దేనికి? (గజల్)
నవ్వులు చిందని మోములు దేనికి
మనసులు గెలవని మాటలు దేనికి॥
పువ్వులు పూయని కొమ్మలు దేనికి
పరిమళమీయని సుమాలు దేనికి॥
చినుకులు కురవని మేఘాలు దేనికి
పైరులు పండని పొలాలు దేనికి॥
సేవలు చేయని చేతులు దేనికి
సంతసమీయని మిత్రులు దేనికి॥
వెలుగులు చిందని దివ్వెలు దేనికి
దారులు చూపని కన్నులు దేనికి॥
కరుణను పంచని మనుజులు దేనికి
కడుపును నింపని విందులు దేనికి॥
అక్కరకురాని చుట్టము దేనికి
ఆదరణ ఇవ్వని ఆప్తు
లు దేనికి॥
అర్థము ఇవ్వని పలుకులు దేనికి
ఆచరణ లేని సూక్తులు దేనికి॥
రాజేంద్ర! ప్రేమ రహితులు దేనికి
మేలును చేయని బ్రతుకులు దేనికి॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment