ఓ కోయిలా! (గజల్ – ఖండగతి)
కమ్మగా కుషీగా కూయవే కోయిలా
మదుల్లో మధురిమలు నింపవే కోయిలా॥
గానమై కంఠమూ విప్పవే కోయిలా
రాగమై గాలిలో తేల్చవే కోయిలా॥
కొమ్మపై కూర్చొనీ కుయ్యవే కోయిలా
తేనెలా చుక్కలూ జార్చవే కోయిలా॥
వేకువై వెలుగులు చిమ్మవే కోయిలా
వెన్నునూ తట్టుతూ లేపవే కోయిలా॥
చినుకులా సంతసం చిందవే కోయిలా
చింతల్ని దూరమూ చేయవే కోయిలా॥
ప్రేమగా పాటలూ పాడవే కోయిలా
ప్రాణమై గుండెలో నిలువవే కోయిలా॥
‘రాజేంద్ర’ హృదినీ తట్టవే కోయిలా
కవితనూ నిరతమూ నిలుపవే కోయిలా॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment