అంటున్నా (గజల్)


నగలన్ని నీకోసమని అంటున్నా    

మెడలోన వేసుకోమని అంటున్నా॥  


చీరలన్ని ప్రేమతోనే ఇచ్చాను   

సొగసుగా కట్టుకోమని అంటున్నా॥


చేతిలోని ధనమునంతా ఇచ్చాను  

భద్రంగ దాచుకోమని అంటున్నా॥  


పూలదండ నీ సిగకుకే తెచ్చాను  

కొప్పునా పెట్టుకోమని అంటున్నా॥  


వెన్నెలంత వెలుగులను నేను దాచాను 

లోకమున వెలిగిపోమని అంటున్నా॥ 


చిరునవ్వులను గుండెనందు  నింపాను 

మనసులో మురిసిపోమని అంటున్నా॥   


రంగురంగుల గాజులు కొనితెచ్చాను   

చేతులకు తొడుక్కోమని అంటున్నా॥  


చెక్కలతో భక్తిమార్గం చూపాను 

భజనలో లీనమవమని అంటున్నా॥ 


హృదయం నే నీకే అర్పించాను 

ప్రేమతో నింపుకోమని అంటున్నా॥ 


సత్యమై నిత్యమై ముందు నిలిచాను 

ధైర్యంగ నడచిపోమని అంటున్నా॥  


స్వేచ్ఛ అనే జతరెక్కలను తొడిగాను

గాలిలో  ఎగిరిపోమని అంటున్నా॥ 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog