యువకులారా! మత్తుకు చిక్కొద్దురా....
మత్తుకు బానిసకావొద్దురా...
క్షణికానందం చూపించి,
శాశ్వత చీకటిలోకి నెట్టే మాయాజాలమురా॥
తాగుబోతు కావద్దురా...
ఒక్క గ్లాసుతో మొదలైన అలవాటు
కుటుంబాల సంతోషాలను మింగేయునురా.
గంజాయి పీల్చొద్దురా...
అది ఊహలకు రెక్కలిచ్చినట్టే కనిపించినా,
జీవిత లక్ష్యాలకు సంకెళ్లు వేస్తుందిరా.
పొగాకు నమలొద్దురా...
సిగిరెట్లు కాల్చొద్దురా...పొగతో గాలినే కాదు,
ఆరోగ్యాన్నీ ఆయుష్షునీ కాల్చేస్తున్నావని గుర్తించరా.
భంగు జోలికి పోవద్దురా...
డ్రగ్సుకు అలవాటుపడొద్దురా...మాదకద్రవ్యాలు ముట్టొద్దురా...
శరీరాన్నే కాక ఆలోచనలను, ఆశయాలను దోచుకుంటాయిరా.
నీ జీవితానికి నీవే సారథివిరా. నీ భవిష్యత్తుకు నీవే శిల్పివిరా.
చదువును మిత్రుడిగా చేసుకోరా, క్రమశిక్షణను తోడుగా చేసుకోరా,
మంచి ఆలోచనలను జీవితాయుధాలుగా మలుచుకోరా.
యువతరమా...మత్తుకు కాదు, మానవత్వానికి బానిసలవ్వండిరా.
వ్యసనాలకు కాదు, విలువలకు వారసులవ్వండిరా.
చెడుకు కాదు, చైతన్యానికి చేయూతనివ్వండిరా.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment