అక్షరాల ఆటలు


అక్షరరూపాలు

అందంగా దిద్దుతా,

ఆనందంగా పంచుతా.


అక్షరజల్లులు

చిటపటా కురిపిస్తా,

తనువులు తడిపేస్తా.


అక్షరకుసుమాలు

మాలలుగా అల్లుతా,

మెడల్లో అలంకరిస్తా.


అక్షరసౌరభాలు

అన్నిదిక్కులా చల్లుతా,

అందరినీ ఆఘ్రాణింపజేస్తా.


అక్షరసుధలు

అందరిపై వెదజల్లుతా,

గుటగుటా ఆస్వాదింపజేస్తా.


అక్షరజ్యోతులు

ధగధగా వెలిగిస్తా,

కళాకాంతులు చిమ్మిస్తా.


అక్షరతూటాలు

పెన్నులతో పేలుస్తా,

వెన్నుల్లో దూర్పిస్తా.


అక్షరవిన్యాసాలు

అద్భుతంగా చేసిచూపుతా,

అందరినీ ఆకట్టుకుంటా.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog