ఓ మనసా!


తట్టవే శిరసును చక్కని ఆలోచనవై

ముట్టవే మనసును తియ్యని ఆలోచనవై


సౌఖ్యాలను లోకంలో అనుభవించేలా 

కట్టవే కాసుల మూటని ఆలోచనవై


కడుపులోని ఆకలి మంటలను ఆర్పేలా

పెట్టవే పెళ్ళి వంటలని ఆలోచనవై


చితికిచిట్లిన బ్రతుకుని దారికి తెచ్చేలా

కుట్టవే అతుకుల బొంతని ఆలోచనవై


నీలి గగనంలో జాబిలిలా వెలిగేలా

పట్టవే కీర్తి ప్రతిష్ఠని ఆలోచనవై


అంధకారాన్ని తరిమేసే ప్రకాశంలా

నెట్టవే చెడ్డ గుణములని ఆలోచనవై


పరుగెడుతున్న ప్రపంచాన పయనించేలా

చుట్టవే భూఖండాలని ఆలోచనవై


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog