నిద్ర
నిద్రపోతే హాయి, నిద్రలేస్తే హాయి
నిద్రపుచ్చితే హాయి, నిద్రవస్తే హాయి
నిద్రపిలిస్తే హాయి, నిద్రముంచితే హాయి
నిద్రవడిలో జారితే నిండుగానే హాయి
నిద్రలో తూగితే తనువంతా హాయి
నిద్రలో కలలుకంటే కనులంతా హాయి
నిద్రాదేవి కరుణిస్తే మనసంతా హాయి
నిద్రలో విహరిస్తే లోకమంతా హాయి
నిద్రాలోలుడైతే కునుకే మధురం
నిద్రాభీరువైతే రేయే దుర్భరం
నిద్రాభిలాషికి పాన్పే స్వర్గం
నిద్రాకాంక్షికి కునుకే భాగ్యం
నిద్రామత్తుడైతే లోకమే మరుపు
నిద్రావిహీనుడైతే జీవితమే అలుపు
నిద్రాధికుడైతే సమయమే జారును
నిద్రాప్రియుడైతే కలలే చేరును
నిద్రమత్తమైన కనులలో హాయి
నిద్రరాని రేయిలో భయం
నిద్రలేమితో కలతలెన్నో
నిద్రవల్లనే సుఖాలెన్నో
అలసిన దేహానికి నిద్రే ఔషధం
కలతల మనసుకు నిద్రే అమృతం
రాజైనా బంటైనా నిద్రలో సమానమే
పేదైనా ధనికైనా కునుకులో ఒకటే
పసిబిడ్డ నవ్వులో నిద్రకే అందం
పండు వయసులో నిద్రకే సౌఖ్యం
నిద్రలేచిన వేళ నూతనోత్సాహం
నిత్యజీవితానికి నిద్రే ఆధారం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment