నేరం కాదు...


నేరం కాదు...

మంచి భవితకోసం మారటం,

నిన్నటి తప్పులను పాఠాలుగా మలచటం,

రేపటి విజయాలకు పునాదులు వేయటం॥


నేరం కాదు...

విలువలు తెలుసుకొని ప్రవర్తించటం,

వివేకాన్ని జీవిత దీపముగా వెలిగించటం,

వ్యక్తిత్వాన్ని పరిమళించే పుష్పముగా తీర్చిదిద్దటం॥


నేరం కాదు...

భావి ప్రణాళికకు కట్టుబడటం,

లక్ష్యాన్ని దిక్సూచిగా చేసుకొని సాగిపోవటం,

కాలాన్ని విజయానికి సోపానముగా మలచుకోవటం॥


నేరం కాదు...

దుష్టులను మందలించటం,

దుర్మార్గాన్ని ధైర్యంగా ఎదుర్కొనటం,

ధర్మం కోసం నిటారుగా నిలబడటం॥


నేరం కాదు...

న్యాయానికి శిరసావహించటం,

నిజాయితీని నిత్యసహచరిగా చేసుకోవటం,

నీతిబాటలో నిబ్బరంగా నడవటం॥


నేరం కాదు...

ప్రకృతి నియమాలను పాటించటం,

పచ్చదనాన్ని ప్రాణంగా ప్రేమించటం,

భూమాత ఒడిని భక్తితో కాపాడటం॥


నేరం కాదు...

సామాజిక చైతన్యంతో జీవించటం,

తోటి మనిషి కన్నీటిని తుడవటం,

సేవాసుగంధాన్ని సమాజమంతా వెదజల్లటం॥


నేరం కాదు...

మంచి కోసం నిలబడటం,

ధర్మం కోసం పోరాడటం,

మానవతా విలువలను నిలబెట్టటం॥


– గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog