనీ,

మనసుల మైదానాల్లో మాధుర్యాలు చల్లనీ.

వానను ఒలుకనీ,

జీవజాలానికి జీవామృతం పంచనీ.


— గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog