అక్షరాల్లో
మధురమైన భావాలను చల్లనా అక్షరాల్లో
మమతలనే పువ్వులుగా అల్లనా అక్షరాల్లో
కన్నీటి బిందువులకు కవితనై ఓదార్పునిచ్చి
గుండెలలోన ధైర్యాన్ని చేర్చనా అక్షరాల్లో
చీకటిలో చిక్కిన చైతన్యమై వెలుగునిచ్చి
చిరునవ్వుల కిరణాలను నింపనా అక్షరాల్లో
నిశ్శబ్దమైన హృదయాల పలుకులన్నీ విని
స్పందనలను కావ్యంగా మలచనా అక్షరాల్లో
జీవిత అనుభవాలను జ్ఞాపకాలుగా మలచేసి
జన్మంతా నిలిచేలా కూర్చనా అక్షరాల్లో
ఆకలితో ఉన్న ఆత్మలకు ఆనందాన్ని పంచి
తియ్యనైన జిలేబీలు వండనా అక్షరాల్లో
కవిత్వపు విందును పాఠకులందరికీ పంచుతూ
కమ్మని వంటకాలు వడ్డించనా అక్షరాల్లో
కాలానికి నిలిచే కావ్యకుసుమాలై వికసించి
కవిగుండె సౌరభాలను పంచనా అక్షరాల్లో
రాజేంద్రుని ఆలోచనలను చక్కగా తీర్చిదిద్ది
రసాత్మకం చేసి రంగరించనా అక్షరాల్లో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment