తెలుగోడీని 


తెలుగుతల్లి పుత్రుడిని

తెలుగుతల్లి ఋణం తీర్చుకుంటాను,

తెలుగుదనపు వెలుగులు పంచుతాను॥


తెలుగునేల వాసిని

తెలుగుఘనత చాటుతాను,

తెలుగుమట్టి పరిమళం వెదజల్లుతాను॥


తెలుగు భాషాభిమానిని

తెలుగు భాషను కాపాడుతాను,

తెలుగు తేజాన్ని పెంపొందిస్తాను॥


తెలుగు జాతీయుడిని 

తెలుగు జాతి ఐక్యత కోరుతాను,

తెలుగు ఖ్యాతిని దిక్కులన్నిటా చాటుతాను॥


తెలుగు రైతుని

చెమట చుక్కలు చిందిస్తాను,

బంగారు పంటలు పండిస్తాను॥


తెలుగు పంటని

ఆకలి బాధలు తీర్చుతాను,

ఆనందాలవిందు అందిస్తాను॥


తెలుగు గళముని

తేనెచుక్కలు చిందుతాను,

తీయని పలుకులు పలుకుతాను॥


తెలుగు కలముని 

తెలివిని చాటుతాను,

తరతరాలకు వెలుగులు పంచుతాను॥


తెలుగు కిరణాన్ని

జ్ఞానజ్యోతులు వెలిగిస్తాను,

చీకట్లను పారద్రోలుతాను॥


తెలుగు సౌరభాన్ని

సుగంధాలు వెదజల్లుతాను,

సంస్కృతి వైభవం చాటుతాను॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog