నీలో ఏముంది…?

(నీలోని నీవు)


నీలో ఏముంది —

ఉత్సాహపు ఉరుములా ఉప్పొంగే శక్తినా?

లేదా నిరాశ మబ్బులా కమ్ముకునే మౌనమా?


నీలో ఏముంది —

భయపు చీకటిలో వణికే నీడలా?

లేదా ధైర్య దీపంలా వెలిగే వెలుగా?


నీలో ఏముంది —

ప్రేమ అనే పుష్పవనం పరిమళమా?

లేదా కోపాగ్నిలా కాల్చే జ్వాలలా?


నీలో ఏముంది —

ఆశల ఆకాశంలో ఎగిరే కలల పక్షులా?

లేదా నిస్సహాయంగా కూలిన రెక్కల వేదనలా?


నీలో ఏముంది —

నిన్ను నువ్వు తెలుసుకునే ప్రశ్నలా?

లేదా సమాధానం కోసం వెతికే ప్రయాణమా?


నీలో అన్నీ ఉన్నాయి — అవి నీలోనే పుడతాయి —

నీ ఆలోచనల విత్తనాల నుంచి,

నీ అనుభవాల నేలలో పెరుగుతాయి।


నీ నిర్ణయమే మార్గం —

ఏది పెంచాలో, ఏది తగ్గించాలో,

ఏది వెలుగులోకి తెచ్చాలో, ఏది చీకటిలోనే ఉంచాలో…


నీలోని ప్రపంచం — 

నీ చేతుల్లోనే ఉంటుంది,

నీవు ఎంచుకున్న భావమే నీ జీవితాన్ని రంగులతో నింపుతుంది…


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog