తక్కదిన తక్కాదినా
తక్కదిన తక్కాదినా ఆడుతుంటే
సరిగమ పదానిసా పాడుతుంటే
బాగుంటదీ బలే బాగుంటదీ
తీయగుంటదీ మరీ తీయగుంటదీ ||తక్క||
చకచకా పొలాల్లో తిరుగుతుంటే
గబగబా గడ్డిపై నడుస్తుంటే
మల్లె తోటలో పువ్వులుకొస్తూంటే
గాజులు ఘల్లుఘల్లున మ్రోగుతుంటే ||తక్క||
ఏటి నీటిలో ఈతకొడుతుంటే
తోటి వారితో ఎకసకాలాడుతుంటే
ఎగిరి ఎగిరి గంతులేస్తుంటే
చక్కదనాలు కనపడుతుంటే ||తక్క||
చెట్టెక్కి మామిడికాయలు కోస్తుంటే
పండిన రసాలను జుర్రుకుంటుంటే
పుచ్చకాయల ముక్కలు తింటుంటే
పనసపండ్ల తొనలు ఆరగిస్తుంటే ||తక్క||
ఎర్రని బుగ్గలు తడుముతుంటే
చిలిపి ముద్దులు పెడుతుంటే
కొంటె సరసాలు ఆడుతుంటే
చిరు నవ్వులను చిందిస్తుంటే || తక్క||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment