తలుపుల్లేని ఇల్లు నా ఇంటికి తలుపులులేవు అందరినీ ఆహ్వానిస్తా నా ఆలోచనలకు హద్దులులేవు అంశాలన్నిటినీ అవలోకిస్తా నా చేతులకు సంకెళ్ళులేవు అనుకున్నవన్నీ చేసేస్తా నా కాళ్ళకు బందాలులేవు కోరినచోటుకు పోతుంటా నా మాటలకు ఆంక్షలులేవు తట్టినవన్నీ చెబుతా నా కళ్ళకు కట్టులులేవు అందాలన్నిటినీ చూపిస్తుంటా నా మనసుకు షరతులులేవు మంచివాటినన్నీ పంచిపెడతా నా కవితలకు పరిమితులులేవు విషయాలన్నీ వ్యక్తపరుస్తా నేను స్వేచ్ఛాజీవిని నిబంధనలకులొంగను నేను కవిని నిరంకుశడను నా కవితలు వాస్తవరూపాలు నా లోకము సాహిత్యలోకము గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Posts
Showing posts from June, 2024
- Get link
- X
- Other Apps
మబ్బులు మబ్బులు లేకపోతే తారాపధము తెరలాకనిపిస్తుంది మబ్బులు ఏర్పడుతుంటే ఆకాశమును పొగలు ఆక్రమిస్తున్నట్లుంటుంది మబ్బులు గుమిగూడుతుంటే ప్రళయము ముంచుకొస్తున్నట్లుంటుంది మబ్బులు కదులుతుంటే మలయమారుతము వీస్తున్నట్లుంటుంది మబ్బులు తేలుతుంటే ఊహలు మదిలోచెలరేఎగుతాయి మబ్బులు మెరుస్తుంటే వెండి వెలుగుతున్నట్లుంటుంది మబ్బులు క్రమ్ముతుంటే సమరానికి సమాయత్తమవుతున్నట్లుంటుంది మబ్బులు నల్లబడుతుంటే తలనెత్తి పైకిచూడాలనిపిస్తుంది మబ్బులు ఆకారాలుమార్చుకుంటుంటే రకరకాలబొమ్మలు దర్శనిమిస్తున్నట్లుంటుంది మబ్బులు రాసుకుంటుంటే మెరుపులు మిలమిలలాడుతాయి మబ్బులు కొట్టుకుంటుంటే ఉరుములు పెళపెళమంటాయి మబ్బులు కరుగుతుంటే చినుకులు చిటపటరాలుతాయి మబ్బులు ఆకసానికి అందాలు చెట్లకు బంధువులు రైతులకు నేస్తాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తెలుగు తీరుతెన్నులు తెలుగుతల్లి పిలిచింది వెలుగులను విసిరింది తెలుగుబాష లెస్సన్నది దేశమందు మిన్నన్నది తెలుగుదారి కనిపించింది చక్కదనాలను చూపించింది తెలుగుతీపి రుచిచూపింది మనసును మురిపించింది తెలుగుతోటలు పెరిగాయి పాడిపంటలు పొంగాయి తెలుగుపూలు పూచాయి తనువును తరింపజేశాయి తెలుగుగాలులు వీచాయి సౌరభాలను చల్లాయి తెలుగుపదాలు తట్టాయి తిన్నగా తీరాయి తెలుగుతలపులు పుట్టాయి కమ్మనికవితలు కూరాయి తెలుగుకవులు ఆవహించారు తేటతెల్లముగను వ్రాయించారు తెలుగోడినని ఘనంగాచెప్పుకుంటాను తలనెత్తుకొని సగర్వంగాతిరుగుతాను తెలుగుతీరులు తిలకించమంటాను తెలుగుతెన్నులు తెలుసుకోనమంటాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
జగ్గడు జగ్గడు తగ్గడు తిడతాడు తలవంచడు పాపం జగ్గడు ఓడిపోయాడు ఓర్పుకోల్పోయాడు ఎందుకో జగ్గడు నిందలేస్తున్నాడు నిప్పులుచిందుతున్నాడు ఏలనో జగ్గడు కోపాన్నిక్రక్కుతున్నాడు కొంపముంచారంటున్నాడు అయ్యో జగ్గడు భయపడుతున్నాడు బంధీచేస్తారనుకుంటున్నాడు అయ్యయ్యో జగ్గడు తడబడుతున్నాడు తిక్కగామాట్లాడుతున్నాడు ఏమయ్యిందో జగ్గడు కోతిలాతయారయ్యాడు కిచకిచమంటున్నాడు అరెరే జగ్గడు త్రాగినట్లున్నాడు తందనాలుత్రొక్కుతున్నాడు ఎవరెవరినో జగ్గడు ప్రాధేయపడుతున్నాడు రక్షించమనివేడుకుంటున్నాడు ఎక్కడికో జగ్గడు ఊరువిడిచివెళ్ళాడు చిక్కితేతన్నుతారనుకుంటున్నాడు ఎవరుచెప్పారో జగ్గడు తెలుసుకున్నట్లున్నాడు కోర్టుశిక్షలుతప్పవనుకుంటున్నాడు ఏమయనో జగ్గడు అడ్డదార్లుపట్టాలనుకుంటున్నాడు అవినీతినుండిబయటపడాలనుకుంటున్నాడు పాపం జగ్గడు బయటపడతాడో భంగపడతాడో వేచిచూద్దాం కనిపెట్టుందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
భిన్నబాంధవ్యాలు రాధకి కృష్ణునికి బృందావన బంధమేమిటో? సీతారామునికి సంజీవరాయునికి స్వామిసేవకుల సాంగత్యమేమిటో? సీతాకోకచిలుకకి సుమానికి సమాగమ సంబంధమేమిటో? నింగికి నేలకు నెలకొన్న నెయ్యమేమిటో? మట్టికి మనిషికి మహినందు మెలికేమిటో? దృశ్యాన్నికి ద్రష్టకి ధరణినందు దోస్తేమిటో? ప్రియుడుని ప్రేయసిని పెనవేసే ప్రేమపొత్తులేందుకో? మల్లెలకి మధుమాసానికి ముచ్చటగ జతకలపటమెందుకో? మదాలాపికి మావిచిగురులకు మేళనము చేసినదెందుకో? తెలుగుకి తేనియకు తియ్యదనాలను తగిలించినదెందుకో? కవిని పాఠకుని కవితలు కట్టిపడవేయటమెందుకో? గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
సశేషం పయనం ఆగదాయె విరామం చిక్కదాయె ప్రయోజనం సమకూరదాయె సంతసం లభించదాయె దూరం తరగదాయె గమ్యం చేరువకాదాయె కాలం కదలదాయె ముహూర్తం కుదరదాయె కమ్మదనం కరువయిపోయె మాధుర్యం దుర్లభమాయె సుఖం దొరకదాయె శాంతం దక్కదాయె సంసారం గడవదాయె సమరం ముగియదాయె జీవనం సాగాల్సిందె పోరాటం చేయాల్సిందె అంతంకోసం చూడాల్సిందె ఆగడియకోసం నిరీక్షించాల్సిందె లోకం విశేషమాయె జీవితం సశేషమాయె గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవులరాతలు అల్లిబిల్లి రాతలన్నీ ఆనందంకోసమే ఆస్వాదిస్తారా జిగిబిగి కూర్పులన్నీ జాగృతిపరచటానికే జీర్ణించుకుంటారా హడావుడి గీతలన్నీ హాయినివ్వటంకోసమే అందుకుంటారా చకచకాపేర్చటాలన్నీ సాహితీప్రియుల సంతసానికే స్వీకరిస్తారా కవనకుసుమాలన్నీ తలలకెక్కించటానికే తెలుసుకొని తృప్తినిపొందుతారా కైతలసౌరభాలన్నీ కవితాభిమానులపై చల్లటానికే క్రోలుకొని కుతూహలపడతారా అంతరంగ ఆలోచనలన్నీ అందమైన కవితకోసమే అర్ధంచేసుకొని అభినందిస్తారా అక్షరాల అమరికలన్నే మస్తకాలను తట్టటానికే మదిలో నిలుపుకుంటారా పదాల ప్రయోగాలన్నీ పరవశపరచటానికే పరమార్ధాలను గ్రహిస్తారా వ్రాసిన కవితలన్నీ పాఠకులకోసమే పఠించి పులకిస్తారా వాక్యాల విక్రమాలకు విలువను ఇవ్వండి కవితల కళాత్మకతలకు ఖరీదును కట్టండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవిగారి కవితలకమామిషు అందమే కవికి ప్రకంపనం హృదయానికి స్పందనము ఆనందమే కవికి గమ్యం మనసుకు ఉల్లాసం స్వప్నమే కవికి ప్రేరణం కలముపట్టుటకు కారణం అక్షరాలే కవికి ముత్యాలు అందంగా అల్లటమే ధ్యేయము పదాలే కవికి ముఖ్యం పొసగటమే ప్రావీణ్యం భావమే కవితకి ప్రాణం పాఠకులకు ప్రమోదం ప్రాసలే కవితకి ఆకర్షణం వినటానికి మాధుర్యం పోలికలే కవితకి బలం మనసును తట్టటానికి మూలం పొగడ్తలే కవికి ఉత్తేజం కవనసాగింపుకు కీలకం సన్మానాలే కవికి ప్రోత్సాహం సాహిత్యసేవచేయుటకు నిరాటంకం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవనజ్యోతులు ప్రభాకరుడు ప్రొద్దున్నే పడమటికి పయనిస్తుంటే కాలము కదులుతుంటే నీడలు తారాడుతుంటే పద్మాలు వికసిస్తుంటే పక్షులు ఎగురుతుంటే కిలకిలా అరుస్తుంటే ఆలోచనలు పారుతుంటే మనసు మురిసిపోదా గుండె గుబాళించదా హృదయం పరవశించదా కవిసూరీడు కాంచడా కలమును చేతపట్టడా కవనకుసుమాలు వికసించవా పున్నమి జాబిల్లి పొడుచుకొస్తుంటే నింగినీలిరంగు పులుముకుంటే తారలు తళతళామెరుస్తుంటే వెన్నెల కురుస్తుంటే చల్లగాలులు వీస్తుంటే మబ్బులు తేలుతుంటే ఉరుములు వినబడతుంటే మెరుపులు కనబడుతుంటే టపటపచినుకులు రాలుతుంటే మది ముచ్చట పడదా ప్రేమానురాగాలు పుట్టవా కవిసోముడు గమనించడా కలమును కదిలించడా కవితాచంద్రికలు వెలువడవా రవిచంద్రులు రెండుకళ్ళు భువివెలుగులు కవిప్రేరకులు సూర్యసోములు ప్రకృతిప్రతీకలు సహజసౌందర్యాలు కవితావస్తువులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవితాసూక్ష్మం కవిత తట్టింది కలాన్నిపట్టించింది కాగితాన్నినింపించింది కవిత పుట్టింది చేతుల్లోకివచ్చింది పరవశాన్నిచ్చింది కవిత ఊరింది ఉద్వేగపరచింది ఉబలాటపరచింది కవిత పొంగింది అబ్బురపరచింది ఆనందంకూర్చింది కవిత పారింది అక్షరాలుప్రవహించాయి పదాలుచెరువులోనిలిచాయి కవిత పూచింది చక్కదనాలుచూపింది సుగంధాలుచల్లింది కవిత కోరింది కమ్మగాకూర్పించింది కుతూహలాన్నిపంచింది కవిత కురిసింది కాలవల్లోపయనించింది కుంటల్లోకాపురంపెట్టింది కవిత లభించింది చక్కగాచదివించింది చిత్తాన్నిదోచేసింది కవిత కనిపించింది కవనలోకాంలోకితీసుకెళ్ళింది కవిత్వరుచులనుతినిపించింది కవితాసూక్ష్మాలను తెలుసుకుందాం పాఠకులమనసులను దోచుకుందాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
నేను నాస్వభావాలు నా అంగాలకు అందంగా తయారవటం తెలియదు నేను నిరాడంబరుడను నా చేతులకు ఎదుటివారిని కొట్టటం చేతకాదు నేను అహింసావాదిని నా కాళ్ళకు తన్ని తరమటం అలవాటులేదు నేను అందరికీ ఆప్తమిత్రుడను నా కళ్ళకు నిప్పులు క్రక్కటం రుచించదు నేను శాంతమూర్తిని నా చెవులకు చాడీలు వినటం పొసగదు నేను సత్యవాదిని నా గుండెకు కఠినంగా ఉండటం వల్లకాదు నేను దయాళువును నా హృదయానికి ఎవరినీ ద్వేషించటం ఎరుగదు నేను లోకబాంధవుడను నా మనసుకు చెడుగా ఆలోచించటం నచ్చదు నేను సౌమ్యుడను నా కాయానికి మోసంచేయటం తెలియనేతెలియదు నేను నిజాయితీపరుడను నింగి ఎవరిమీదా పడాలనుకోదు నేల ఎవరినీ మట్టితోకప్పాలనుకోదు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
వ్యర్ధకవనాలు అర్ధంపర్ధంలేని కవితలు వ్యర్ధం ఉపమానరూపకాలులేని కైతలు అందవిహీనం ఇంపుసొంపులేని కయితలు కంపుతోసమానం పొంకపరిమళాలులేని కవనసుమాలు త్యజనీయం అందచందాలుచూపని అక్షరకూర్పులు విమర్శనాత్మకం శ్రావ్యతసున్నితత్వంలేని రచనలు అశుద్ధం అవాకులుచవాకులున్న కవులరాతలు అనర్ధదాయకం ఎక్కువపదాలువాడి తక్కువభావంతెలిపే కవిత్వము చెత్తతోసమానం అసందర్భ అనవసపదాలున్న కవులకల్పనలు నిందాత్మకం చివర చమకులేని కవితము అనాదరణీయం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఓ కవీ! కుదిరితే బ్రహ్మాండంగారాయి లేకపోతే బాగుగారాయి అదీ చేతకాకపొతే మాములుగారాయి అంతేకాని చేతులు కట్టేసుకొని ఆలోచనలు ఆపివేసి కలాలు వదిలేసి కాగితాలు విసిరేసి సాహిత్యసన్యాసం పుచ్చుకొని గమ్మున ఉండబోకు చక్కదనాలు చూపించు సంతసాలు కలిగించు అక్షరాలను ముత్యాల్లాగుచ్చు అలంకరించుకొనమని ఆహ్వానించు పదాలను పసందుగాప్రయోగించు పాఠకులమదులు దోచుకొను సాహితీకుసుమాలు విరజిమ్ము సుమపరిమళాలు వెదజల్లు కవితలను కమ్మగాపాడు గాంధర్వగానంతో అలరించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఎవడయ్యవాడు! ఇరువదినాలుగు గంటలు ఆలోచనలలో తేలువాడు మంచి విషయాలకొరకు ముప్పొద్దులా కాచుకొనెడివాడు ఎవడయ్య వాడెవడు? ఇంకెవరు మనకవిగారతడు! ఎల్లప్పుడూ కలమును చెంతనే ఉంచుకొనెడివాడు తెల్లకాగితాలు పక్కనుంచుకొనెడివాడు నల్లగీతలను గీసెడివాడు ఎవడయ్య వాడెవడు? ఇంకెవరు మనకవిగారతడు! అక్షరాలను వెతికిపట్టుకొనువాడు పదాలను ప్రీతితోపొసుగువాడు పంక్తులను ప్రాసలతోకూర్చువాడు చరణాలను చక్కగాచేర్చువాడు ఎవడయ్య వాడెవడు? ఇంకెవరు మనకవిగారతడు! పద్యాలను పసందుగాపేర్చువాడు వచనకవితలను విరివిగావ్రాసెడివాడు గేయాలను గటగటావినిపించెడివాడు శారదాదేవికి ప్రీతిపాత్రమైనవాడు ఎవడయ్య వాడెవడు? ఇంకెవరు మనకవిగారతడు! సాహితీసమ్మేళనాలలో పాల్గొనువాడు శ్రావ్యంగా కవితలుపాడువాడు శాలువాలు భుజానకప్పెంచుకొనెడివాడు సన్మానసత్కారాలకు పొంగిపోయెడివాడు ఎవడయ్య వాడెవడు? ఇంకెవరు మనకవిగారతడు! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
లోకంతీరు అన్నీ అవయాలుంటేనే మనిషిగాచూస్తారు మానవత్వం ఉన్నా లేకపోయినా మంచి బట్టలేసుకుంటేనే మర్యాదనిస్తారు మాటలుచేష్టలు బాగున్నా లేకున్నా చక్కని రూపముంటేనే స్వాగతిస్తారు అందమే ఆనందమనుకొని నవ్వులముఖాలనే ఇష్టపడతారు ప్రతిస్పందించి పరవశముపొంది అధికారమున్నవారికే అధికప్రాధాన్యమిస్తారు దగ్గరవటానికి తహతహలాడుతూ పలుకులు తియ్యగాయుంటేనే శ్రద్ధగావింటారు ఆస్వాదించి అక్కునచేర్చుకొని నచ్చినవారినే ఆకాశానికెత్తుతారు నలుగురుతోకలసి సన్మానసత్కారాలందించి మేలుచేసేవారినే మెచ్చుకుంటారు మనసునందు నిలుపుకొని ఉచితంగాయిస్తామంటే ఉరుకులుపరుగులుతీస్తారు చిక్కినదంతా పుచ్చుకుందామని విజయంసాధిస్తే విర్రవీగుతారు ఓడినవారిని అవహేళనచేస్తూ లోకంతీరు గమనించు తగినట్లు వ్యవహరించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
ఈ లోకం పడుకుంటే లేవమంటుంది మేలుకుంటే కూర్చోమంటుంది కూర్చుంటే నిలబడమంటుంది నిలుచుంటే నడవమంటుంది నడుస్తుంటే పరుగెత్తమంటుంది పరుగెడుతుంటే పరిహసిస్తుంది ఆగితే అదిలించుతుంది అలసినా సొలొసినా పట్టించుకోదు పరామర్శించదు తోచిందంతా చెబుతుంది చెప్పిందంతా వినమంటుంది వినిందంతా చెయ్యమంటుంది చేసిందంతా మరచిపొమ్మంటుంది ప్రతిఫలమేమీ ఆశించవద్దంటుంది నచ్చిందంతా పొగుడుతుంది మెచ్చిందంతా మంచిదంటుంది ఇష్టమైనా కష్టమైనా పాటించమంటుంది ప్రాముఖ్యంపొందమంటుంది లోకాన్ని ఎరగరా లౌక్యంగా మెలగరా ఏటికెదురుగా ఈదకురా ఎండనునుపట్టి గొడుగునెత్తరా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
వద్దురా! పెళ్ళొద్దురా!! వద్దురా వద్దురా వివాహం వద్దురా పెళ్ళాము వద్దురా కష్టాలు వద్దురా ||వద్దురా|| కైక మంధరమాటవిని భర్త ప్రాణముతీసెరా సీత బంగరులేడినికోరి మొగునికి కష్టాలుతెచ్చెరా చిత్రాంగద చిచ్చుపెట్టి సారంగధరుని హింసించెరా అప్సరస అందాలుచూపించి రాజర్షి తపసుచెరిచెరా ||వద్దురా|| తార వలన శశి ఇబ్బందులుపడెరా ఇంతి మూలాన ఇంద్రుడి ఒళ్ళుచెడెరా కళ్యాణం నాటకంరా కాపురం బూటకమురా ఇల్లు ఇరకటమురా ఇల్లాలు మరకటమురా ||వద్దురా|| చక్కదనాలు చూపుతారురా వలపువలలు విసురుతారురా చేతుల్లో చిక్కించుకుంటారురా చెప్పుచేతల్లో పెట్టుకుంటారురా గయ్యాళ్ళు వద్దురా దెయ్యాలు వద్దురా భూతాలు వద్దురా ప్రేతాలు వద్దురా || వద్దురా|| అతివలు అలుగుతుంటారురా అలకపానుపు ఎక్కుతుంటారురా మహిళలు మారాముచేస్తుంటారురా మొగుళ్ళను బుట్టలోవేసుకుంటారురా తరుణులు ఏడుస్తుంటారురా కన్నీరు కారుస్తుంటారురా కొంగుకు మొగుడినికట్టుకుం...
- Get link
- X
- Other Apps
హృదయవిదారకాలు ఖాళీకడుపులు కేకలేస్తున్నాయి ప్రేగులు గుడగుడమంటున్నాయి కన్నీళ్ళు కారుతున్నాయి కాలువలు కడుతున్నాయి శరీరాలు శ్రమిస్తున్నాయి చెమటలు స్రవిస్తున్నాయి ఒళ్ళు మండుతున్నాయి రక్తము మరుగుతుంది పేదలు ఏడుస్తున్నారు ముక్కులు చీదుతున్నారు దేహాలు అలసిపోతున్నాయి సొంగలు స్రవిస్తున్నాయి హృదయాలు కరుగుతున్నాయి మనసులు విలపిస్తున్నాయి గుండెలు బాదుకుంటున్నారు ఆపసోపాలు పడుతున్నారు మదులు రోదిస్తున్నాయి అశ్రువులు పారుతున్నాయి ఇక చూస్తా ఊరుకోలేను రంగంలోనికి దిగకుండా ఉండలేను అనాధలకు అండగానిలుస్తా ఉద్యమాలు ఉధృతంచేస్తా సామ్యవాదము కావాలంటా సంఘసంస్కరణలు రావాలంటా గొంతెత్తి నినదిస్తా కలంపట్టి కదులుతా కదంకదం కలుపుతారా ఉద్యమానికి ఊతమిస్తారా సంక్షేమరాజ్యం సాధిద్దామా సమానత్వమును స్థాపిద్దామా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కవితారూపాలు ఓ కవిత్వమా నీ రూపాలెన్నో నీ అంశాలెన్నో నీ స్మృతులెన్నో ఒకసారి అందంగా దోచుకుంటావు మరోసారి ఆనందంగా తోచుతుంటావు ఒకసారి ఆలోచనగా అవతరిస్తావు మరోసారి భావంగా బయటకొస్తావు ఒకసారి అమృతాన్ని చిమ్ముతావు మరోసారి తేనెచుక్కలు చల్లుతావు ఒకసారి పద్యంగా వెలువడుతావు మరోసారి వచనగా వేషమెత్తుతావు ఒకసారి పాటగా అలరిస్తావు మరోసారి గేయంగా మురిపిస్తావు ఒకసారి పువ్వులా ముందుకొస్తావు మరోసారి పరిమళంలా వ్యాపిస్తావు ఒకసారి రవిలా ఉదయిస్తావు మరోసారి శశిలా పొడుచుకొస్తావు ఒకసారి నదిలా ప్రవహిస్తావు మరోసారి కడలికెరటంలా ఎగిసిపడతావు ఒకసారి ప్రేమజల్లుల్లో ముంచుతావు మరోసారి వానచినుకుల్లో తడుపుతావు ఒకసారి గాలిలా తాకుతావు మరోసారి నిప్పులా కాలుస్తావు ఓ కవిత్వమా నీ మహిమలెన్నో నీ ప్రేరణలెన్నో నీ ధోరణులెన్నో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
తాజా ఎన్నికలచిత్రం చంద్రుడు గెలిచాడు విమానాల్లో తిరుగుతున్నాడు నరేంద్రుడు ఓడకగెలవక నిలిచాడు బ్రతికి బయటపడ్డాడు ఊపిరి పీల్చుకున్నాడు జగన్నాటకుడు ఓడిపోయాడు తలను దించుకున్నాడు రాహుద్రష్టుడు చతికలపడ్డాడు మరోమారు అపజయాన్నిమూటకట్టుకున్నాడు చంద్రుడు పాలకుడయ్యాడు తడాఖాను చూపిస్తున్నాడు నరేంద్రుడు కూటమితోకూడాడు దేశపాలనను చేతబట్టాడు జగన్నాటకుడు తట్టాబుట్టాసర్దుకున్నాడు చేతులెత్తేశాడు సమరంనుంచితప్పుకున్నాడు రాహుద్రష్టుడు తల్లడిల్లిపోయాడు విమర్శలు వెళ్ళక్రక్కుతున్నాడు చంద్రుడు చకచకాపావులుకదిపాడు రాజ్యాధికారానికి కేంద్రబిందువయ్యాడు నరేంద్రుడు ప్రధాననేతయ్యాడు భారతావనిని వృద్ధిచేస్తానంటున్నాడు జగన్నాటకుడు మెల్లగాజారుకున్నాడు భయముతో గడగడావణికిపోతున్నాడు రాహుద్రష్టుడు జనాన్నినమ్మించలేకపోయాడు ప్రతిపక్షానికి పరిమితమయిపోయాడు ఎన్నికలచిత్రం విచిత్రం నాయకులనాటకం జగన్నాటకం కల్పితపేర్లతో కట్టుకవితనల్లా పాఠకోత్తములతో పఠింపజేయతలచా ఎవ్వరినీ నొప్పించదలుచుకోలా ఎవ్వరినీ తలకెత్తుకోవాలనుకోవటంలా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కొత్తలోకం లోకం కొత్తగా కనిపిస్తుంది కన్నులు ఆర్పకుండా చూడాలనిపిస్తుంది లోకం అందంగా అగుపడుతుంది చూపును తిప్పకుండా కాంచాలనిపిస్తుంది లోకం వింతగా దర్శనమిస్తుంది దృశ్యాలు తన్మయత్వాన్ని కలిగిస్తున్నాయి లోకం రంగులను చిమ్ముతుంది కాంతులు చుట్టూ వ్యాపిస్తున్నాయి లోకం ఆశ్చర్యం కలిగిస్తుంది మనసు ముచ్చట పడుతుంది లోకం అద్భుతాంగా తోస్తుంది కొండాకోనలు కళ్ళను కట్టిపడవేస్తున్నాయి లోకం అంతరంగాన్ని తట్టుతుంది అందాలను వీక్షించమంటుంది లోకం మదిని ముట్టుతుంది ఆనందాలను ఆస్వాదించమంటుంది కంటికి చికిత్స జరిగింది లోకం పూర్తిగా మారిపోయింది లోకం నావైపే చూస్తుంది ఏలనో నన్నే ప్రేరేపిస్తుంది కవనలోకం రమ్మని పిలుస్తుంది కవిత్వం కమ్మగా కూర్చమంటుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Get link
- X
- Other Apps
కంటిచూపు కంటిచూపు చెబుతుంది ఏదోలోపం వచ్చిందని అందాలు కనబడటంలేదని ఆనందాలు కలగటంలేదని కళ్ళు ఏడుస్తున్నాయి కన్నీరు కారుస్తున్నాయి చూపు తగ్గిందని వయసు పెరిగిందని కనులు నిప్పులుక్రక్కుతున్నాయి మంటలు ఎగిసిపడుతున్నాయి అక్రమాలనుచూచి అన్యాయాలనుకాంచి అత్యాచారాలనువీక్షించి అబద్ధాకోరులమాటలువిని మూడోకన్ను తెరవాలనిపిస్తుంది ముష్కరులను మసిచేయాలనిపిస్తుంది సమాజాన్ని రక్షించాలనిపిస్తుంది అణగారినవారికి అండగానిలవాలనిపిస్తుంది సాహితి విచారిస్తుంది సరస్వతి శోకిస్తుంది కవనప్రియుడు కలంపట్టటంలేదని ప్రియపుత్రుడు పుటలునింపటంలేదని వైద్యులు కంటిచికిత్సచేశారు కాంటాక్టులెన్సు అమర్చారు తలొగ్గకతప్పలేదు అద్దాలకంగీకరించాను సర్జరీజరిగింది పక్షంరోజులవిరామంతీసుకుంటున్నాను భార్య కలాలుదాస్తుంది కూతురు కాపలాకాస్తుంది ఆలోచనలు వెంటబడుతున్నాయి భావాలు పరుగులెత్తమంటున్నాయి ఎదురుచూచే పాఠకుకులకు ధన్యవాదాలు విమర్శించే విఙ్ఞులకు విన్నపాలు ఓదార్చే స్నేహితులకు కృతఙ్ఞతలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం