రాయాలని నాకున్నది 


మనసులోని ఊహలను లిఖించాలని నాకున్నది 

గుండెలోని భావాలను చెప్పాలని నాకున్నది 


కొండా కోనలల్లో కలియతిరిగి కాలం గడిపి

చూచిన దృశ్యాలను వర్ణించాలని నాకున్నది 


హృదయాన్ని ఉయ్యాలలూగించి ఉప్పొంగించగ  

పొందిన అనుభవమ్ములను తెలపాలని నాకున్నది 


పిల్లల తడబడు అడుగులు చూచి ముద్దు మాటలు విని

పసిపాపల మోములను ముద్దాడాలని నాకున్నది 


పున్నమి వెన్నెలలో విహరించి తోటలలో తిరిగి 

ప్రకృతి రమణీయతలను కాంచాలని నాకున్నది 


ప్రేమానురాగాలు పంచి సిగ్గుతో తలవంచిన 

పడచుల ఎర్రబుగ్గలను చూడాలని నాకున్నది 


కోకిల కంఠము విని కుహూకుహూ రాగాలు తీసి

కమ్మని స్వరాలను ఆలపించాలని నాకున్నది 


హంస నడకలను చూచి మయూరి నృత్యాలను కాంచి

కూచిపూడి డాన్సు ప్రదర్శించాలని నాకున్నది 


అక్షరాలను అల్లి పదపుష్పాలను పూయించే 

మహాకవుల కవనాలను చదవాలని నాకున్నది 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.



Comments

Popular posts from this blog