కొత్తదనాలు
కొత్తదనం ఉండాలి
కమ్మదనం ఇవ్వాలి,
కొత్త కోర్కెలు పుట్టాలి
కొత్త బాటలు వెతకాలి!
కొత్త మాటలు చెప్పాలి
కుతూహలం కలిగించాలి,
కొత్త రుచులు తగలాలి
కడుపులు నిండాలి!
కొత్త ఆలోచనలు పారాలి
కలం ముందుకు సాగాలి,
కొత్త భావాలు పుట్టాలి
కాగితాలు నిండాలి!
కొత్త పరిచయాలు కలగాలి
కాలక్షేపం జరగాలి,
కొత్త కాంతులు చిమ్మాలి
కళాకాంతులు వెదజల్లాలి!
కొత్త కవులు రావాలి
కోకొల్లలుగా కవితలు రాయాలి,
కొత్త సంస్థలు రావాలి
కవి సమ్మేళనాలు నిర్వహించాలి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment