రావే చెలియా! (గజల్)


పట్టుచీర కట్టుకోని పక్కకురావే చెలియా 

సరస సల్లాపాలాడ చెంతకురావే చెలియా  


అందంగా తయారయి ఆనందం చేకూర్చగా 

ముద్దూ ముచ్చట్లకొరకు ముందుకురావే చెలియా  


పల్లెటూరి పడచులాగ పరువాల పడతిలాగా 

నేతచీర చుట్టుకొని ఎంకిలా రావే చెలియా 


వసంతమాసంలా పున్నమిజాబిలి వెన్నెలలా 

మల్లెలు కొప్పులో తురుముకొనిరావే చెలియా 


సిగ్గులు బుగ్గలొలుకుతూ సింగారాలు చూపుతూ 

చలాకీ నవ్వులు చిమ్ముకుంటూరావే చెలియా 


తెలుగింటి తరుణిలా తేనెపలుకులు చల్లుకుంటూ

చందనపు బొమ్మలాగ చకచకారావే చెలియా 


మనసువిప్పి మాటలాడ హృదయాన్ని దోచేలా  

పరిమళాలు చల్లుతూ పువ్వులా రావే చెలియా 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 



Comments

Popular posts from this blog