బెంగళూరు... బహు సుందర నగరం!


బెంగళూరు... బెంగళూరు — బహు సుందర నగరం!

బహు భాషలకు నెలవైన — భాగ్యాల హరివిల్లు నగరం!

ఉద్యానవనాల ఒడిలో — ఉల్లాసాలతో  విరాజిల్లే నగరం!

ఉన్నత శిఖరాలనందే — ఉజ్వల విజయాల నగరం!


కర్ణాటక రాజధానిగా — కీర్తిగాంచిన నగరం!

కన్నడ భాషా వైభవంతో — కళకళలాడే నగరం!

తెలుగు, తమిళ, మలయాళ — భాషల మమతల సంగమం!

హిందీ భాషా జనులతో — జాతీయ సమైక్యత చాటే సౌధం!


చల్లని చల్లని వాతావరణం — చక్కని హాయిని పంచు!

పచ్చని పచ్చని పరిసరాలు — పరవశించి పిలుచు!

చెట్ల నీడలు చల్లగాను — చిగురుటాకులు నవ్వగాను!

పూల పరిమళాలు వెదజల్లి — ప్రకృతి స్వాగతమిచ్చు!


సాఫ్ట్‌వేర్ రంగంలో — సాధించిన విజయాలెన్నో!

ప్రపంచ దేశాల దృష్టిని — ఆకర్షించిన ఘనతలెన్నో!

కంప్యూటర్లతో కలల సౌధాలు — నిర్మించే యువతరం!

కృషి, ప్రతిభల రెక్కలతో — ఎదిగే భారత భవితవ్యం!


విద్యాలయాలు వెలసినాయి — విజ్ఞాన దీపాలు వెలిగినాయి!

విద్యార్థుల కలలు చిగురించి — విజయపథాలు తెరచినాయి!

దేశం నలుమూలల నుంచి — చదువుల కోసం చేరుతారు!

జ్ఞాన సంపదను పెంచుకుంటూ — జగతిలో పేరు తెచ్చినారు!


ఆంధ్ర దేశం నుంచీ జనులు — ఆప్యాయంగా చేరుతారు!

ఉత్తర భారత ప్రజలు సైతం — ఉత్సాహంగా కొలువుదీరుతారు!

కులమతాలకు అతీతంగా — కలిసిమెలిసి జీవిస్తారు!

భిన్నత్వంలో ఏకత్వాన్ని — భాసిల్లేలా చాటుతారు!


రైలు బండ్లు పరుగులెత్తి — రాకపోకలు సాగించు!

బస్సుల రాకపోకలతో — బాటలన్నీ కళకళలాడు!

ఎందరో యాత్రికుల రాకతో — ఎడతెగని సందడి!

ఎన్నో గమ్యాల దారిలో — జీవితమే ఒక బండి!


లాల్‌బాగ్ పూల వనంలో — లాలిత్యాల విందులెన్నో!

కబ్బన్ పార్కు పచ్చదనంలో — కమ్మని కబురులెన్నో!

వృక్షాల నీడన విశ్రాంతి — విరిసే హృదయాల హాయి!

విహరించే ప్రకృతి ఒడిలో — వెలసే ఆనంద రాగం!


చెట్లన్నీ చేతులెత్తి — చల్లని నీడను పంచగా!

పూలన్నీ నవ్వులొలికి — పరిమళాలను చల్లగా!

చెరువుల అలలు సవ్వడితో — చెలిమి గీతాలు పాడగా!

బెంగళూరు అందాలన్నీ — బంగారు జ్ఞాపకాలవగా!


బెంగళూరు... బెంగళూరు — మనసు దోచే నగరం!

మమతల మల్లెలు పూసే — మనోహరమైన నగరం!

బెంగళూరు... బెంగళూరు — మనసు దోచే నగరం!

మమతల మల్లెలు పూసే — మనోహరమైన నగరం!


బెంగళూరు... బెంగళూరు — బహు సుందర నగరం!

భాషలు వేరైనా మనసులన్నీ — కలిపే ప్రేమమందిరం!

పచ్చదనం, ప్రగతి కలిసిన — ప్రగతిశీల నగరం!

భారతదేశపు మకుటంలో — మణిరత్నమై వెలిగే నగరం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog