Posts

Showing posts from December, 2023
Image
 అక్షరసేవ అక్షరసేవతో ఆరంభిస్తున్నా జనవరి ఒకటిని కొత్త వత్సరాన్ని అక్షరతోరణము కడతా శుభకార్యమును మొదలిడుతా అక్షరకుసుమాలు అల్లుతా ఆంధ్రమాతమెడలో అలంకరిస్తా అక్షరసౌరభాలను చల్లుతా పరిసరాలను పరవశపరుస్తా అక్షరదీపాలు వెలిగిస్తా తేటతెలుగును మెరిపిస్తా అక్షరసేద్యం చేస్తా కవితాపంటలు పండిస్తా అక్షరామృతము కురిపిస్తా అధరాలను క్రోలమంటా అక్షరనైవేద్యము సమర్పిస్తా అద్భుతరుచులను అందిస్తా అక్షరహారతులు ఇస్తా వీణాదేవికి మ్రొక్కిస్తా అక్షరకౌముది ప్రసరిస్తా అంతరంగాలను ఆనందపరుస్తా అక్షరకిరణాలను ప్రసరిస్తా జగమును జాగృతపరుస్తా అక్షరసంపదలను అందుకోండి అభివృద్ధిపధమున నడవండి అక్షరసిరులను పంచండి అందరినీ ఆహ్లాదపరచండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 🌷🌷🌷🌷అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు🌷🌷🌷🌷
Image
కవనం ఓకాల్కులేషన్ (రచనావ్యాసంగం) రచన ఒక గణనం కాదంటే అది అబద్ధం మననం మానసికవికారం కవనం ప్రణాళికాబద్ధం ఆలోచన పుట్టటం కవితకు కారణం ఊహలు ఉబుకటం ఉల్లానికి ఉత్ప్రేరకం ఎడమమెదడు సృజనాత్మకం కుడిమెదడు దృశ్యాత్మకం వ్రాయాలి పద్ధతిప్రకారం తెలపాలి తలలోనిభావం పాఠకులను మెప్పించటం కావాలి కైతలలక్ష్యం కాగితాలను నింపటం బాషను బ్రతికించటం అక్షరాలను అల్లటం కానేకాదు సులభం పదాలను పేర్చటం కాదుకాదు సరళం పంక్తులు విడగొట్టటం మదులకు ఎక్కించటం కవితా ప్రారంభం లేపాలి కుతూహలం కవితా సమాప్తం తెలపాలి ఉద్దేశం కవితారూపము మానసికప్రతిబింబం కవిమానసికశ్రమకు లభించేప్రతిఫలం కవితలివ్వాలి మనోవికాసం కవులునిలవాలి మదుల్లోకలకాలం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 ఓ కవివర్యా! అలుపెరుగని బాటసారీ నీ అక్షరప్రయాణం సాగించవోయ్ నిరంతర అన్వేషీ నీ నిత్యవెతకులాట సాగించవోయ్ సాహిత్య సేద్యగాడా నీ కవనకృషిని కొనసాగించవోయ్ అందాల అభిమానీ నీ అద్భుతవర్ణనలను సాగించవోయ్ రవి సమానుడా నీ రమణీయతెలుగువెలుగులు ప్రసరించవోయ్ కవన బ్రహ్మా నీ అమోఘకవితలసృష్టిని సాగించవోయ్ పూల ప్రేమికా నీ కయితాసౌరభాన్ని రాతలలోచల్లవోయ్  సాహితీ సేవకా నీ కమ్మనికైతారచనలను సాగించవోయ్ కలం పట్టినవాడా నీ భావకవితామృతాన్ని కురిపించవోయ్ అమలిన ప్రేమికుడా నీ అందాలకవితాకన్యను మరువకోయ్ ప్రకృతి అరాధకుడా నీ సహజసుందరారాధనను సాగించవోయ్ కల్పనా చాతుర్యుడా నీ బావకవితాప్రావణ్యాన్ని చాటవోయ్ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవనజగతి అక్షరాలు అల్లుకుంటున్నాయి పదాలు పొంగిపొర్లుతున్నాయి పంక్తులు పేరుకుంటున్నాయి ప్రాసలు పొసుగుతున్నాయి ఆలోచనలు ఆవహిస్తున్నాయి విషయాలు వెంటబడుతున్నాయి కాగితము పరచుకుంటుంది కలము గీసుకొనిపోతుంది కవితలు కూరుతున్నాయి మనసులు మురుస్తున్నాయి పత్రికలు ప్రచురిస్తున్నాయి పాఠకులు పఠిస్తున్నారు గాయకులు పాడుతున్నారు శ్రోతలు సంతసిస్తున్నారు పుటలు నిండుతున్నాయి పొత్తాలు తయారవుతున్నాయి సాహిత్యలోకము సంపన్నమవుతుంది పుస్తకప్రపంచము ప్రకాశించిపోతుంది జై జై కవనజగతి జయహో సాహితీప్రగతి గుండ్లపల్లి రాజేందప్రసాద్, భాగ్యనగరం
 నా కలం కలం నా హలం సాహిత్యలోకాన్ని దున్నేస్తా కవితాపంటలను పండిస్తా కలం నా బలం అందాలకవితలు ఆవిష్కరిస్తా ఆనందాలను అందరికందిస్తా కలం నా అస్త్రం దుర్మార్గులపై ప్రయోగిస్తా సన్మార్గంలో నడిపించేస్తా కలం నా కరవాలం అవినీతిపరులపై ఝల్లుమనిపిస్తా నిజాయితీపరులకు పట్టంకట్టిస్తా కలం నా చైతన్యం పాఠకులను జాగృతంచేస్తా కవితాజగమును ఉఱ్ఱూతలూగిస్తా కలం నా దీపం అఙ్ఞానంధకారాన్ని తరిమేస్తా తల్లితెలుగును వెలిగించుతా కలం నా కుంచె చక్కని కవితాచిత్రాలుగీస్తా చిక్కని భావాలనుతెలుపుతా కలం నా ఉలి అద్భుతకైతాశిల్పాలను చెక్కుతా అందరిమదులను ఆకట్టుకుంటా కలం నా సాధనం కోరుకున్నవి కూర్చుకుంటా కుతూహలాన్ని కలిగించుతా కలం నా మానసం ఆలోచనలనలకు రూపమిస్తా భావాలను బయటపెడతా కలం నా హృదయం ప్రేమజల్లులు కురిపిస్తా అంతరంగాలను మురిపిస్తా కలం నా స్వరం కమ్మనైనపాటలు వ్రాస్తా శ్రావ్యమైనరాగాలు వినిపిస్తా  కలం నా ప్రాణం ఎప్పుడూ ప్రక్కనుంచుకుంటా అనునిత్యమూ కాపాడుకుంటా కలం నా జీవితం కయితలు వ్రాస్తుంటా మదులను దోస్తుంటా నా కలం చక్కనిది నా కవిత చిక్కనిది నా కలమును చూడండి నా కవితను చదవండి నా కలముగళమును  వినండి నా కవితామర్మమును ఎరగండి గుండ...
 సుద్దులపర్వము నడిచేవారిని నిలిపేయకు పరిగెత్తేవారిని పడద్రోయకు కూర్చున్నవారిని కదపకు పడుకున్నవారిని లేపకు వ్రాసేవారిని ఆపకు చదివేవారిని నిలుపకు తినేవారికూటిని తన్నుకొనిపోకు కూసేవారికూతలకి వత్తాసుపలుకకు పనిచేసేవాళ్ళను కట్టేయకు సోమరిపోతులను ప్రోత్సహించకు మంచివారిని మోసగించకు చెడ్డవారికి చేయూతనివ్వకు మతఛాందసులను మూలపెట్టు కులాలగోడలను కూలగొట్టు మానవత్వమును పెంపొందించు క్రూరత్వమును ఖండించు వక్రబుద్ధులను మానిపించు చిల్లరవేషాలను చితకకొట్టు కళ్ళల్లో కారముచల్లకు చెవుల్లో దూదినిదోపకు చేతులను కట్టేయకు కాళ్ళను బంధించకు మూతులకు తాళాలువేయకు ముక్కులకు అడ్డాలుపెట్టకు మంచిని మన్నించు చెడుని తగలబెట్టు ప్రేమను పెంచు ద్వేషాన్ని తెంచు స్వేచ్ఛను ఇవ్వు సంకెళ్ళను తొలగించు సుద్దులు గుర్తుంచుకోండి బుద్ధులు మార్చుకోండి సమాజానికి సాయపడండి లోకకళ్యాణానికి పాటుపడండి చెప్పినమాటలు వినండి సత్కార్యములను చెయ్యండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆమెకోసం (దయచూపనిచెలి) రమ్మని పిలిచా కాచుకొని ఉన్నా కళ్ళారా చూడాలని మనసారా మాట్లాడాలని పూలు తీసుకొనివచ్చా కొప్పులో తురుమాలని చేతికి ఇవ్వాలని మత్తులో ముంచాలని చేతులు కలిపి మనసులు కలిపి మురిసిపోవాలని ఎదురుచూస్తున్నా మెత్తటి పరుపుమీద చక్కని దుప్పటికప్పి కూర్చోపెట్టాలని కుతూహలపరచాలని చూస్తున్నా కళ్ళను పూర్తిగాతెరచి చుట్టూ పరికిస్తున్నా తప్పక వస్తుందని మాట నిలుపుకుంటుందని అందాన్ని క్రోలుకోవాలని ఆనందాన్ని పొందాలని ఆశను తీర్చుకోవాలని ఆరాటపడుతున్నా వేషంతో ఆకర్షించాలని మాటలతో మురిపించాలని చేతలతో సంతసపట్టాలని చప్పుడుచేయకుండా చూస్తున్నా గుసగుసలాడాలని కబుర్లలోముంచాలని చెవులలో ఊదాలని మనసుపడి చూస్తున్నా ఆమెకు దయకలుగలేదు నాకు  అదృష్టంచిక్కలేదు కళ్ళ కోరికతీరలేదు పెదవుల దప్పికతీరలేదు చెవులకు శ్రావ్యతదొరకలేదు తనువుకు తోడుదొరకలేదు కడుపు నిండలేదు మనసు మురవలేదు మోము వెలుగలేదు నవ్వు చిక్కలేదు తృప్తి కలగలేదు తనివి తీరలేదు అయినా రేపటికోసంచూస్తా మనసుకు  సర్దిచెప్పిచూస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెల్లారిందో లేదో..... (ప్రభాతవేళ-కవనప్రక్రియ) కాగితం కళ్ళముందుకొచ్చింది కవిత్వం కూర్చమనికోరింది కలం చేతపట్టమంది కవనం సాగించమంది అక్షరాలు ఎగురుకుంటూవచ్చాయి పుటలపైన పేర్చమనిప్రార్ధించాయి పదములు పరుగెత్తుకుంటూవచ్చాయి పసందుగా ప్రయోగించమనికోరాయి తలపులు తలలోతట్టాయి పేజీలపైన పొంగిపొర్లుతామన్నాయి అందాలు అగుపించాయి ఆనందాలు అందించాయి కిరణకాంతులు ప్రసరించాయి కవనకాంతులు ప్రకాశించాయి ఇంటివాకిల్ల్లు తెరచుకొని కిరణాలనుపిలిచాయి మనసుతలుపులు తెరచుకొని కవితలనుపిలిచాయి కాగితాలమీద కలం కదిలింది కమ్మదనాల కైత పుట్టింది విషయము వెనుకకువెళ్ళండి కవిత్వము ముందుకుకదలండి చూడండి చదవండి సంతసించండి సహచరులతోపంచుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం కవిత కవ్విస్తుంది సాహితి సహకరిస్తుంది వాణీదేవి కరుణిస్తుంది పలుకులను పారిస్తుంది పత్రికలు ప్రచురిస్తున్నాయి ప్రసారమాధ్యమాలు పలువురికిపంపుతున్నాయి పాఠకులు ఇష్టపడుతున్నారు విమర్శకులు మెచ్చుకుంటున్నారు అదృష్టంగా భావిస్తున్నా ఆనందంలో మునిగిపోతున్నా సాహిత్యాభిలాషులకు స్వాగతాలు ప్రోత్సాహించేవారలకు ధన్యవాదాలు
Image
ఓ పువ్వా! కిలకిలనవ్వవే పువ్వా కళకళవెలుగవే పువ్వా అందాలుచూపవే పువ్వా ఆనందలునివ్వవే పువ్వా పరిమళాలుచల్లవే పువ్వా మత్తులోముంచవే పువ్వా మొగ్గతొడగవే పువ్వా ముద్దులొలకవే పువ్వా విచ్చుకొనవే పువ్వా వేడుకచేయవే పువ్వా తేటులనుపిలవవే పువ్వా తేనెచుక్కలివ్వవే పువ్వా కొప్పులకెక్కవే పువ్వా కోరికలులేపవే పువ్వా మాలలోచేరవే పువ్వా మెడనవ్రేలాడవే పువ్వా రెక్కలిప్పుకొనవే పువ్వా అంజలిఘటించవే పువ్వా గుడికివెళ్ళవే పువ్వా దేవునిసేవించవే పువ్వా చేతులుమారవే పువ్వా చెలిమినిపెంచవే పువ్వా రాలిపోయినా పువ్వా తిరిగిపూయవే పువ్వా వాడిపోయినా పువ్వా మళ్ళీవికసించవే పువ్వా మరలపూయవే పువ్వా మనసుదోచినా పువ్వా స్వాగితిస్తానే పువ్వా చెంతకుచేరవే పువ్వా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మనోనేత్రం ఆకాశంలో ఒక్కమేఘమూలేదు భూమిమీద ఒక్కచుక్కాపడలేదు కుంభవృష్టి ఎలాకురుస్తుంది ఏరులు ఎలాప్రవహిస్తాయి అక్షరం ఒక్కటీచిక్కటంలేదు పదం ఒక్కటీపొసగటంలేదు కవితలు ఎలాకూర్చేది పుస్తకము ఎలాప్రచురించేది ఆలోచనలు ఒక్కటీతట్టటంలేదు భావములు ఒక్కటీబయటకురావటంలేదు కలము ఎలాముందుకుసాగుతుంది కాగితాలు ఎలానిండుకుంటాయి కాలము ఒక్కక్షణమాగటంలేదు తీరిక ఒక్కనినిమిషందొరకటంలేదు కబుర్లు ఎలాచెప్పుకునేది కాలక్షేపము ఎలాచేసుకునేది అందాలు ఒక్కటీకనబడటంలేదు ఆనందము ఒక్కటీకలుగుటలేదు కళ్ళను ఎలాకట్టడిచేసేది మనసును ఎలాతృప్తిపరచేది మనోనేత్రము ఒక్కటితెరచుకుంది మంచివిషయాలను ఒకటితర్వాతొకటిచూపింది కవితాలు కుప్పలుతెప్పలుగాపుట్టాయి కవనాలు కాంతికిరణాలువెదజల్లాయి నదులు ఎండిపోవు మనసు ఎడారికాదు   నేత్రము లోపల ఉంటే కవిత్వము కూడా అక్కడే గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహితీవనం సాహితీవనము వెలుగుతుంది కవితాకాంతులు చిందుతుంది సాహితీవనము పిలుస్తుంది అక్షరాలు పలుకరిస్తున్నాయి సాహితీవనము ప్రవహిస్తుంది పదాలు పరవళ్ళుతొక్కుతున్నాయి సాహితీవనము గుబాళిస్తుంది కైతాపరిమళాలు వ్యాపిస్తున్నాయి సాహితీవనము గళమెత్తుతుంది కవనగేయాలు కర్ణాలకింపునిస్తున్నాయి సాహితీవనము సందడిచేస్తుంది పలుప్రక్రియలను పరిచయంచేస్తుంది సాహితీవనము అందాలనుచూపుతుంది పరికించువారలకు ఆనందాలనందిస్తుంది సాహితీవనము నవ్వుతుంది మోములను వెలిగిస్తుంది సాహితీవనము వృద్ధిచెందుతుంది అంతరంగాలను ఆకర్షిస్తుంది సాహితీవనము చిగురిస్తుంది నవకవితలను ముందుకుతెస్తుంది సాహితీవనము చదవమంటుంది ఆలోచనలను తట్టిలేపుతుంది సాహిత్యరసమును క్రోలండి సాహిత్యజలమునందు మునగండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనకుసుమాలు కుసుమాలు కబురునుపంపాయి కబుర్లుచెప్పి కుతూహలపరిచాయి చక్కదనాలను చూపించాయి సుగంధాలను స్రవించాయి అలరులు అలరించాయి మదులను మత్తెక్కించాయి మందారాలు మధువులొలికాయి ముద్దుమాటలతో మురిపించాయి గులాబీలు గుసగుసలాడాయి గుండెలో గుబులుపుట్టించాయి మల్లెపూలు విచ్చుకున్నాయి మనసును దోచుకున్నాయి సన్నజాజులు సరసాలాడాయి సమయమును సరదాగాగడిపించాయి చామంతులు ఊయలలూగాయి వన్నెచిన్నెలను ఒలకపోశాయి ముద్దబంతులు ముసిముసిలాడాయి మోమును మిలమిలామెరిపించాయి పూలభామలు పకపకానవ్వాయి ప్రేమజల్లులు పైనవెదజల్లాయి సుమబాలలు చిరునవ్వులుచిందాయి చిత్తమందు స్థానముసంపాదించాయి కుసుమాలను స్వీకరిస్తా అక్షరసుమాలను అందంగాకూర్చుతా కవనాలను చేతికిస్తా కమ్మదనాలను చూపించుతా పూమాలలను మెడలోవేస్తా పదాలను ప్రవహింపజేస్తా భావకవితను పసందుగావ్రాస్తా పాఠకులను పరవశపరుస్తా కవితలను చదవండి కుసుమాలను తలచండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మానవత్వమా నీవెక్కడ? కాలువిరిగి కుంటుతుంటే పలుకరించేవారు ఒక్కరూలేరు కష్టాలొచ్చి కన్నీరుకారుస్తుంటే కారణమడిగేవారు ఒక్కరూలేరు కడుపుకాలి పస్తులుంటుంటే కరుణచూపేవారు ఒక్కరూలేరు రోగాలబారినపడి రోదిస్తుంటే సాయపడేవారు ఒక్కరూలేరు చినిగినబట్టలేసుకొని తిరుగుతుంటే సహాయంచేసేవారు ఒక్కరూలేరు ఉద్యోగందొరకక సతమతమవుతుంటే ఆదుకొనేవారు ఒక్కరూలేరు నిదురరాక పొర్లాడుతుంటే స్వాంతనకలగచేసేవారు ఒక్కరూలేరు కలతచెంది కలవరపడుతుంటే ధైర్యంచెప్పేవారు ఒక్కరూలేరు ఆడపిల్లపై అత్యాచారంచేస్తుంటే అడ్డుపడేవారు ఒక్కరూలేరు మనసు కకావికలమైతే వెన్నంటినిలిచేవారు ఒక్కరూలేరు మానవత్వం చచ్చిపోయిందా నోర్లు మూసుకపోయాయా చేతులు చచ్చుబడ్డాయా నీతులు మాటలకేపరిమితమా దయాదాక్షిణ్యాలు అంతమయ్యాయా దాతృత్వము నశించిందా సమాజము కళ్ళుమూసుకుందా ప్రభుత్వాలు పట్టించుకోవటంలేదా నేతిబీరకాయల్లో  నిండుకున్న నెయ్యిలాగా మానవుల్లో మానవత్వం తయారయిందా మానవుల్లారా మేల్కొనండి మానవత్వాన్ని మరవకండి స్వార్ధాన్ని తగ్గించుకోండి సేవాగుణాన్ని పెంపొందించుకోండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కాలచక్రమా! కదులుకదులు కాలమా ముందుకుకదులు కాలమా నిలిచిపోకు కాలమా నిదురబోకు కాలమా          ||కదులు|| అందాలను చూపిస్తూ ఆనందాలను కూరుస్తూ కేరింతలు కొట్టిస్తూ చిందులు వేయిస్తూ             ||కదులు|| విజయాలను దక్కిస్తూ లక్ష్యాలను చేరుస్తూ విలువలను పెంచుతూ అక్రమాలను త్రుంచుతూ        ||కదులు|| విద్యాబుద్ధులు నేర్పుతూ విఙ్ఞానాన్ని పెంచుతూ సన్మార్గాన నడుపుతూ వెలుగులు చిమ్ముతూ            ||కదులు|| కష్టాలను తొలగిస్తూ సుఖాలను కలిగిస్తూ చిరునవ్వులు చిందిస్తూ మోములను వెలిగిస్తూ           ||కదులు|| ఊహలను ఊరిస్తూ ఉల్లాసము కలిగిస్తూ మమతల్లో ముంచుతూ  మదులను మురిపిస్తూ           ||కదులు|| రేయిపగలు మారుస్తూ రోజులను గడుపుతూ ఋతువులను మారుస్తూ వత్సరాలు గడుపుతూ          ||కదులు|| కోకిలలా కూస్తూ నెమలిలా నర్తిస్తూ చిలుకలా పలుకుతూ చిన్నారులలా లాలిస్తూ         ||కదులు|| పువ్వులను పూయిస్తూ ...
Image
 కవితా! ఓ కవితా! నీవు నాతోడుంటే దృశ్యాలపై దృష్టిసారిస్తా అందాలకవితలుగా మార్చుతా నీవు నావెంటుంటే అక్షరాలను పువ్వుల్లా అల్లుతా పదాలను నదినీరులా పారిస్తా నీవు నాకునీడనిస్తే రెక్కలకష్టం మరుస్తా అద్భుతకవనాలు వెలువరిస్తా నీవు నాకు ఊహలిస్తే చిక్కనిపదాలను ప్రయోగిస్తా చక్కని కైతలనుసృష్టిస్తా నీవు నాకు ఊతమిస్తే కవితాశిఖరాలను అధిరోహిస్తా ఉన్నతమైనభావాలను వ్యక్తీకరిస్తా నీవు  నాకు అండగానిలిస్తే కవిత్వలోతుల్లోకి వెళ్తా గాఢమైనసాహిత్యాన్ని వెల్లడిస్తా నీవు నా పక్కనుంటే ప్రకృతిని తిలకిస్తా సహజసౌందర్యాలను వర్ణిస్తా నీవు నామదిలో నిలిస్తే కవితాజల్లులు కురిపిస్తా పాఠకులను మురిపిస్తా నీవు నా వెన్నుతడితే ఆకాశంలో విహరించొస్తా రవిచంద్రతారకుల కైతలుకూర్చుతా నీవు నన్ను ప్రోత్సహిస్తే కవనసేద్యం సాగిస్తా కవితాపంటలు పండిస్తా కవితా నా వెంటనడు నాచేత కైతలు వ్రాయించు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కమ్మని కవితకోసం అక్షరాలను పోగుచేశా పొత్తమందు పేర్చేశా పూలరంగులు పులిమా పరిమళాలు పైనచల్లా వానచినుకులు కుమ్మరించా కల్మషాలను కడిగివేశా సూర్యకాంతులు వెదజల్లా వెలుగులను ప్రతిబింబించా చిరునవ్వులు చిందించా ఎగ్గుసిగ్గులు ప్రదర్శింపజేశా వెన్నెలను కురిపించా వయ్యారాలు ఒలికించా తేనెను చల్లా సీతాకోకచిలుకలను ఎగిరించా సూదంటురాళ్ళు తగిలించా తలలకు అంటించా బాలను చేశా ముద్దుమాటలు పలికించా కన్యను చేశా సమ్మోహనాస్త్రము సంధింపజేశా నింగిన ఎగరేశా హరివిల్లుపైన ఊయలనూగించా అందంగా తీర్చిదిద్దా అంతరంగాలకు తాకేలాచేశా కవితను చేశా కమ్మదనాలు కురిపించా కైతను క్రోలండి కవిపేరును తలచండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 కవులరాతలు రాతలు అమృతముకురిపించాలి కవితలు చెరకురసముత్రాగించాలి అక్షరాలు పనసతొనలనుతలపించాలి పదాలు మధురమామిడిపంద్లవ్వాలి భావాలు తేనెచుక్కలనుచిందించాలి కలము ఎలనీరునుసేవింపజేయాలి హస్తవ్రాతలు రసగుల్లాలనువడ్డించాలి కవనము ద్రాక్షారసముచేతికివ్వాలి కవిత్వము పవిత్రగంగాజలమునందించాలి  మాటలు నోర్లలోచాకులెట్లులాగానానాలి పలుకులు పాఠకులమదులనుకరిగించాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవనకబుర్లు ప్రచురిస్తే అక్షరాలు కదలవు పుటలు కదులుతాయి పుస్తకాలు కదులుతాయి పఠిస్తే పదాలు కదలవు పెదవులు కదులుతాయి శబ్దతరంగాలు కదులుతాయి చూస్తే దృశ్యాలు కదలవు కళ్ళు కదులుతాయి చూపులు కదులుతాయి సంతోషిస్తే నవ్వులు కదలవు బుగ్గలు కదులుతాయి ముఖకవళికలు కదులుతాయి తలిస్తే తలలు కదలవు భావాలు కదులుతాయి మదులు కదులుతాయి స్ఫృశిస్తే ఆకారాలు కదలవు అనుభూతులు కలుగుతాయి అభిప్రాయాలు కలుగుతాయి పాడితే పాటలు కదలవు స్వరాలు కదులుతాయి రాగాలు కదులుతాయి కవిత్వీకరిస్తే విషయాలు కదలవు ఆలోచనలు కదులుతాయి అంతరంగాలు కదులుతాయి కవులారా కమ్మనికవితలు వ్రాయండి పాఠకులమదులు తట్టండి పాఠకులారా కదలండి కదలండి కవులవెంట కదలండి కవితలను చదవండి కవిత్వాన్ని ఆస్వాదించండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 స్వేచ్ఛావిహంగం చేతికి అడ్డంలేదు నోటికి అడ్డంలేదు పనికి అడ్డంలేదు పలుకలకి అడ్డంలేదు అందానికి పరిమితులులేవు ఆనందానికి పరిమితులులేవు చూపులకి పరిమితులులేవు ఆస్వాదనకి పరిమితులులేవు కవికి కట్టుబాట్లులేవు కవితలకి కట్టుబాట్లులేవు విషయాలకి కట్టుబాట్లులేదు వివరణలకి కట్టుబాట్లులేవు కలానికి బంధాలులేవు కల్పనలకి బంధాలులేవు అక్షరాలకు బంధాలులేవు పదాలకి బంధాలులేవు మనసులకి సంకెళ్ళులేవు మనుషులకి సంకెళ్ళులేవు ఆలోచించటానికి సంకేళ్ళులేవు అమలుచేయాటానికి సంకెళ్ళులేవు స్వేచ్ఛగా ఆలోచించండి స్వేచ్ఛగా అవలోకించండి స్వేచ్ఛగా తిరగండి స్వేచ్ఛగా బ్రతకండి పక్షిలా గాలిలో ఎగరండి మబ్బులా ఆకాశంలో తేలండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 జీవనగమనంలో.... నిశ్శబ్దం గొంతును నొక్కేస్తుంది నిర్వేదం మనసును త్రొక్కేస్తుంది నిరీక్షణ కాలాన్ని నిదానంచేస్తుంది నిరాదరణ మేనును క్రుంగదీస్తుంది నిరాశ అనందాన్ని దూరంచేస్తుంది నిర్దాక్షణ్యం మానవత్వాన్ని మంటకలుపుతుంది నిర్లిప్తత ఇష్టాలను వదిలిస్తుంది నిర్లక్ష్యం గమ్యాలను విడిపిస్తుంది నియమం చేతులు కట్టేస్తుంది నిర్వాణం వదలక వెంటబడుతుంది నిస్సిగ్గు వెధవపనులు చెయ్యిస్తుంది నిసి భయకంపనలు పుట్టిస్తుంది నిరోధం అడ్డగిస్తుంది నిర్ధనం అడుక్కోమంటుంది నిట్టూర్పులు గుండెతో ఆడుతాయి నిర్మొహమాటాలు సూటిగా నడిపిస్తాయి చూచి ముందుకునడువు వేచి తీసుకోచర్యలు అనుకుంటే అన్నీ జరుగవు అనుకోకపోతే జరిగేవీ ఆగవు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 మార్పులుచేర్పులు కొత్తనీరు వచ్చింది పాతనీరు కొట్టుకుపోయింది కరెంటుబుడ్లు వచ్చాయి నూనెదీపాలు పోయాయి సినిమాలు వచ్చాయి నాటకాలు మాయమయ్యాయి ఓటీటీలు వచ్చాయి సినిమాహాల్లు మూతబడ్డాయి టీవీలు వచ్చాయి రేడియోలు కనుమరుగయ్యాయి ఆంగ్లభాష వ్యాపించింది తెలుగువాడుక తగ్గిపోయింది మోటారుబండ్లు వచ్చాయి కాళ్ళనడకలు తగ్గాయి సెల్లుఫోనులు వచ్చాయి సొల్లుకబురులు పెరిగాయి ఈమైలు వచ్చింది ఉత్తరాలను మరిపించింది చుడీదార్లు వచ్చాయి చీరెలు పోయాయి కుట్టుమెషిన్లు వచ్చాయి పంచెలుకండువాలు పోయాయి బ్రాయిలరుకోళ్ళు వచ్చాయి నాటుకోళ్ళు నశిస్తున్నాయి ముఖపుస్తకం వచ్చింది ప్రత్యక్షముచ్చట్లు తగ్గించింది వాట్సప్పు వచ్చింది మాట్లాడటము మరిపించింది వచనకవిత్వం వచ్చింది పద్యకవిత్వం బాగాతగ్గించింది సెంట్లసీసాలు వచ్చాయి సుమసౌరభాలు ఆస్వాదనలుతగ్గాయి బాలుపాయింటుపెన్నులు వచ్చాయి ఇంకుకలాలు మాయమైపోయాయి కంప్యూటరులు వచ్చాయి టైపుమెషిన్లు పోయాయి క్యాల్కులేటరులు వచ్చాయి నోటిలెక్కలు మరిచిపోయేలాచేశాయి డెబిటుక్రెడిటుకార్డులు వచ్చాయి నగదుచలామణి తగ్గించాయి కృత్తిమరసాలు వచ్చాయి పండ్లరసాలు త్రాగటంతగ్గింది మార్పులు గమనించండి చేర్పులు చేస్తుండండి గుండ్లపల్లి ...
Image
 జై తెలుగు తెలుగుమాటలు పుష్పాలయి పరిమళాలు వెదజల్లాలి తెలుగక్షరాలు దీపాలయి వెలుగులు చిమ్మాలి తెలుగుపదాలు తేటనీరయి పెదవులనుండి ప్రవహించాలి తెలుగుపలుకులు తేనెచుక్కలయి తియ్యదనాలు చిందాలి తెలుగుకవితలు సుందరమయి మదులను మురిపించాలి తెలుగుపాటలు శ్రావ్యమయి వీనులకు విందునివ్వాలి తెలుగుమోములు చంద్రవదనాలయి వెన్నెలను విరజిమ్మాలి తెలుగు లెస్సయి దేశవిదేశాల వ్యాపించాలి తెలుగుతల్లి మాతృమూర్తయి పిల్లలను పరిరక్షించాలి తెలుగుభాష అమృతమయి తెలుగుజాతిని అమరంచెయ్యాలి తెలుగుసీమ స్వర్గమయి సర్వసుఖాలకు నిలయంకావాలి జై తెలుగు జై జై తెలుగు జయహో తెలుగు జయహో జయహో తెలుగు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎంత బాగుండు? ఉరిమేవారికి అడ్డుపడి నోరుమూపిస్తే ఎంత బాగుండు తరిమేవారికి ఎదురుపడి కాళ్ళుకట్టేస్తే ఎంత బాగుండు కరిసేవారికి బుద్ధిచెప్పి పళ్ళూడకొడితే ఎంత బాగుండు కుమ్మేవారికి ఎదురునిలిచి కట్టడిచేస్తే ఎంత బాగుండు కారుకూతలుకూసేవారి చెంతకెళ్ళి మూతికితాళంవేస్తే ఎంత బాగుండు క్రిందకుపడదోచేవారి ప్రక్కకెళ్ళి చేతులకుబేడీలేస్తే ఎంత బాగుండు తన్నేవారిని నివారించి కాళ్ళువిరగకొడితే ఎంత బాగుండు నిందించేవారిని నిరోధించి మూగవాడినిచేస్తే ఎంత బాగుండు తిట్టేవారిని తృణీకరించి నాలుకకోసేస్తే ఎంత బాగుండు నిప్పులుకక్కేవారిని చుట్టుముట్టి నీటినికుమ్మరిస్తే ఎంత బాగుండు పండంటికాపురాల్లో కుంపటిపెట్టేవారికి బడితపూజచేస్తే ఎంత బాగుండు కళ్ళల్లో నిప్పులుపోసుకునేవారి కన్నుల్లోకారంచల్లితే ఎంత బాగుండు సంఘములోని కుళ్ళును సమూలంగాకడిగిపారేస్తే ఎంత బాగుండు సమాజవికాసానికి శ్రమించి సర్వులూసహాయపడితే ఎంత బాగుండు నాకృషిలో ముందుకొచ్చి అందరూసహకరిస్తే ఎంత బాగుండు బాగుబాగు ఈకవిత బహుబాగుయంటే ఎంత బాగుండు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఒయ్యారి వగలమారి వగలుచూపుతుంటే మడికట్టుకొనికూర్చుంటానా మెదలకుండాయుంటానా చక్కనిచుక్క పిలుస్తుంటే పలకరించకుండాయుంటానా ప్రక్కకుపోకుండాయుంటానా లేతబుగ్గలు సిగ్గులొలుకుతుంటే గులాబీలనుకోనా చేతితోతడమనా పువ్వులా పరిమళంవీస్తుంటే పీల్చనా పులకరించనా గాజులను గలగలామ్రొగిస్తుంటే తలతిప్పనా అందాలుకననా కోకిలలా రాగంతీస్తుంటే చెవులుమూసుకుంటానా వినకుండాయుంటానా హంసలా అడుగులేస్తుంటే పరికించనా పరవశించనా నెమలిలా పురివిప్పితే నాట్యంచూడనా నేత్రాలప్పగించనా మోము నవ్వులుచిందుతుంటే అటేచూడనా ఆనందంపొందనా జాబిలిలా వెన్నెలవిసురుతుంటే వేడుకచేసుకోనా వినోదంపొందనా తారలా తళతళలాడుతుంటే వీక్షించనా విస్తుపోనా చూపులతో వలవిసురుతుంటే చిక్కనా దొరకనా కళ్ళతో ప్రేమజల్లులుకురిపిస్తుంటే తడవనా ముద్దయిపోనా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎమ్మెలాడి... ఏదో ఊహిస్తున్నట్లున్నది ఏవో కావాలనుకున్నట్లున్నది ఏమిటో చెప్పాలనుకుంటునట్లున్నది ఎక్కడో మనసుపోగొట్టుకున్నట్లున్నది ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లున్నది ఏకాంతంగా కూర్చొనియున్నది ఎవరికీ మోమునుచూపించకయున్నది ఎవరితోనో మాట్లాడాలనుకుంట్లున్నది ఏడిపించనిక ఎకాయకీ చెలినిచేరుతా ఎదురుగా కూర్చుంటా ఎకసకెములు ఆడుతా ఏకాకిని ఇకచెయ్యనంటా ఎదలోస్థానం సుస్థిరంచేసుకుంటా ఎడబాటుకు అవకాశమివ్వనంటా ఎలదోటకు విహారానికితీసుకెళ్తా ఎలనవ్వులు చిందించమంటా ఎలమిని అందించుతా ఎల్లిదం చేయనంటా ఎన్నడూ ఏపరించనంటా ఏమరచి తన్మయత్వపరుస్తా ఎలనీరును త్రాగించుతా ఎప్పుడూ ప్రక్కనేనిలుస్తానంటా ఎన్నడూ వీడననిచెబుతా ఎగతాళిచేయక మెడనతాళికడతానంటా ఏకమై జీవితంగడుదామంటా ఏడాదిలో ముగ్గురవుదామంటా ఏకాంగులుగా నిలిచిపోదామంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాఝరులు కవితల అమృతంకురిపిస్తా గొంతుకలు తడుపుకోమంటా కవితల విందునిస్తా కడుపులు నింపుకోమంటా కవితల కుసుమాలుచల్లుతా పొంకాలను చూడమంటా కవితల సౌరభాలువెదజల్లుతా పరిసరాలను పరవశపరుస్తా కవితల వరదపారిస్తా కల్మషాలను కడిగేస్తా కవితల జల్లుకురిపిస్తా తనువులుతడిపేస్తా మనసులుమురిపిస్తా కవితల పంటలుపండిస్తా కమ్మనిరుచులు అందిస్తా కవితల సాగరాన్నిచిలుకుతా వెన్నపూసని వెలికితీసియందిస్తా కవితల పిపాసకలిగిస్తా కమ్మనికైతలిని త్రాగిస్తా కవితల రాగాలుతీస్తా కర్ణాలకింపు కలిగిస్తా కవితల జ్వాలనురగిలిస్తా కవితలచుట్టు తిప్పిస్తా కవితల చతురతచూపిస్తా చదువరులను సంతసపరుస్తా కవితలకొరకు కాచుకోమంటా కవితారసమును క్రోలుకోమంటా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 సాహితీసేద్యం సేద్యం సాగుతుంది స్వేదం చిందుతుంది ఆలోచనలు చిగురించాయి మొలకలు పల్లవించాయి అక్షరాలు అల్లుకున్నాయి మొక్కలు మొగ్గలేశాయి పదాలు ప్రాకాయి పువ్వులు పూచాయి కైతలు జాలువారాయి నీరు కాలవనపారాయి పంటలు పండాయి ఇండ్లకు చేరాయి విందుకు ఆహ్వానం వేడుకకు సిద్ధం వంటకాలు తయారు వడ్డనలు మొదలు కడుపులు నింపుకోండి పరవశాలు పంచుకోండి చప్పట్లు కొట్టండి ముచ్చట్లు చెప్పండి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 కవితాచేష్టలు (కవితను నేను) తలచితే ప్రత్యక్షమవుతా తిన్నగా వ్యవహారంలోకిదించుతా అడిగితే విషయాన్నిస్తా అందంగా విరచించమంటా కావాలంటే మనసునుతడతా కమ్మగా కొత్తతరహాలోకూర్చమంటా పిలిస్తే పక్కకొస్తా పుటలపై పేర్చమంటా అల్లితే ఆనందిస్తా అక్షరాలనై అలరిస్తా పొగిడితే పరవశిస్తా పదాలనై పేజీలకెక్కుతా కోరితే కలలోకొస్తా కవ్వించి కలమునుపట్టిస్తా ప్రేమిస్తే పొంగిపోతా ప్రతిదినము పనిపెడతా సోకుచేస్తానంటే సమ్మతిస్తా సోయగాలతో సందడిచేస్తా పంపితే పయనిస్తా పత్రికలలోసమూహాలలో పాఠకులకుచేరువవుతా ప్రచురిస్తే పుస్తకాలకెక్కుతా ప్రతులనై పలువురునిచేరుతా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఇంకా ఎందుకు మిగులుతావు? కళ్ళుకార్చే కన్నీరుగా కంట్లోపడిన నలుసుగా ఇంకా ఎందుకు మిగులుతావు? పగలునుతరిమే చీకటిగా తుపాకులుప్రేల్చే తూటాగా ఇంకా ఎందుకు మిగులుతావు? తలలునరికే కత్తిలా చేతులుకట్టేసే పగ్గముగా ఇంకా ఎందుకు మిగులుతావు? పగలునుతరిమే చీకటిగా దహనంచేసే నిప్పుగా ఇంకా ఎందుకు మిగులుతావు? మోములయందు ఏడుపుగా మదులయందు దఃఖముగా ఇంకా ఎందుకు మిగులుతావు? కాళ్ళకు గుచ్చుకొనే కంటకములా కాయానికి తగిలే గాయములా ఇంకా ఎందుకు మిగులుతావు? రక్తముత్రాగే దోమలా దోపిడిచేసే దొంగలా ఇంకా ఎందుకు మిగులుతావు? నదిప్రవాహములో సుడిగుండముగా ఉపరితలంపైన సుడిగాలిగా ఇంకా ఎందుకు మిగులుతావు? నింగినుండిపడే పిడుగులా జోరువానలతో వరదగా  ఇంకా ఎందుకు మిగులుతావు? ప్రాణముతీసే హంతకుడిగా మానముచెరచే మృగానివిగా ఇంకా ఎందుకు మిగులుతావు? పొలాల్లో కలుపులా పంటల్లో చీడలా ఇంకా ఎందుకు మిగులుతావు? ఏలనో తడుతుంది ఏదో వెలితి ఎక్కడో గల్తి ఎవిరిదో వేదన ఎందుకో రోదన ఇక సహించలేను ఏడుపులను బాధలను కష్టాలను నష్టాలను ఇంకా మిగిలితే తరుముతా త్రొక్కుతా తంతా తగలేస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం