కలికాలం – కాంతల కాలం (చమత్కార కవిత)


పట్టుకుందామని ప్రయత్నిస్తుంటే

ఏ పడతీ ప్రసన్నమవటంలే! 

ముట్టుకుందామని మురిసిపోతుంటే

ఏ మగువా ముందుకురావటంలే!


కట్టుకుందామని కాంక్షిస్తుంటే

ఏ కాంతా కలసిరావటంలే!

మాంగళ్యధారణకు ముహూర్తంపెడతానంటే

ఏ మహిళా మెడవంచటంలే!


లాలిస్తానని లేపుతుంటే

ఏ లలన లొంగటంలే!

భరిస్తానని భరోసా ఇస్తుంటే

ఏ భామా భుజాలెత్తటంలే!


సహజీవనం చేద్దామంటే

ఏ స్త్రీ సహకరించటంలే!

సరసాలకు చెంతకురమ్మంటే

ఏ సుందరి సిద్ధపడటంలే!


పట్టుచీరెలిస్తా పక్కకురమ్మంటే

ఏ పయ్యెద పుచ్చుకోవటంలే!

బంగారునగలిస్తా బాగాతయారవ్వమ్మంటే

ఏ భామా బుట్టలోపడటంలే!


వలలో వేసుకుందామనుకుంటే

ఏ వనితా చిక్కటంలే!

స్వర్గం చూపిస్తానంటే

ఏ సుమతీ నమ్మటంలే!


అబలలతరం అంతమైంది

సబలలతరం సాగుతోంది

అతివలతరం ఆరంభమైంది

రమణులతరం రాజ్యమేలుతోంది!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


💐💐💐💐🌹🌹🌹🌹సమాజ నిర్మాణంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషిస్తున్న  మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు💐💐💐💐🌹🌹🌹🌹


Comments

Popular posts from this blog