Posts

Showing posts from April, 2025
Image
 అందచందాలు ముగ్గువేస్తే ఇంటికి అందం సిగ్గులొలికితే మోముకు అందం రంగువేస్తే బొమ్మకు అందం హంగుచూపితే మదికి అందం నవ్వులుచిందితే నెలతకి అందం పువ్వులుపెడితే కొప్పుకు అందం జాబిలిపొడిస్తే ఆకాశానికి అందం హరివిల్లు అగపడితే నింగికి అందం అక్షరాలు అమరితే కవితకు అందం పదాలు పొసిగితే కవనానికి అందం భావం బాగుంటే కవిత్వానికి అందం అంతరంగం దోస్తే సాహిత్యానికి అందం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం  
Image
 మా ఇల్లు రవికాంతులతో శశివెన్నెలతో వెలిగిపోతున్నదే మా ఇల్లు చిరునవ్వులతో శాంతిసుఖాలతో మురిసిపోతున్నదే మా ఇల్లు అతిధులతో ఆహ్వానితులతో కళకళలాడుతున్నదే మా ఇల్లు అందచందాలతో ఆనందపరవశంతో ఆకర్షిస్తున్నదే మా ఇల్లు నాలుగువైపులాచెట్లతో సుమసౌరభాలతో నందనవనాన్ని తలపిస్తున్నదే మా ఇల్లు పక్షుల కిలకిలతో పూలపండ్లతో పరవశపరుస్తున్నదే మా ఇల్లు అందరికీ నచ్చేలా చూచినవారు మెచ్చేలా తీర్చిదిద్దబడినదే మా ఇల్లు ప్రేమమూర్తులతో సేవాతత్పరులతో నిండియున్నదే మా ఇల్లు వంటల ఘుమఘుమలతో వేడివేడి వడ్డింపులతో విలసిల్లుచున్నదే మా ఇల్లు మీ రాకకోసం మీ దీవెనలకోసం ఎదురుచూస్తున్నదే మా ఇల్లు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 
Image
 తలచేష్టలు సంకేతాలు  తల గీకుకుంటే  ఆలోచనలు తోస్తాయా  తల నిమురుకుంటే  గతఙ్ఞాపకాలు గుర్తుకొస్తాయా  తల బాదుకుంటే తత్వం బోధపడుతుందా తల కొట్టుకుంటే తంటాలు తప్పుతాయా తల పట్టుకుంటే బాధలు తీరుతాయా తల కట్టుకుంటే నొప్పి తగ్గుతుందా తల స్నానంచేస్తే దేహం శుద్ధవుతుందా తల వెంట్రుకలిస్తే దైవకటాక్షం లభిస్తుందా తల వంచుకుంటే తప్పు ఒప్పుకున్నట్లేనా తల ఎత్తుకుంటే ఘనకార్యం చేసినట్లేనా తల తిప్పుకుంటే అయిష్టం వ్యక్తపరచినట్లేనా తల గోడకుకొడితే అన్యాయం జరిగినట్లేనా తల ఎగరేస్తే అంగీకారం తెలిపినట్లేనా తల పనిచేయించుకుంటే అందం ఆవహించినట్లేనా తల తెంచుకుంటే పాపాలు పరిహారమవుతాయా తల ఊపితే చెప్పినదానికి ఒప్పుకున్నట్లేనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఎవరేవరో వచ్చేరు? ఏమిటేమిటో చేసేరు?   గాలి వచ్చింది  కంటికి కనపడలేదు  చేతికి చిక్కలేదు  తనువును తాకింది  వెలుగు వచ్చింది  పట్టుకోబోతే దొరకలేదు  పలుకరిస్తే జవాబివ్వలేదు  కళ్ళల్లోకి దూరింది  వాన వచ్చింది  పొమ్మంటే పోలేదు   తగ్గమంటే వినలేదు నేలను తడిపింది  జాబిల్లి వచ్చింది  వెన్నెల చల్లింది  విహారానికి పిలిచింది  వేడుక చేసింది  అందం ముందుకొచ్చింది  అదేపనిగా చూడమంది  ఆస్వాదించమని అన్నది  అంతరంగాన్ని తట్టింది  చిరునవ్వు వచ్చింది  ఆధారాలపై కూర్చుంది  మోమును వెలిగించింది  చిందులు త్రొక్కించింది  వయసు వచ్చింది  వర్ఛస్సు పెంచింది  సొగసు ఇచ్చింది  మనసును మురిపించింది  కవిత్వం వచ్చింది  కలము పట్టించింది  కాగితం నింపించింది  కమ్మదనం కలిగించింది  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం 
Image
 కవితలపుస్తకం కవితాపుస్తకం కొనితెచ్చుకొమ్ము హస్తాభరణం అనిచేతపట్టుకొమ్ము కవితాపుస్తకం బహుమధురము కవిహృదయం చాలాఘనము కవితాపుస్తకం తెరువు కమ్మనికవిత్వం క్రోలు కవితాపుస్తకం చదువు కవిహృదయం ఎరుగు కవితాపుస్తకం పొరుగువారికిపంచు పాఠకులహృదయం తట్టిమురిపించు కవితాపుస్తకము ముద్రణకుసహకరించు కవివర్యులకు ప్రోత్సాహమునందించు కవితాపుస్తకం మూలపెట్టకు ఆలోచనలకు అడ్డుకట్టవేయకు కవితాపుస్తకం విసిరేయకు విషయాలను విస్మరించకు కవితాపుస్తకం పుటలుతిప్పు కవిగారికష్టం గుర్తించు కవితాపుస్తకము కాపాడు భావితరముకు భద్రపరచు కవితాపుస్తకం అమూల్యం అజరామరం అస్వాదనీయం కవితాపుస్తకం కవిమస్తకం కమనీయం కడురమణీయం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కాలము జీవితము క్షణాలు నీరులా ఆవిరైపోతున్నాయి వద్దన్నా ఆగకుండా చెప్పినా వినకుండా నిమిషాలు రైలుచక్రాల్లా పరుగెత్తుతున్నాయి త్వరగా ముందుకువెళ్ళాలని శీఘ్రంగా గమ్యాలనుచేరాలని గంటలు నాటకసన్నివేశాల్లా గడిచిపోతున్నాయి సంభాషణలు వినిపిస్తూ కథను వివరిస్తూ రోజులు సూర్య్యునితోపాటు కదులుతున్నాయి ఉదయంతో ప్రారంభమవుతూ రాత్రింబవళ్ళు మార్చుకుంటూ మాసాలు చంద్రునితోపాటు తిరుగుతున్నాయి ఓపక్షం పున్నమివరకూ పెరుగుతూ మరోపక్షం అమావాస్యవరకు తగ్గుతూ వత్సరాలు ఋతుచక్రంతోపాటు నడుస్తున్నాయి వసంతంతో ప్రారంభమయి శిశిరంతో అంతమయి వయసు తెలియకుండా మీదపడుతుంది బాల్య కౌమారాలు దాటుకుంటూ యవ్వన వృధ్యాప్యాలు అతిక్రమిస్తూ కాలము జీవనదిలా ప్రవహిస్తుంది జీవితము కాలానికెదురీదుతూ దొర్లిపోతుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం 
Image
 కవితాజననాలు కవితలను రమ్మంటే రావు చిన్నగాతియ్యగా ఊరుతాయి  తోడుకోమంటాయి త్రాగమంటాయి  కవితలను శాసిస్తే లొంగిపోవు రక్తిశక్తిచూపమని కోరుకుంటేనే   వెలువడుతాయి వేడుకచేస్తాయి  కవితలను భయపెడితే లొంగవు బ్రతిమలాడి బుజ్జగిస్తేనే కాగితాలకెక్కి కనువిందుచేస్తాయి కవితలను తొందరపెడితే ఒప్పుకోవు  నిదానంగా సహనంతో అభ్యర్ధిస్తేనే  దిగివస్తాయి మురిపిస్తాయి  కవితలను కావాలంటే పుట్టవు అందాలుచూపించి ఆనందంకలిగిస్తేనే జనిస్తాయి కవితలను పరుగుపెట్టమంటే ఒప్పుకోవు ఓర్పునేర్పు చూపితేనే పెళ్ళికూతురులా నడుచుకుంటూవస్తాయి కవితలను వెలిగిస్తామంటేనే రవికిరణాల్లా రమణీయంగా ముస్తాబయివస్తాయి కవితలను గుభాళించమంటేనే సౌరభాలు వెదజల్లుతూ సుమాల్లా సంబరపరుస్తాయి  కవితలను ఆస్వాదించేలా ఉంటేనే శ్రావ్యంగా సుతారంగా కళ్ళముందుకు వస్తాయి కవితలను కురవమంటే కురవు వాణీదేవి కరుణిస్తేనే కలాలనుండి జాలువారుతాయి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం