కవిత్వమంటే...
కవిత్వమంటే —
అక్షరాల విస్ఫోటనం, ఆలోచనల స్వరం,
అందాల ఆవిష్కరణ, ఆనందాల ప్రవాహం.
కవిత్వమంటే —
పువ్వుల పరిమళం, నవ్వుల మాధుర్యం,
ప్రకాశపు కిరణం, ఆశల తరంగం.
కవిత్వమంటే -
మధురమాటలు, హృదయ గీతాలు,
భావాల నాట్యం, అమృత ధారలు.
కవిత్వమంటే —
ఆణిముత్యాల మెరుపు, నవరత్నాల వెలుగు,
మంత్రాల మహత్యం, తంత్రాల సౌందర్యం.
కవిత్వమంటే —
కల్పనాకాశం, ప్రేమ పరిమళం,
జీవస్పందనం, నిత్య ప్రకాశం.
అనుభూతి అక్షరమైతే
పుటలపై పుట్టేది కవిత్వం,
హృదయం హరివిల్లైతే
రంగులై విరిసేది కవిత్వం.
— గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment