నా చెలిని (గజల్)


తేనియలు చల్లమని అర్థిస్తా నా చెలిని

ముద్దులను ఇవ్వమని అర్జిస్తా నా చెలిని॥


చల్లని చినుకులతో హృదిని  తడపాలని

కరుణలో ముంచమని యాచిస్తా నా చెలిని॥


హృదయము తాకి పరవశింప చేయాలని

ప్రేమ పారించమని ప్రార్థిస్తా నా చెలిని॥


వెలుగు దారిలో నడిపించి జీవితమంతా

జ్ఞానసుధ ఒసగమని ఒప్పిస్తా నా చెలిని॥


మాటలతోనే మధురంగా మురిపించమని

చెరకురసం చిందేలా మెప్పిస్తా నా చెలిని॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 

Comments

Popular posts from this blog