వందనాలు వందనాలు!
వందనాలు వందనాలు — తెలుగు ప్రేమికులకు వందనాలు!
వందనాలు వందనాలు — కవితా ప్రియులకు వందనాలు!
అక్షరాభిమానులకు — ఆత్మీయ బంధాలకు వందనాలు!
అమృతధారల సాహిత్యాన్ని — ఆస్వాదించే వారందరికీ వందనాలు!
కవులకు వందనాలు — కవయిత్రులకు వందనాలు!
కమ్మని కవితలు అల్లే కలాలన్నిటికీ వందనాలు!
భావాలను పలికించే భాషాభిమానులకు వందనాలు!
భావుకతను పంచే హృదయాలన్నిటికీ వందనాలు!
పత్రికలకు వందనాలు — పాత్రికేయులకు వందనాలు!
ప్రజల గొంతుక వినిపించే కలాలకు వందనాలు!
పాఠకులకు వందనాలు — ప్రశంసకులకు వందనాలు!
పదిమందికి ప్రేరణనిచ్చే ప్రతిభావంతులకు వందనాలు!
సద్విమర్శకులకు వందనాలు — సన్మార్గం చూపేవారికి వందనాలు!
లోపాలను సరిదిద్ది ఎదుగుదలకు తోడ్పడే వారికి వందనాలు!
స్నేహితులకు వందనాలు — సలహాదారులకు వందనాలు!
కష్టకాలంలో చేయూతనిచ్చే కరుణామయులకు వందనాలు!
సాహితీ సంస్థలకు వందనాలు — సభా నిర్వాహకులకు వందనాలు!
సాహితీ సుమనాలను ఒక్కచోట చేర్చే సారథులకు వందనాలు!
వేదికలను అందించే పెద్దలకు — అవకాశాలను కల్పించేవారికి వందనాలు,
కొత్త కవులకు ప్రోత్సాహమిచ్చే సహృదయులందరికీ వందనాలు!
శాలువాలు కప్పేవారికి వందనాలు — సత్కారాలు చేసేవారికి వందనాలు!
ప్రతిభను గుర్తించి గౌరవించే పెద్ద మనసులకు వందనాలు!
బిరుదులు అందించేవారికి — బహుమతులు పంచేవారికి,
కవుల కృషిని కొనియాడే కళాభిమానులందరికీ వందనాలు!
ప్రచురణకర్తలకు వందనాలు — పుస్తకాలు అచ్చువేసేవారికి వందనాలు!
పుస్తకాలను కొనేవారికి — ప్రేమతో చదివేవారికి వందనాలు!
అక్షర సంపదను భావితరాలకు అందించే మహనీయులకు,
తెలుగు భాషా వైభవాన్ని నిలిపే తరతరాల వారధులకు వందనాలు!
తెలుగు భాషకు వందనాలు — తీయని తెలుగు పలుకులకు వందనాలు!
తేనెలొలికే పద్యాలకు — హృదయాలను తాకే గేయాలకు వందనాలు!
జానపదాలకు వందనాలు — జ్ఞానప్రద కావ్యాలకు వందనాలు!
జాతి సంస్కృతి సౌరభాన్ని చాటే సాహిత్యానికి వందనాలు!
వందనాలు వందనాలు — తెలుగు వెలుగులకు వందనాలు!
వందనాలు వందనాలు — సాహితీ సౌరభాలకు వందనాలు!
కలిమినిచ్చే కలాలకు — బలమినిచ్చే కళలకు వందనాలు!
తెలుగు జాతి కీర్తి చాటే — సాహితీ వేత్తలందరికీ వందనాలు!
వందనాలు వందనాలు — అందరికీ వందనాలు!
అక్షరం ఉన్నంతకాలం — ఆత్మీయ వందనాలు!
తెలుగు భాష బతికినంతకాలం — తీయని వందనాలు!
సాహిత్యం శ్వాసించినంతకాలం — సదా సదా వందనాలు!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment