ఓ చంద్రముఖీ!
తుంటరి చూపులతో కొరక్కుతినకే చంద్రముఖీ
కనుల సైగలతో రమ్మని పిలవకే చంద్రముఖీ
చెంతకుచేరి చేతులను కలిపి చతుర్లలో ముంచి
మాటలలో ముంచి మంటలురేపకే చంద్రముఖీ
తెల్లనిచీరనుకట్టి బంగారు నగలను ధరించి
అందాలు చూపి ఆటలాడించకే చంద్రముఖీ
పలురంగుల గాజులు వేసుకొని గలగలలాడించి
ఆనందం ఆశించి ఊరించకే చంద్రముఖీ
ఆకాశానికి తీసుకెళ్ళి ఉయ్యాల ఎక్కించి
ఊపులతో ఉక్కిరిబిక్కిరి చేయకే చంద్రముఖీ
సిగ్గులు చిందించి మెడపట్టి బుగ్గలను తడుముతూ
ముద్దులలో ముంచేసి మురిపించకే చంద్రముఖీ
ముచ్చటగా తయారై గజ్జెల చప్పుడులు చేస్తూ
విరహంలో పడవేసి వేదించకే చంద్రముఖీ
మరుమల్లెలు కొప్పులో తురుముకొని పున్నమిరోజున
వెన్నెలలో విహారముకు రమ్మనకే చంద్రముఖీ
ముసిముసినవ్వులు ఒలకబోస్తూ చిలిపి చేష్టలతో
వయ్యారాల వలపువలను విసరకే చంద్రముఖీ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment