నిన్నే చూశాను... (ప్రేమగీతం)


నిన్నే చూశాను - నన్నే మరిచాను

నీ అందం చూశాను - నే ఆనందం పొందాను   

నీ రూపం చూశాను - నే తాపం చెందాను

నీ వలకు చిక్కాను - నే ప్రేమలో పడ్డాను     ||నిన్నే||


నీ  చూపులు చూశాను - నే బందీ అయ్యాను

నీ నవ్వులు చూశాను - నే పువ్వులు చల్లాను 

నీ మాటలు విన్నాను - నే పాటలు పాడాను

నీ ఆటలు చూశాను - నే మత్తులో పడ్డాను    ||నిన్నే||


నీ చేష్టలు చూశాను - నే నివ్వెర పోయాను

నీ దుస్తులు చూశాను - నే కొంగును చుట్టాను

నీ పిలుపులు విన్నాను - నే చెంతకు వచ్చాను

నీ చెలిమిని చేశాను - నే చేతులు కలిపాను    ||నిన్నే||


నీ వదనం చూశాను - నే కలవరం చెందాను

నీ నడకను చూశాను - నే అడుగులు వేశాను

నీ రక్తిని చూశాను - నే శక్తిని పొందాను

నీ హృదిని చూశాను - నే కవిని అయ్యాను    ||నిన్నే|| 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.                                                                                                                                                                               



Comments

Popular posts from this blog