🌼 మల్లెల ముచ్చట్లు 🌼


మల్లెమాలను

అల్లవోయ్,

మన తెలుగుతల్లి మెడలో

వెయ్యవోయ్.


మల్లెదండను

గుచ్చవోయ్,

మనసిచ్చిన చెలి కొప్పులో

తురుమవోయ్.


మల్లెపూలను

అర్పించవోయ్,

మహనీయులకు నీరాజనాలు

అర్పించవోయ్.


మల్లెవాసనను

ఆఘ్రానించవోయ్,

మహదానందపు తీరాలు

అందుకోవోయ్.


మల్లెచెట్లను

పెంచవోయ్,

మధుమాసంలో

పూయించవోయ్.


మల్లెగుచ్ఛమును

చేతికివ్వవోయ్,

మెచ్చిన చెలికి

ప్రేమను చెప్పవోయ్.


మల్లెతోటకు

వెళ్లవోయ్,

ముచ్చటగా కాలాన్ని

గడపవోయ్.


మల్లెకన్నియలతో

మాట్లాడవోయ్,

మంచిగ మనసుల్ని

మురిపించవోయ్.


మల్లెజాతిని

పొగడవోయ్,

స్వచ్ఛతకు చిరునామా అని

చాటవోయ్.


మల్లెమనసుల్ని

ఎరగవోయ్,

మత్తైన సౌరభంలో

తూలవోయ్.


✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog