కవితా పరిమళాలు!


కవితలు మొలుస్తున్నాయి — కలల విత్తనాలై!

కవితలు పూస్తున్నాయి — కలకాలపు పుష్పాలై!

కవితలు కాస్తున్నాయి — కమ్మనైన ఫలాలై!

కవితలు పిలుస్తున్నాయి — కవుల గుండె గొంతులై!


కవితలు కడుపులు నింపుతున్నాయి — కవులకు జీవనాధారమై!

కవితలు మనసులను దోచుతున్నాయి — మధురమైన భావాలై!

కవితలు కన్నీటిని తుడుస్తున్నాయి — కరుణామయ హస్తాలై!

కవితలు గాయాలను మాన్పుతున్నాయి — ఓదార్పునిచ్చే లేపనాలై!


కవితలు నవ్వులు పూయిస్తున్నాయి — నవరసాల విందులై!

కవితలు వెన్నుతట్టి లేపుతున్నాయి — నూతన ఆలోచనలై!

కవితలు సమాజాన్ని కదిలిస్తున్నాయి — చైతన్యపు శంఖాలై!

కవితలు చరిత్రను లిఖిస్తున్నాయి — తరతరాల సాక్ష్యాలై!


కవితలు ప్రేమను పంచుతున్నాయి — అనురాగపు జల్లులై!

కవితలు ఆశను పెంచుతున్నాయి — ఆత్మవిశ్వాస దీపాలై!

కవితలు బంధాలను కలుపుతున్నాయి — అనుబంధపు వారధులై!

కవితలు బ్రతుకును నడిపిస్తున్నాయి — బంగారు బాటలై!


కవితలు అక్షరమాలలై అలరిస్తున్నాయి — అందమైన అలంకారాలై!

కవితలు భావాలుగా పలుకుతున్నాయి — హృదయపు ప్రతిధ్వనులై!

కవితలు లోకాన్ని ఏలుతున్నాయి — సాహితీ సామ్రాజ్యాలై!

కవితలు కవులను నిలుపుతున్నాయి — కీర్తి కిరీటాలై!


కవితలే కవులకు కలకాలపు సంపదలు —

కవితలే పాఠకులకు పంచామృత రుచులు!

కవితలే సమాజానికి వెలకట్టలేని వెలుగులు —

కవితలే వెదజల్లే జీవితపు పరిమళాలు!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog