అక్షరసూరీడు
అక్షరసూర్యుడు
పొడుస్తున్నాడు,
అక్షరోదయం
చేస్తున్నాడు.
అక్షరకిరణాలు
వెదజల్లుతున్నాడు,
అక్షరజ్యోతులు
వెలిగించుచున్నాడు.
అక్షరలోకాన
సంచరిస్తున్నాడు,
అక్షరవైభవాలు
కనబరుస్తున్నాడు.
అక్షరదిక్కులు
చూస్తున్నాడు,
అక్షరమాయలు
చేపిస్తున్నాడు.
అక్షరజగతిని
అలరిస్తున్నాడు,
అక్షరమదులను
మురిపిస్తున్నాడు
అక్షరమంటలు
రగిలిస్తున్నాడు,
అక్షరవంటలు
పండిస్తున్నాడు.
అక్షరరంగులు
పులుముతున్నాడు,
అక్షరహరివిల్లులు
పుట్టిస్తున్నాడు.
అక్షరమబ్బులు
తేలుస్తున్నాడు,
అక్షరజల్లులు
కురిపిస్తున్నాడు.
అక్షరశోభలు
ప్రదర్శిస్తున్నాడు,
అక్షరహృదయాలు
దోచుకుంటున్నాడు.
అక్షరజాతికి
జీవంపోస్తున్నాడు,
అక్షరకవితలు
సృష్టిస్తున్నాడు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment