Posts

Image
 పూలలోకం పూలలోకంలో విహరించాలనియున్నది పూలమనసులను తెలుసుకోవాలనియున్నది పూలచెట్లను పెంచాలనియున్నది ప్రకృతిమాతకు శోభనుకూర్చాలనియున్నది పూలను చూడాలనియున్నది పరవశమును పొందాలనియున్నది పూలను అల్లాలనియున్నది మాలలను తెలుగుతల్లిమెడలోవెయ్యాలనియున్నది పూలతేనెను సేకరించాలనియున్నది తెలుగుపలుకులపైచల్లి తియ్యంగాచేయాలనియున్నది పూలపరిమళాలు చల్లాలనియున్నది పూలప్రేమికులను పరవశింపజేయాలనియున్నది పూలపొంకాలు చూపాలనియున్నది పరికించేవారిని పులకరింపచేయాలనియున్నది పూబాలలను పలుకరించాలనియున్నది కబుర్లుచెప్పి కాలక్షేపంచెయ్యాలనియున్నది పూలకన్యలను పిలువాలనియున్నది పొగడ్తలలో ముంచాలనియున్నది పూలకవితలు వ్రాయాలనియున్నది సాహిత్యప్రియులను సంతసపరచాలనియున్నది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నీలాలనింగిలో నిండుజాబిలి అదిగో నీలాకాశం అల్లదిగో చంద్రబింబం తారలమధ్య  చంద్రుడు తిరుగుతున్నాడు తెల్లని కౌముది పిండిని ఆరబోస్తున్నట్లున్నది చల్లనివెన్నెల శరీరానికి హాయినిస్తున్నది వెండిమబ్బులు ఆకాశాన తేలుతున్నవి నింగి వెలిగిపోతుంది నేల మెరిసిపోతుంది కోడెకారు పరుగులెత్తుతుంది కోర్కెలు చెలరేగుతున్నాయి మల్లెలు పరిమళాలు చల్లుతున్నాయి మదులు మత్తులో తూగుతున్నాయి సొగసు సయ్యాటలాడుతుంది మనసు ముచ్చటపడుతున్నది నిండు చంద్రుడు నింగిలో పయినిస్తున్నాడు తళతళ తారలు మేఘాలతో దోబూచులాడుతున్నాయి భూమి నీవుతిరగకు జాబిలిని కదలనీయకు రవి నీవుపొడవకు వెన్నెలను హరించకు కాలమా ఆగిపో చంద్రమా నిలిచిపో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
నీలాకాశం అత్యంత అందంగాయున్నది ఆకాశం అమిత అనందాన్నియిస్తున్నది వాతావరణం పిలుస్తున్నది నీలిగగనం చూడమంటున్నది పైకెత్తిశిరం తేలుతున్నాయి తెల్లమబ్బులు తృప్తినిస్తున్నాయి తిలకించువార్లకు రంగును తీసుకోమంటున్నది ఆటలను ఆడుకోమంటున్నది నీలివస్త్రం తీసుకెళ్ళమంటున్నది  బట్టలను కుట్టించుకోమంటున్నది  పక్షిలా ఎగిరిరమ్మంటున్నది నింగినంతా విహరించమంటున్నది మేఘాలనెక్కి స్వారిచేయమంటున్నది పరవశించి పొంగిపొమ్మంటుంది ఆకాశం అద్భుతం కడురమ్యం ఖగోళం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పచ్చదనం పచ్చదనము చూడ పరవశించు మది సహజ ప్రకృతికి ఇలలోలేదు సాటి కొమ్మకొమ్మను కన పత్రపత్రము కాంచ శోభాయమానము హరితవనము ఎండను తగ్గించు ప్రాణవాయువు నిచ్చు వానలు కురిపించు చెట్లు కడుమనోహరము పూవులు పూయు కాయలు కాయు విందుల నిచ్చు వృక్షరాజములు పక్షులకు గూళ్ళనిచ్చు పశువులకు మేతనిచ్చు ప్రాణులకు నీడనిచ్చు ప్రకృతి బహుసుందరంబు కన్నులను కట్టివేయు మనసులను మురిపించు కవులను ప్రకృతిప్రేరేపించు కమ్మనికవితలు వ్రాయించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 నేడే ఎన్ టీ ఆర్ జయంతి రామారావును స్మరిద్దాం విశిష్టతలను నెమరేద్దాం రామారావు నిమ్మకూరులో పుట్టాడు రాముడిగా సార్ధకనాముడయ్యాడు చిత్రసీమలో వెలిగాడు రాజకీయాలలో మెరిసాడు అందరికీ అన్న అయ్యాడు అందరి మదులలో నిలిచాడు రాముడంటే రామారావే అన్నారు కృష్ణుడంటే రామారావే అయ్యాడు రాయలసీమలో కరువస్తే  జోలెపట్టాడు విరాళాలు సేకరించి బాధితులను ఆదుకున్నాడు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ కళాప్రపూర్ణలతో సత్కరించింది రెండురూపాయలకే కిలోబియ్యంపధకం అమలుచేశాడు ఆడువారికి ఆస్తిలోసమానహక్కును కల్పించాడు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేశాడు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషను  సౌకర్యమిచ్చాడు తెలుగుదేశం పార్టీని పెట్టాడు తొమ్మిదినెలలలోనే అధికారంలోకి తెచ్చాడు ప్రతిపక్షాలను ఏకంచేశాదు కాంగ్రెసుపార్టీని మట్టికరిపించాడు పార్లమేంటులో తెలుగుదేశమును  ముఖ్యప్రతిపక్షం చేశాడు తెలుగుగళాన్ని దేశమునకు  వినిపించేలా చేశాడు తెలుగు భాషకు తెలుగు జాతికి దేశవిదేశాలలో గుర్తింపుతెచ్చాడు రామారావు నటనలో అద్వితీయుడు రామారావు రాజకీయాలలో విశిష్టుడు రామారావుకు జైకొడదాం తెలుగుజాతిని గౌర...
Image
 తెలుగు తియ్యందనాలు తెలుగు అందాలను ఆస్వాదించాలని ఆతురుతపడుతున్నా తెలుగు వెలుగులను చిమ్మాలని తపించిపోతున్నా తెలుగు పాలకడలిని చిలకాలని చూస్తున్నా తెలుగు  అమృతాన్ని పుట్టించాలని ప్రయత్నిస్తున్నా తెలుగు  పూదోటను పెంచాలని శ్రమిస్తున్నా తెలుగు సుమాలను పూయించాలని కష్టపడుతున్నా తెలుగు సౌరభాలను చల్లాలని కోరుతున్నా తెలుగు తియ్యదనాలను చూపాలని కలలుకంటున్నా తెలుగు రుచులను తినిపించాలని వండుతున్నా తెలుగు అక్షరాలను ఇంపుగాసొంపుగా పేర్చాలనిచూస్తున్నా తెలుగు పదాలను నదిలోనినీరుగా ప్రవహింపచేయాలనిచూస్తున్నా తెలుగు కవితలను వ్రాయాలని కలంపడుతున్నా తెలుగు పాఠకులను పరవశింపజేయాలని పూనికతోపుటలపైగీస్తున్నా తెలుగుతల్లి ఋణమును తీర్చుకోవాలని తనయుడిగాతహతహలాడుతున్నా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పాలమూరుముద్దుబిడ్డ ప్రతాపరెడ్డి సురవరం మనవరం సురవరం మనతేజం సురవరం మనరత్నం సురవరం మనగర్వం ప్రతాపరెడ్డి పండితుడు ప్రతాపరెడ్డి పరిశోధకుడు ప్రతాపరెడ్డి పాత్రికేయుడు ప్రతాపరెడ్డి పత్రికాస్థాపకుడు పుట్టాడు పాలమూరు బోరవెల్లిలో మెరిసాడు తెలంగాణా భాగ్యనగరంలో చదివాడు  కర్నూలులో ప్రాధమికవిద్యను చేశాడు  హైదరాబాదులో ఎఫ్ ఎ చదువు అయ్యాడు  మద్రాసులో పట్టభద్రుదు పూర్తిచేశాదు అక్కడే న్యాయవిద్యను  చలించాడు  తెలంగాణా దుస్థితికి కలతపడ్డాడు  తెలుగుభాష అగౌరవానికి పెట్టాడు తెలుగులో గోల్కొండపత్రికను  వ్రాశాడు వివిధపత్రికలలో వ్యాసాలు  తెచ్చాడు  తెలంగాణా కవులసంచికను ప్రచురించాడు  ఆంధ్రుల సాంఘీకచరిత్రను తపించాడు  తెలుగుభాషకు మద్ధతిచ్చాడు  విశాలాంధ్రకు వ్రాశాడువ్యాసాలు  కూర్చాడు కవితలు రాశాడు నవలలు  రచించాడు కథలు ధిక్కరించాడు  నైజాం నిరంకుశత్వామును ఎదిరించాడు భూస్వామ్యవ్యవస్థను వ్రాశాడు పెక్కుపుస్తకాలను  తెలిపాడు ఆంధ్రులచరిత్రను  సురవరం శౌర్యానికి శతకోటివందనాలు ప్రతాపరెడ్డి ప్రతాపానికి పలుపుష్పాంజలులు గుండ్లపల్లి రాజేంద్రప్రస...