నిద్ర సూత్రాలు
నిద్ర దేహానికి విశ్రాంతి —
మనసుకు ప్రశాంతి!
నిద్ర దైవప్రసాదం —
అమూల్యమైన వరం!
అలసిన తనువుకు నిద్ర ఉపశమనం —
ఆలోచనలకు విరామం!
ఆరోగ్యానికి ఆధారం —
ఆయుష్షుకు ఆలంబనం!
అతిగా పగటి నిద్ర పనికి చేటు —
బద్ధకాన్ని అందరికి చాటు!
రాత్రి నిద్ర వంటికి మేలు —
ఆరోగ్యానికి శుభదాయకమగు!
సమయపాలనతో నిదురిస్తే —
సుఖసంతోషాలు కలుగు!
క్రమబద్ధమైన జీవనానికి —
నిదురే తొలి మెట్టగు!
సమయపాలనతో నిదురిస్తే —
సుఖసంతోషాలు తోడుండు!
క్రమబద్ధమైన జీవనానికి —
నిదురే తొలి మెట్టు!
అతినిద్ర అనర్థదాయకం —
చురుకుదనానికి ఆటంకం!
అలసత్వానికి ఆలవాలం —
అభివృద్ధికి అవరోధం!
నిద్రలేమి అనారోగ్య సూచకం —
ఆందోళనలకు ఆహ్వానం!
కలత నిదుర మనశ్శాంతికి భంగం —
తనువుకు కలిగించును అలసటాభారం!
సుఖనిదుర కరువైతే —
సంతోషాలకు దూరం!
కారణాలు తెలుసుకొని సరిచేసుకుంటే —
ఆరోగ్యమే మన సొంతం!
కంటినిండా నిదుర ఉంటే —
ఒంటినిండా ఉత్సాహం!
కమ్మని నిదుర తోడుంటే —
కొత్తరోజుకు నూతనోత్సాహం!
నిదురలోనూ క్రమశిక్షణ —
నిత్యజీవితానికి రక్షణ!
నిద్రసూత్రాలు పాటిద్దాం —
ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!
నిద్రే జీవనానికి నూతన చైతన్యం!
నిద్రే ఆరోగ్యానికి ఆనంద సౌభాగ్యం!
అతిగా వద్దు — మరీ తక్కువా వద్దు!
అవసరమైన నిదురతో — ఆయురారోగ్యాలు పొందుదాం!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment