చెప్పేస్తా (గజల్)


మనసులోని భావాలను మాటల్లో చెప్పేస్తా

శ్రావ్యమైన రాగాలను పాటల్లో చెప్పేస్తా॥


సామూహిక సమస్యలపై కలమెత్తి రాస్తుంటా,

సత్యపు సందేశాలను రాతల్లో చెప్పేస్తా॥


చేయాల్సిన కార్యాలు ఆచరణలో చూపిస్తా,

మానవత్వపు విలువలను చేతల్లో చెప్పేస్తా॥


ఎదురైన అనుభవాలు హృదయంలో దాచుకుంటా,

జీవనమార్గ దర్శనాన్ని సద్బాటల్లో చెప్పేస్తా॥


పల్లెల పట్టణాల సమదృష్టితో వీక్షిస్తా,

ప్రజల ఆశల స్పందనను పేటల్లో చెప్పేస్తా॥


గెలుపు కోసం శ్రమించుటే విజయసూత్రమంటా,

పట్టుదల గొప్పతనాన్ని ఆటల్లో చెప్పేస్తా॥


'రాజేంద్ర' గుండెచప్పుడు అక్షరాల్లో నింపుతా,

కాలం నేర్పిన పాఠాన్ని పుటల్లో చెప్పేస్తా॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog