ఆకాశం
చూడటానికి చాలా చక్కనైనది ఆకాశం
ఆస్వాదనకు అతి ఆనందమైనది ఆకాశం
నేత్రాలకు విందునిచ్చి అంతరంగాలను దోచి
కాంచటానికి అధిక విచిత్రమైనది ఆకాశం
విశ్వానికి వింతై గ్రహాలను ఒడిలో దాచుకుని
ఙ్ఞానానికి తావై విలాసమైనది ఆకాశం
మేఘాలకు ఆవాసమై గాలులకు స్థావరమై
వివిధ రంగులతో విలక్షణమైనది ఆకాశం
జాబిలికి చోటిచ్చి చల్లదనంతో తృప్తిపరచి
వెన్నెలను వెదజల్లు అద్భుతమైనది ఆకాశం
పగలైనా రాత్రైనా వానైనా ఎండైనా
మదుల దోచు ఆకర్షణీయమైనది ఆకాశం
తాకటానికి అందనిది చేరుటకు కష్టమైనది
ఆద్యంతాలు లేక అనంతమైనది ఆకాశం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment