రమ్మంటున్నాయి


పిలుస్తున్నాయి పువ్వులవనాలు రా రమ్మంటూ 

పలకరిస్తున్నాయి పరిమళాలు రా రమ్మంటూ 


సూర్యుడు అస్తమించు సాయం సంధ్యా సమయంలో 

ఆహ్వానిస్తున్నాయి సమిరాలు రా రమ్మంటూ 


చందమామ వెన్నెల జల్లులను చల్లే వేళలో 

చేస్తున్నది సఖియ సంకేతాలు రా రమ్మంటూ  


ప్రకృతి కన్నులను కట్టిపడవేసే కాలంలో 

ఆహ్వానిస్తున్నాయి అందాలు రా రమ్మంటూ  


కునుకులే రానీయకుండా కమ్మని కలలు వచ్చి

విసురుతున్నాయి ప్రేమబాణాలు రా రమ్మంటూ 


అంతరంగంలో ఆలోచనలు పారుతున్నప్పుడు 

వెంటాడుతున్నాయి అక్షరాలు రా రమ్మంటూ 


హృదిలో భావాలు పొంగిపొర్లు సందర్భంలో 

స్వాగతించుతున్నాయి కవనాలు రా రమ్మంటూ 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog