అనుకున్నా! 


అందమైన కవితనొకటి రాయాలని అనుకున్నా,

చక్కనైన చెలికత్తెకు పంపాలని అనుకున్నా.


చల్లనైన తెల్లనైన వెన్నెలలో చెలిని పిలిచి,

చెంతచేరి చేయిపట్టి నడవాలని అనుకున్నా.


పరిమళాలు చిందుతున్న పుష్పాలను కోసుకొచ్చి,

మల్లెపూల మాలగుచ్చి ఇవ్వాలని అనుకున్నా.


చిరునవ్వులు చిందిస్తూ సంతసమును కలిగిస్తూ, 

ముచ్చటైన మాటలతో గడపాలని అనుకున్నా.


తరుణి మనసు దోచుకొని వివాహమునకు సమ్మతించి, 

తలనువంచి తాళికట్టి తేవాలని అనుకున్నా.


మనసులోన రేగినట్టి కోరికలను సాధించగ, 

కన్న కలలన్నీ నిజము చేయాలని అనుకున్నా.


అక్షరాలు కూరుస్తూ సుపదాలను పేరుస్తూ,

కవిరాజుగా జగమంత ఏలాలని అనుకున్నా.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog